September 28 Telugu news Updates: కృష్ణంరాజు స్మృతివనం.. ఏపీ సర్కార్ నిర్ణయం-telangana and andhrapradesh telugu live news updates on 29th september 2022 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  September 28 Telugu News Updates: కృష్ణంరాజు స్మృతివనం.. ఏపీ సర్కార్ నిర్ణయం

ఏపీ తెలంగాణ వార్తలు,

September 28 Telugu news Updates: కృష్ణంరాజు స్మృతివనం.. ఏపీ సర్కార్ నిర్ణయం

11:24 AM ISTSep 29, 2022 04:51 PM Mahendra Maheshwaram
  • Share on Facebook

  • Today Telugu News Updates: సెప్టెంబర్ 29 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వార్తల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి. లైవ్ అప్ డేట్స్ కోసం ఎప్పటికప్పుడూ పేజీని రిఫ్రెష్ చేస్తూ ఉండండి

Thu, 29 Sep 202211:23 AM IST

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం…

రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు గౌరవార్థం ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన పేరిట స్మృతి వనం ఏర్పాటు కోసం రెండెకరాల భూమి మంజూరు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మొగల్తూరులో గురువారం జరిగిన కృష్ణంరాజు సంస్మరణ సభకు హాజరైన మంత్రులు నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ సభకు ఏపీ ప్రభుత్వం తరపున మంత్రులు కారుమూరి, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఆర్కే రోజాతో పాటు ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాదరాజు హాజరయ్యారు.

Thu, 29 Sep 202210:27 AM IST

సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్…

అన్ని జిల్లా కలెక్టర్లతో ఏపీ సీఎం జగన్ స్పందన వీడియో కాన్ఫరెన్స్‌ చేపట్టారు. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో కేటాయించిన నిధులపై చేపట్టారు. విలేజ్ క్లీనిక్స్, ఈ క్రాపింగ్, టిడ్కో ఇళ్ల, జగనన్న ఇళ్ల వంటి పథకాలపై దిశానిర్దేశం చేయనున్నారు.

Thu, 29 Sep 202209:59 AM IST

రేపు యాదాద్రికి కేసీఆర్..

రేపు  సీఎం కేసీఆర్ యాదాద్రికి వెళ్లనున్నారు.  స్వామి వారికి బంగారు తాపడం కోసం విరాళం ఇవ్వనున్నారు.

 

Thu, 29 Sep 202208:50 AM IST

బీ కేటగిరి సీట్లు కేటాయింపుయ…

వెయ్యికి పైగా తెలంగాణ విద్యార్థులకు ఎంబీబీఎస్ బీ కేటగిరి సీట్లు కేటాయిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. బీ కేటగిరీ సీట్లలో 85శాతం లోకల్ రిజర్వేషన్ వర్తించనుంది. ఇక నుంచి కేవలం 15 శాతం మాత్రమే ఓపెన్ కోటాలో సీట్లు భర్తీ చేయనున్నారు. ఈ నిర్ణయంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Thu, 29 Sep 202208:40 AM IST

ముగిసిన భేటీ…

పోలవరం పై కేంద్రజలశక్తి శాఖ వర్చువల్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో తెలంగాణ , ఏపీ , ఛత్తీస్‌గఢ్ , ఒడిశా రాష్ట్రాల అధికారులు పాల్గొన్నారు.పోలవరం బ్యాక్‌వాటర్ ఎఫెక్ట్‌పై థర్డ్ పార్టీతో విచారణ జరిపించాలని తెలంగాణ డిమాండ్ చేసింది. ప్రాజెక్ట్ నిర్మాణంలో అనేక మార్పులు జరిగాయని... దీనితో ముంపు సమస్య కూడా తీవ్రంగా ఉందని కేంద్రజలశక్తి శాఖకు మూడు రాష్ట్రాలు తెలిపాయి. ఈ క్రమంలో వచ్చే నెల 7న మరోసారి భేటీ కావాలని కేంద్ర జలశక్తిశాఖ నిర్ణయించింది.

Thu, 29 Sep 202206:36 AM IST

విజయ గోవిందం టూర్ ప్యాకేజీ…… 

irctc tourism announced tirumala tour tour package: వేర్వురు ప్రదేశాలను దర్శించుకునేందుకు కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. తాజాగా రాజమండ్రి నుంచి తిరుమల, తిరుచానూరు ప్రాంతాలను చూసేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. VIJAY GOVINDAM పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ట్రైన్ జర్నీ ద్వారా సాగే ఈ టూర్ లో... పలు ప్రాంతాలకు వెళ్తారు. అక్టోబర్ 7 వ తేదీన ఈ టూర్ అందుబాటులో ఉంది. ప్రతి శుక్రవారం తేదీల్లో ఈ టూర్ ను ఆపరేట్ చేసున్నారు. 2 రాత్రులు, 3 రోజుల టూర్ ప్యాకేజీ ఇది.

Thu, 29 Sep 202205:56 AM IST

కీలక భేటీ..

ఇవాళ పోలవరం ప్రాజెక్టు ముంపు, బ్యాక్‌ వాటర్‌ ప్రభావంపై కీలక భేటీ జరగనుంది. చత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణ ప్రభుత్వాల సందేహాలను నివృత్తి చేయడమే అజెండాగా కేంద్ర ప్రభుత్వం గురువారం కీలక సమావేశాన్ని నిర్వహించబోతోంది. ఏపీ, తెలంగాణ, చత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో కేంద్ర జల్‌ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్, కేంద్ర అటవీ పర్యావరణ శాఖ కార్యదర్శి రామేశ్వర్‌గుప్తా సమావేశం కానున్నారు.వర్చువల్‌గా ఈ భేటీ కొనసాగనుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ సమావేశాన్ని నిర్ణయించారు.

Thu, 29 Sep 202205:29 AM IST

రెయిన్ అలర్ట్…..

Rain Alert For Telangana: రానున్న రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం,దాని పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కారణంగా ఈ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మరోవైపు ఇవాళ, రేపు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఆసిఫాబాద్, నిజామాబాద్, కొత్తగూడెం, నల్గొండ, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబద్, మేడ్చల్, మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడకక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని తెలిపింది.

Thu, 29 Sep 202204:27 AM IST

ప్రత్యేక రైళ్లు…

South Central Railway Special Trains Latest: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని ఇప్పటికే పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు ప్రవేశపెట్టగా... దసరా పండగ నేపథ్యంలో తాజాగా మరికొన్నింటిని ప్రకటించింది. ఇందులో భాగంగా సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం, విశాఖపట్నం నుంచి మహబూబ్ నగర్ నగరాల మధ్య ప్రత్యేక రైళ్లను నడపనుంది.

Thu, 29 Sep 202204:11 AM IST

ఏపీపీఎస్సీ నోటిఫికేషన్…..

 

ఏపీలోని  పలు ప్రభుత్వ విభాగాల్లో 269 ఉద్యోగాల భర్తీకి ఎపీపీఎస్సీ నోటిఫికేషన్లు విడుదల చేసింది. పలు విభాగాల్లో 6 గ్రూప్ 4 ఉద్యోగాలు, 45 నాన్ గెజిటెడ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన జారీ చేసింది. ఆయుష్ ఆయుర్వేద విభాగంలో 3 లెక్చరర్లు లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన ఇచ్చింది. ఆయుష్ హోమియో విభాగంలో 34 లెక్చరర్లు లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్లు భర్తీ చేయనున్నట్లు తెలిపింది.

Thu, 29 Sep 202204:10 AM IST

సింహవాహనంపై శ్రీవారు,

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు తిరుమలలో వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో మూడో రోజైన గురువారం ఉదయం శ్రీనివాసుడు సింహ వాహనంపై దర్శనమిచ్చారు. నిద్రలేవగానే దర్శించే వాటిలో అతి ముఖ్యమైంది సింహదర్శనం. సింహవాహనం దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంతమవుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ముందుకు సాగి సర్వత్రా విజయం సాధించి ఆధిపత్యంతో రాణించే స్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహమూ సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ వాహనోత్సవం ద్వారా శ్రీవారు నిరూపిస్తున్నారు.