SC On MLAs Poaching Case :ఎమ్మెల్యేలకు ఎర కేసులో యథాతథ స్థితి…-supeme court status co orders on mlas poaching case until juluy 31 2023 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Supeme Court Status Co Orders On Mlas Poaching Case Until Juluy 31 2023

SC On MLAs Poaching Case :ఎమ్మెల్యేలకు ఎర కేసులో యథాతథ స్థితి…

HT Telugu Desk HT Telugu
Mar 13, 2023 01:46 PM IST

SC On MLAs Poaching Case ఎమ్మెల్యేలకు ఎర కేసులో తెలంగాణ ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానంలో పాక్షిక ఊరట లభించింది.ఎమ్మెల్యేలకు ఎర కేసును సిబిఐకు అప్పగిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో ఛాలెంజ్ చేసింది.స్టే ఇవ్వడానికి నిరాకరించిన సుప్రీం కోర్టు స్టేటస్ కో విధించింది

సుప్రీం కోర్టు (ANI Photo)
సుప్రీం కోర్టు (ANI Photo)

SC On MLAs Poaching Case తెలంగాణలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కేసులో యథాతథ స్థితిని అమలు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఊరట దొరికింది. ఈ కేసు విచారణ జులై 31కు వాయిదా పడింది. వేసవి సెలవుల అనంతరం కేసు విచారణ చేపడతామని ధర్మాసనం ప్రకటించింది.

ట్రెండింగ్ వార్తలు

తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు రికార్డులు సిబిఐకు అప్పగించాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు పేర్కొంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఫిబ్రవరి 8న ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిబిఐ దర్యాప్తుపై స్టే ఇవ్వడానికి సుప్రీం కోర్టు ధర్మాసనం నిరాకరించింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది.

ఎమ్మెల్యేలకు ఎర కేసులో చాలా అంశాలపై విచారణ జరగాల్సి ఉందని, హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ పెద్దలపై ఆధారాలు ఉన్నాయని, దేశ వ్యాప్తంగా ప్రభుత్వాలను కూల్చిన ఉదంతాలు ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలను లొంగ దీసుకోడానికి కేంద్ర దర్యాప్తు సంస్థలను వినియోగిస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం కేసు విచారణ దశలో ఉందని ఈ దశలో సిబిఐ, ఈడీ దర్యాప్తులో జోక్యం చేసుకోకుండా చూడాలని విజ్ఞప్తి చేసింది

ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఎవరెవరి పాత్ర ఏమిటో తేల్చాల్సి ఉందన్నారు. హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వ వాదనల్ని సిబిఐ అభ్యంతరం తెలిపింది. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత కేసులో యథాతథ స్థితిని కొనసాగించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ కేసులో తెలంగాణ కోరినట్లు హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వకపోయినా స్టేటస్ కో జారీ చేసింది. జులై 31వరకు కేసు దర్యాప్తు పత్రాలను సిబిఐకు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి పాక్షిక ఊరట దక్కినట్లైంది.

ఏం జరిగిందంటే …..

ఎమ్మెల్యేలకు ఎర కేసులో తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే విధించడానికి సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఎమ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తును సిబిఐకు అప్పగించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును డివిజన్‌ బెంచ్‌లో సవాలు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో మంగళవారం తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

ఎమ్మెల్యేలకు ఎర కేసును సిబిఐకు అప్పగించాలనే తెలంగాణ హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. తెలంగాణ హైకోర్టు తీర్పుపై అత్యవసరం విచారణ జరపాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తితో బుధవారం చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ కేసులో అత్యవసర విచారణ జరపాలని కోరినా ఫిబ్రవరి 8న పరిశీలిస్తామని సీజే ప్రకటించారు. కోర్టు ప్రారంభమైన వెంటనే హైకోర్టు డివిజన్ బెంచ్‌ ఇచ్చిన ఉత్తర్వులపై స్టేఇవ్వాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తిని పరిశీలించిన సుప్రీం కోర్టు సిట్ దర్యాప్తుపై స్టేటస్ కో ఇవ్వడానికి నిరాకరించింది. ఈ కేసులో ప్రభుత్వ వాదనల్లో ఏదైనా మెరిట్స్ ఉంటే హైకోర్టు ఉత్తర్వులను రివర్స్‌ చేస్తామని చెప్పారు. కేసు విచారణను ఈ నెల 17 నుంచి వింటామని ప్రకటించాచు.

ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై హైకోర్టులో జరిగిన విచారణలో రాష్ట్ర ప్రభుత్వానికి కోరుకున్న విధంగా ఉపశమనం లభించకపోవడంతో, డివిజన్ బెంచ్ ఉత్తర్వులపై సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఇప్పటి వరకు సిట్ నమోదు చేసిన ఫైళ్లను ఇవ్వాలని సీబీఐ ఒత్తిడి చేస్తుందన్న ఏజీ కోర్టుకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఓసారి సీఎస్‌కు సీబీఐ లేఖ రాసిందని చెప్పిన అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు.

మరోవైపు తెలంగాణ హైకోర్టులో డివిజన్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులపై సింగిల్ బెంచ్ ముందుకు ఎలా వెళతారని హైకోర్టు ప్రశ్నించింది. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టుదే తుది నిర్ణయమని డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలకు ఎర కేసులో యథాతథ స్థితిని అమలు చేయడానికి స్టేటస్ కో ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. కేసు లో మెరిట్స్ ఉంటే హై కోర్ట్ తీర్పును రివర్స్ చేస్తామని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు.

IPL_Entry_Point