Hyd Tirupati Special Trains: తిరుపతికి ప్రత్యేక రైళ్లు.. వయా నల్గొండ, గుంటూరు-south central railway announced special trains between secunderabad tirupati city ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  South Central Railway Announced Special Trains Between Secunderabad Tirupati City

Hyd Tirupati Special Trains: తిరుపతికి ప్రత్యేక రైళ్లు.. వయా నల్గొండ, గుంటూరు

HT Telugu Desk HT Telugu
Oct 13, 2022 09:08 AM IST

south central railway special trains: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా గుడ్ న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే. పలు రూట్లలో ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.

సికింద్రాబాద్ తిరుపతి ప్రత్యేక రైళ్లు,
సికింద్రాబాద్ తిరుపతి ప్రత్యేక రైళ్లు,

South Central Railway Special Trains Latest: దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని ఇప్పటికే పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు ప్రవేశపెట్టగా... ప్రయాణికుల రద్ద నేపథ్యంలో తాజాగా మరికొన్ని స్పెషల్ ట్రైన్స్ ను ప్రకటించింది. ఇందులో భాగంగా సికింద్రాబాద్ - తిరుపతి ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ మేరకు వివరాలను చూస్తే....

ట్రెండింగ్ వార్తలు

secunderabad tirupati special trains: సికింద్రాబాద్ - తిరుపతి మధ్య అక్టోబర్ 14వ తేదీన ప్రత్యేక రైలును ప్రకటించారు అధికారులు. ఈ రైలు రాత్రి 8 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయల్దేరి మరునాడు ఉదయం 08.30 గంటలకు గమ్యస్థలానికి చేరుకుంటుంది.

ఇక తిరుపతి స్టేషన్ నుంచి అక్టోబర్ 15వ తేదీన ప్రత్యేక రైలు రాత్రి 07.50 నిమిషాలకు బయల్దేరుతుంది. ఇది మరునాడు ఉదయం 09.00 గంటలకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కు చేరుకుంటుంది.

ఆగే స్టేషన్లు ఇవే....

ఈ ప్రత్యేక రైళ్లు.... నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గుడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుందని అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్ల సేవలను ప్రయాణికులు ఉపయోగించుకోవాలని కోరారు.

ఈ ప్రత్యేక రైళ్లలో ఏసీ, సెకండ్ క్లాస్ ఏసీ, ఏసీ2 టైర్, ఏసీ 3 టైర్, స్లిపర్ క్లాస్, జనరల్ సెకండ్ సిట్టింగ్ కోచ్ లు ఉంటాయని పేర్కొన్నారు.

hyderabad -gorakhpur specail trains: హైదరాబాద్ - గోరఖ్ పూర్ మధ్య స్పెషల్ ట్రైన్స్ ను ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. అక్టోబర్ 14వ తేదీన హైదరాబాద్ నుంచి రాత్రి 09.05 గంటలకు బయల్దేరి... 15వ తేదీ ఉదయం 06.30 గంటలకు గోరఖ్ పూర్ చేరుతుంది. ఇక గోరఖ్ పూర్ నుంచి అక్టోబర్ 16వ తేదీన ఉదయం 08.30 గంటలకు బయల్దేరి... మరునాడు సాయంత్రం 04.20 గంటలకు చేరుతుంది.

ఈ ప్రత్యేక రైళ్లు... సికింద్రాబాద్, కాజీపేట్, పెద్దపల్లి, మంచిర్యాల, బాలర్షా, నాగ్ పూర్, భోపాల్, బీనా, వీరంగా, లక్ష్మీబాయి, ఓరాయి, పొఖ్రాయన్, కాన్పూర్, అయిశ్ బాగ్, లక్నో సిటీ, బర్ బంకీ, గోండా స్టేషన్లలో ఆగుతుందని అధికారులు ప్రకటించారు.

మరిన్ని ప్రత్యేక రైళ్లు….

hyderabad -gorakhpur specail trains: హైదరాబాద్ - గోరఖ్ పూర్ మధ్య స్పెషల్ ట్రైన్స్ ను ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. అక్టోబర్ 14వ తేదీన హైదరాబాద్ నుంచి రాత్రి 09.05 గంటలకు బయల్దేరి... 15వ తేదీ ఉదయం 06.30 గంటలకు గోరఖ్ పూర్ చేరుతుంది. ఇక గోరఖ్ పూర్ నుంచి అక్టోబర్ 16వ తేదీన ఉదయం 08.30 గంటలకు బయల్దేరి... మరునాడు సాయంత్రం 04.20 గంటలకు చేరుతుంది.

Bengaluru - visakha special trains: మరోవైపు బెంగళూరు - విశాఖ మధ్య ప్రత్యేక రైలును ప్రకటించారు అధికారులు, ఈ రైలు అక్టోబర్ 15వ తేదీన బెంగళూరు నుంచి మధ్యాహ్నం 03.50 నిమిషాలకు బయల్దేరుతుంది. మరునాడు ఉదయం 11 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.

ఈ స్పెషల్ ట్రైన్.... కృష్ణరాజాపురం, బంగారాపేట్, జోలార్ పేట్, కట్పాడీ, రేణిగుంట, గుడూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామల్ కోట్ తో పాటు దువ్వాడ స్టేషన్లలో ఆగుతుంది.

ఈ ప్రత్యేక రైళ్ల సేవలను ప్రయాణికులు వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ రైళ్లలో 2ఏసీ, 3ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు ఉంటాయని తెలిపారు.

IPL_Entry_Point