Gold Saree for Seethamma : భద్రాద్రి సీతమ్మకు సిరిసిల్ల నేతన్న బంగారు పట్టు చీర కానుక-sircilla handloom weaver gold pattu saree for bhadrachalam sitarama kalyanam ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Gold Saree For Seethamma : భద్రాద్రి సీతమ్మకు సిరిసిల్ల నేతన్న బంగారు పట్టు చీర కానుక

Gold Saree for Seethamma : భద్రాద్రి సీతమ్మకు సిరిసిల్ల నేతన్న బంగారు పట్టు చీర కానుక

HT Telugu Desk HT Telugu
Apr 15, 2024 04:09 PM IST

Gold Saree for Seethamma : భద్రాద్రి సీతమ్మకు సిరిసిల్ల నేతన్న బంగారం, వెండితో పట్టుచీర నేశారు. ఈ నెల 17 భద్రాచలంలో జరిగే సీతారాముల కల్యాణ మహోత్సవానికి ఈ పట్టుచీరను అమ్మవారికి అందించనున్నారు.

భద్రాద్రి సీతమ్మకు సిరిసిల్ల నేతన్న బంగారు పట్టు చీర కానుక
భద్రాద్రి సీతమ్మకు సిరిసిల్ల నేతన్న బంగారు పట్టు చీర కానుక

Gold Saree for Seethamma : సీతారాములపై తనకున్న భక్తిని మరోసారి చాటుకున్నారు సిరిసిల్ల(Sircilla Handloom) చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్. చేనేత కళానైపుణ్యంతో మగ్గంపై బంగారం వెండి పోగులతో పట్టుచీర నేసి తన ప్రతిభ చాటుకుంటున్నారు. ఈనెల 17న శ్రీరామనవమి(Bhadrachalam Srirama Navami) రోజున భద్రాచలంలో జరిగే సీతారాముల కల్యాణోత్సవానికి అందించే పనిలో నిమగ్నమయ్యారు.

yearly horoscope entry point

సిరిసిల్ల సీతమ్మ కల్యాణం చీర

భద్రాద్రి సీతారాముల కల్యాణానికి(Bhadradri Sitaramulu Kalyanam) సిరిసిల్లలో చీరను(Sircilla Saree) తయారు చేశారు నేత కార్మికుడు హరిప్రసాద్. ప్రతి సంవత్సరం సీతారాముల కల్యాణానికి ఆనవాయితీగా హరిప్రసాద్ చీర అందిస్తున్నారు. ఈసారి మరో అద్భుతమైన పట్టుచీరను చేనేత మగ్గంపై నేశారు. చీరపై సీతారాముల కల్యాణం వచ్చే విధంగా రూపొందించారు. చీర అంచులు భద్రాచలం దేవాలయంలో ఉన్నటువంటి సీతారాముల ప్రతిరూపాలు వచ్చే విధంగా చీర మొత్తం శంఖు చక్ర నామాలు, చీరపై బార్డర్లో జై శ్రీరామ్ వచ్చేలా తయారు చేశారు. ఆరు రోజుల పాటు శ్రమించి పట్టు చీరను చేనేత మగ్గంపై నేసినట్లు హరిప్రసాద్ తెలిపారు. ఈ చీర బరువు 800 గ్రాములు ఉంటుంది. ఇందులో రెండు గ్రాముల బంగారం, 150 గ్రాముల వెండి, పట్టుదారాలతో నేశారు హరిప్రసాద్. చీర కొంగులో సీతారాముల కల్యాణం బొమ్మ నేయడం విశేషం. సీతారాముల కల్యాణం చీరను శ్రీరామనవమి(Srirama Navami) రోజున అందిస్తానని హరిప్రసాద్ తెలిపారు.

నాడు అయోధ్య- నేడు భద్రాద్రి

పుణ్య దంపతులు.. ఆదర్శమూర్తులు... అయోధ్య(Ayodhya) రామయ్య సీతమ్మ కోసం సిరిసిల్ల చేనేత కార్మికుడు వెల్ది హరిప్రసాద్ దంపతులు గతంలో బంగారు చీర అందించారు. నేడు భద్రాచలం సీతమ్మకు బంగారు చీరను నేశారు. 8 గ్రాముల బంగారం, 20 గ్రాముల వెండితో 20 రోజులు శ్రమించి అయోధ్యలో బాలరాముడు(Ayodhya Balaram) విగ్రహ ప్రాణప్రతిష్ట సమయంలో బంగారు చీరను తయారు చేశారు. శ్రీరాముడి చిత్రంతో పాటు రామాయణ ఇతివృత్తాన్ని తెలియజేసే చిత్రాలను సైతం ఆ చీరలో పొందుపర్చడం విశేషం. లక్షా 50 వేల వ్యయంతో మగ్గంపై తయారు చేసిన చీరను గత జనవరి 26న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా అయోధ్య రామయ్య పాదాల చెంతకు చేర్చారు. దైవభక్తితో నేతన్న కళానైపుణ్యాన్ని చాటిచెప్పేలా హరిప్రసాద్ బంగారు పట్టు చీరలను(Gold Pattu Saree) తయారు చేయడంతో పలువురు అభినందిస్తున్నారు.

HT Correspondent K.V.REDDY, Karimnagar

Whats_app_banner

సంబంధిత కథనం