సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంపు ఆఫీసులో సీఎం రేవంత్ రెడ్డి ఫొటో పెట్టేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కాంగ్రెస్ నేతలను బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి ఇరువర్గాలను తరిమికొట్టారు.