SCR Special Trains: గుడ్‌న్యూస్.. వేసవి దృష్ట్యా ఈ రూట్ లో మే 14 వరకు ప్రత్యేక రైళ్లు-scr to run daily special trains between hyderabad to solapur ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Scr Special Trains: గుడ్‌న్యూస్.. వేసవి దృష్ట్యా ఈ రూట్ లో మే 14 వరకు ప్రత్యేక రైళ్లు

SCR Special Trains: గుడ్‌న్యూస్.. వేసవి దృష్ట్యా ఈ రూట్ లో మే 14 వరకు ప్రత్యేక రైళ్లు

HT Telugu Desk HT Telugu
Apr 27, 2023 01:47 PM IST

South Central Railway Special Trains: వేసవిలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రయాణికులకు అలర్ట్ ఇచ్చింది దక్షిణ మధ్య రైల్వే. పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ మేరకు తేదీలతో పాటు టైమింగ్స్ వివరాలను పేర్కొంది.

వేసవి ప్రత్యేక రైళ్లు
వేసవి ప్రత్యేక రైళ్లు

South Central Railway Special Trains Latest: ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అప్డేట్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోని ఇప్పటికే పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు ప్రవేశపెట్టగా... తాజాగా మరో రూట్ లో ప్రతిరోజూ సర్వీసులను నడపనుంది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఇందులో భాగంగా హైదరాబాద్ - సోలాపూర్ మధ్య స్పెషల్ ట్రైన్స్ ను ప్రకటించింది. వేసవి రద్దీ దృష్ట్యా వీటిని నడుపుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు వాటి వివరాలు చూస్తే….

హైదరాబాద్-సోలాపూర్(07003) రైలు ఉదయం 6 గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరి మధ్యాహ్నం 12.20 గంటలకు సోలాపూర్ చేరుకుంటుంది. ఇక సోలాపూర్-హైదరాబాద్(07004) రైలు మధ్యాహ్నం 1.20 గంటలకు బయలుదేరి రాత్రి 8.30 గంటలకు సోలాపూర్ చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైళ్లు బేగంపేట, లింగంపల్లి, వికారాబాద్, తాండూర్, సెడమ్, వాడి, షహాబాద్, కలబుర్గి, గనగాపూర్ రోడ్, అకల్‌కోట్ రోడ్డు, తిలతి రైల్వే స్టేషన్లలో ఆగుతాయి.

దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు
దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు

మే 14వ తేదీ వరకు రోజూ ఈ ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. ఈ రైళ్లలో ఏసీ చైర్ కార్, సెకండ్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు ఉంటాయని పేర్కొన్నారు. ఈ సేవలను ప్రయాణికులు ఉపయోగించుకోవాలని ఓ ప్రకటనలో తెలిపారు.

Whats_app_banner