RS Praveen Kumar: కేసీఆర్ ఆదేశాల మేరకే 'ఉపా' కేసులు.. ఎత్తివేయాలని ఆర్ఎస్పీ డిమాండ్-rs praveen kumar slams brs govt over uapa cases ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Rs Praveen Kumar: కేసీఆర్ ఆదేశాల మేరకే 'ఉపా' కేసులు.. ఎత్తివేయాలని ఆర్ఎస్పీ డిమాండ్

RS Praveen Kumar: కేసీఆర్ ఆదేశాల మేరకే 'ఉపా' కేసులు.. ఎత్తివేయాలని ఆర్ఎస్పీ డిమాండ్

Maheshwaram Mahendra Chary HT Telugu
Jun 24, 2023 01:28 PM IST

RS Praveen Kumar On UAPA Cases: కేసీఆర్ దోపిడీని ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఉపా లాంటి అక్రమ కేసులు పెడుతూ భయబ్రాంతులకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎఎస్ ప్రవీణ్ కుమార్
బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎఎస్ ప్రవీణ్ కుమార్

UAPA Cases in Telangana:ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఫైర్ అయ్యారు బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ముఖ్యమంత్రి చేసే దోపిడిని ప్రశ్నించే యూనివర్సిటీ ప్రొఫెసర్లు, సామాజిక ఉద్యమకారులపై ఉపా చట్టాల కింద కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి అక్రమ కేసులు పెడుతూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు. శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఆయన... బీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకే ములుగు జిల్లా తాడ్వాయిలో 152 మందిపై ఉపా కేసు నమోదు చేశారని ప్రవీణ్ కుమార్ అన్నారు. తిరిగి ముఖ్యమంత్రి కార్యాలయం నుండి వచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే కొందరి పేర్లు తొలగించారని చెప్పారు. దేశ సమగ్రత, సార్వబౌమత్వం కోసం ఏర్పాటుచేసిన చట్టాలను ఆదిపత్య పాలకులు తమ అనుకూలంగా మార్చుకుంటున్నారన్నారని విమర్శించారు.దేశవ్యాప్తంగా 25,200 ఉపా కేసులు నమోదైతే కేవలం 2 శాతం మందికే శిక్షలు పడ్డాయని గుర్తుచేశారు.మిగిలిన 98 శాతం మంది సామాజిక ఉద్యమకారులు ఏళ్ల తరబడి జైల్లో మగ్గుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.తాడ్వాయి కేసులో బీఎస్పీ నాయకులు ఉన్నారన్న ఆయన... తక్షణమే అందరిపై నమోదైన ఉపా కేసులను ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. ఉపా, రాజద్రోహం చట్టాలను రద్దు చేయాలన్నారు.

మంత్రిని బర్తరఫ్ చేయాలి - ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

గత తొమ్మిది ఏళ్ళుగా కేసీఆర్ పాలనలో విద్యా వ్యవస్థ పూర్తిగా నాశనమైందని డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. గురునానక్ యూనివర్సిటీలో విద్యార్థులు,మరి తల్లిదండ్రుల ఆందోళన పై స్పందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కనుసన్నల్లోనే రాష్ట్రంలో నకిలీ యూనివర్సిటీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయని విమర్శించారు. యూనివర్సిటీ ఛాన్స్లర్, రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ అనుమతి లేకుండానే గురునానాక్,శ్రీనిధి,కావేరీ,నిక్ మార్ ఇంజనీరింగ్ కాలేజీలు నకిలీ యూనివర్సిటీల పేరుతో గడిచిన విద్యాసంవత్సరం వేలాది మంది విద్యార్థులకు అడ్మీషన్లు ఇచ్చి ఘోరంగా మోసం చేయడం అన్యాయమన్నారు.నకిలీ యూనివర్సిటీలో అడ్మిషన్లు పొందిన వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు.ఏ విద్యార్థుల ప్రాణాల త్యాగాలు,పోరాటాల వల్ల ఏర్పడ్డ తెలంగాణలో నేడు విద్యార్థి లోకానికి తీరని అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ ప్రో. రవీందర్ గుప్తా లంచం తీసుకుంటూ ACB కి పట్టుబడ్డాడంటే రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఎంత అధ్వాన్నంగా మారిందో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు.

ఎన్ని కోట్లు కల్వకుంట్ల కుటుంబం చేతులు తాకితే వైస్ ఛాన్సలర్ పోస్టులు వస్తున్నాయో ఇక చెప్పనక్కర్లేదని అన్నారు ఆర్ఎస్పీ. తెలంగాణ ప్రభుత్వం ఉస్మానియా,కాకతీయ,పాలమూరు, మహాత్మాగాంధీ,తెలంగాణ వంటి అనేక విశ్వవిద్యాలయాలను శిథిలావస్థకు చేర్చి,ప్రయివేట్ యూనివర్సిటీలు,నకిలీ యూనివర్సిటీలకు అనుమతులు ఇచ్చిందని ఆరోపించారు.విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి తెలియకుండ రాష్ట్రంలో నకిలీ యూనివర్సిటీలు వెలిశాయా? అన్ని ప్రశ్నించారు. తక్షణమే విద్యాశాఖ మంత్రిని మంత్రివర్గం నుండి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

Whats_app_banner

సంబంధిత కథనం