Rangareddy News : రంగారెడ్డి జిల్లాలో విషాదం, చెరువులో పడి ఏడాదిన్నర చిన్నారి మృతి!
Rangareddy News : రంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఏడాదిన్నర చిన్నారి చెరువులో పడి మృతి చెందింది. చెరువుకు చిన్నారి ఇంటికి అర కిలోమీటర్ దూరం ఉండడంతో... ఈ ఘటనపై అనుమానాలు తలెత్తుతున్నాయి.
Rangareddy News : రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పరిధిలోని పుప్పాలగూడలో విషాదం చోటుచేసుకుంది. ఏడాదిన్నర చిన్నారి చెరువులో శవమై తేలింది. పుప్పలగుడా ప్రాంతానికి చెందిన చిన్నారి మోక్షిత (19 నెలలు) మంగళవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయింది. అప్పటి వరకు ఇంటి ముందు ఆడుకుంటూ ఉన్న చిన్నారి మోక్షిత సడన్ గా అదృశ్యమైంది. దీంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల ప్రాంతంలో వెతికినా... లాభం లేకుండా పోయింది. దీంతో తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కాగా బుధవారం స్థానికంగా ఉన్న చెరువులో చిన్నారి మృత దేహాన్ని పోలీసులు గుర్తించారు. అయితే చిన్నారి మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రమాదవశాత్తు చిన్నారి చెరువులో పడిందా? లేక ఎవరైనా హత్య చేసి చెరువులో పడేశారా? అనేది తెలియాల్సి ఉంది. కాగా చెరువుకు చిన్నారి ఇంటికి దాదాపు అర కిలోమీటర్ దూరం ఉంటుంది. కాగా ఆడుకుంటూ అంతా దూరం చిన్నారి ఎలా వెళ్లింది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి మృత దేహాన్ని చూసిన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. తమ కూతురు మోక్షిత ఒంటరిగా అంత దూరం వెళ్లదని....ఎవరో హత్య చేశారని చిన్నారి తల్లితండ్రులు, బంధువులు అంటున్నారు. ఈ ఘటనపై పోలీసులు పూర్తి సమాచారం ఇవ్వాల్సి ఉంది.
మద్యం మత్తులో కన్న తల్లినే హత్య చేసిన కొడుకు
తాగిన మైకంలో కన్నతల్లిని కుమారుడు కడతేర్చిన సంఘటన అనంతగిరి మండల పోలీస్ స్టేషన్ పరిధిలో తమ్మార బండ పాలెం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం తమ్మరబండ పాలెం సుందరయ్య నగర్ కు చెందిన పుట్ట బంతి రాములమ్మ 70 సంవత్సరాలు గత రెండు సంవత్సరాల క్రితం తన కుమారుడు పుట్ట బంతి వీరేశుతో కలిసి కరిడేపల్లి మండలం సర్వారం గ్రామంలో నుంచి వలస వచ్చి తామరబండపాలెంలో జీవనం కొనసాగిస్తున్నారు. వీరేశు తాపీ మేస్త్రీగా పనిచేస్తున్నాడు. మద్యానికి బానిసై నిత్యం తల్లిని చిత్రహింసలకు గురి చేసేవాడు. బుధవారం సైతం తాగిన మైకంలో తాగొద్దని వారించిన తల్లిని గొంతు నులిమి చంపాడు. విషయం తెలుసుకున్న అనంతగిరి ఎస్ఐ అనిల్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని నిందితుని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
మెదక్ లో దారుణం- చేపల వేటకు వెళ్లి ఇద్దరు మృతి
మెదక్ జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. మనోహరాబాద్ మండలం పరికిబండకు చెందిన ఇద్దరు చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు.... స్థానికులతో కలిసి మృతదేహాలను బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కాగా చేపల వేటకు వెళ్లి ఒకేసారి ఇద్దరూ మృత్యువాత పడటంతో పిరికి బండ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఎండీ యాసిన్ ఖాన్ (60), యాదయ్య (60)లు మంగళవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో గ్రామ చెరువులో చేపల వేటకు వెళ్లి చెరువులో వలవేసి చీకటి పడే సమయంలో చెరువులో దిగారు. అయితే చెరువులో వేసిన వలను తీస్తున్న క్రమంలో వల తెగిపోవడంతో యాసిన్ ఖాన్, యాదయ్య లు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు.
రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా
సంబంధిత కథనం