Rangareddy Double Murder : రంగారెడ్డి జిల్లాలో జంట హత్యలు- తండ్రి, మేనమామపై యువకుడు ఇనుపరాడ్డుతో దాడి-rangareddy crime news youth attacked drunk father relation with iron rod ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Rangareddy Double Murder : రంగారెడ్డి జిల్లాలో జంట హత్యలు- తండ్రి, మేనమామపై యువకుడు ఇనుపరాడ్డుతో దాడి

Rangareddy Double Murder : రంగారెడ్డి జిల్లాలో జంట హత్యలు- తండ్రి, మేనమామపై యువకుడు ఇనుపరాడ్డుతో దాడి

Bandaru Satyaprasad HT Telugu
Jan 27, 2024 10:12 PM IST

Rangareddy Double Murder : రంగారెడ్డి జిల్లాలో జంట హత్యలు కలకలం రేపాయి. మద్యానికి బానిసైన తండ్రి, మేనమామపై ఇనుప రాడ్డు యువకుడు దాడి చేశాడు. ఈ దాడిలో ఇద్దరూ మరణించారు.

రంగారెడ్డి జిల్లాలో దారుణం
రంగారెడ్డి జిల్లాలో దారుణం

Rangareddy Double Murder : రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ తగాదాలతో ఓ యువకుడు తండ్రి, మేనమామను పట్టపగలే నడిరోడ్డుపై దారుణంగా హత్య చేశాడు. మైలార్ దేవ్ పల్లి పరిధిలోని బాబుల్ రెడ్డి నగర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ తగాదాలతో తండ్రి లక్ష్మీ నారాయణతో పాటు మేనమామ శ్రీనివాస్ పై రాకేష్ అనే యువకుడు ఇనుప రాడుతో దాడి చేశాడు. వీరిద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అసలేం జరిగింది?

రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి బాబుల్‌రెడ్డి నగర్‌లో డబుల్ మర్డర్ జరిగింది. బాబుల్‌రెడ్డి నగర్‌కు చెందిన లక్ష్మీనారాయణ.. మద్యానికి బానిసై రోజూ భార్య, పిల్లలను వేధించేవాడు. ఇటీవల వారు నివసిస్తున్న ఇంటిని సైతం అమ్మకానికి పెట్టాడు. ఇల్లు అమ్మగా వచ్చే డబ్బులో తనకు రూ.20 లక్షలు తనకు ఇవ్వాలని లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులతో శనివారం సాయంత్రం గొడవ పడ్డాడు. అయితే అతడి భార్య డబ్బు ఇచ్చేందు అంగీకరించకపోవడంతో ఆమెపై దాడి చేశాడు. తల్లిని కొడుతుండగా కొడుకు రాకేష్ ఆపేందుకు ప్రయత్నించగా, అతడిపై కూడా లక్ష్మీనారాయణ దాడి చేశాడు. మద్యానికి బానిసై వేధిస్తున్నాడని తండ్రిని ఇంట్లో నుంచి బయటకు తీసుకొచ్చి కొడుకు రాకేష్ రాడ్డుతో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన లక్ష్మీనారాయణకు సాయం చేసేందుకు వచ్చిన మేనమామపైనా రాకేష్ దాడి చేశాడు. ఈ ఘటనలో లక్ష్మీనారాయణ అక్కడికక్కడే చనిపోగా, మేమమామ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. తండ్రి మద్యానికి బానిసై నిత్యం వేధించేవాడని కుమార్తె తెలిపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు రాకేష్ ను అదుపులోకి తీసుకున్నారు.

ఆదిలాబాద్ లో భార్యాభర్తలు ఆత్మహత్య

ఆదిలాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. భార్య ఆత్మహత్య చేసుకున్న రోజే భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం కొల్హారి గ్రామానికి చెందిన విజయ్ కు మహారాష్ట్రకు చెందిన పల్లవితో గతేడాది వివాహం జరిగింది. ఇటీవల సంక్రాంతి పండుగకు పుట్టింటికి వెళ్లిన పల్లవి శుక్రవారం తిరిగి వచ్చింది. వ్యవసాయ పనులకు వెళ్లిన భర్త, ఇతర కుటుంబ సభ్యులు సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చే సరికి పల్లవి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో భార్య మృతిని జీర్ణించుకోలేక అదే రోజు భర్త విజయ్ కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

భార్య మృతిని తట్టుకోలేక

ఆదిలాబాద్ పట్టణంలోని విమల్ గ్యాస్ ఏజెన్సీ సమీపంలో విజయ్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు అతడిని ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అయితే విజయ్ అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. భార్యాభర్తలు ఒకే రోజు చనిపోవడంతో గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి‌. ఇరువురి మరణాలకు కుటుంబ కలహాలు కారణం కావొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Whats_app_banner