TS Assembly Elections : కాంగ్రెస్ లో చేరిన మైనంపల్లి, వేముల వీరేశం
Telangana Congress Latet News : మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్ లో చేరారు.
Telangana Congress : తెలంగాణ కాంగ్రెస్ లోకి వలసలు పెరుగుతున్నాయి. మరికొద్దిరోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ… ప్రధాన పార్టీలకు చెందిన నేతలు హస్తం వైపు చూస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ కు చెందిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఆయన తనయుడు మైనంపల్లి రోహిత్, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, కుంభం అనిల్ కుమార్ కాంగ్రెస్ లో చేరారు.
గురువారం సాయంత్రం తర్వాత ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో వీరు పార్టీలో చేరారు. నేతలకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఖర్గే. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జీ మాణిక్ రావు తాకేరే పాల్గొన్నారు.
వీడిన ఉత్కంఠ..!
వేముల వీరేశం చేరికకు సంబంధించి చివరి వరకు ఉత్కంఠనే కొనసాగింది. వాస్తవానికి వేముల వీరేశం పార్టీలో చేరతారు.. ఆయనకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందని, రేపో మాపో కండువా కప్పేసుకుంటారని ప్రచారం జరిగిన నాటి నుంచి పరిశిలీస్తే.. వీరేశం తప్పం రాష్ట్రంలో పలువురు నాయకులు కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. తెలంగాణ ఉద్యమకారుడు, భువనగిరికి చెందిన జిట్టా బాలక్రిష్ణారెడ్డి, మహబూబ్ నగర్ కు చెందిన మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి చేరిక త్వరగానే అయిపోయింది. ఆ తర్వాత ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఖమ్మం జిల్లా నాయకుడు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సైతం కాంగ్రెస్ లో చేరిపోయారు. రెండు నెలల కిందటే తన డీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి కారెక్కిన భువనగిరి నాయకుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి అక్కడ ఇమడ లేక.. సొంతగూటికి చేరారు.టికెట్ల ప్రకటన రోజు నుంచే బీఆర్ఎస్ నాయకత్వంతో పేచీ పెట్టుకున్న మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు చేరిక సీన్ ఢిల్లీకి మారింది. మైనంపల్లికి, ఆయన తనయుడికి ఇద్దరికీ టికెట్లు ఇచ్చే ఖరారుతో పార్టీలో చేరికపై క్లారిటీ వచ్చింది. కానీ, ముందు నుంచీ ప్రచారం జరిగిన వేముల వీరేశం చేరిక మాత్రం పూర్తికాకపోవడం ఆయన వర్గంలో టెన్షన్ పుట్టించింది.
వీరేశం చేరిక విషయంలో మరికొన్ని వార్తలు కూడా వినిపించాయి. జిల్లాకు చెందిన ఓ కీలక నేతతో కలిసి పార్టీలో చేరుతారని… అందుకే ఆలస్యమైందనే వార్తలు వినిపించాయి. కానీ గురువారం ఆయన హస్తం కండువా కప్పుకోవటంతో… ఈ వార్తలకు చెక్ పడినట్లు అయింది. వీరేశం చేరికతో… నకిరేకల్ రాజకీయం మరో లెవల్ లో సాగిపోవటం ఖాయంగానే కనిపిస్తోంది.
టాపిక్