Missing Father: తప్పిపోయిన తండ్రి 12 ఏళ్లకు ఇంటికి…ఆదిలాబాద్‌ బోథ్‌లో సీరియల్స్‌ తరహా ఘటన-missing father returns home for 12 years a serial like incident in adilabad booth ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Missing Father: తప్పిపోయిన తండ్రి 12 ఏళ్లకు ఇంటికి…ఆదిలాబాద్‌ బోథ్‌లో సీరియల్స్‌ తరహా ఘటన

Missing Father: తప్పిపోయిన తండ్రి 12 ఏళ్లకు ఇంటికి…ఆదిలాబాద్‌ బోథ్‌లో సీరియల్స్‌ తరహా ఘటన

HT Telugu Desk HT Telugu
Sep 10, 2024 08:44 AM IST

Missing Father: సీరియల్స్ సినిమాలో చూసినట్లుగానే కొన్ని సంఘటనలు రియల్ లైఫ్ లో కూడా జరుగుతాయి, అచ్చం అలాంటి సంఘటన అదిలాబాద్ జిల్లా బోథ్ మండలం సోనాలలో జరిగింది. 12 ఏళ్ల క్రితం తప్పిపోయిన తన తండ్రి కనిపించడంతో నమ్మలేకపోతున్నారు.

తప్పిపోయిన తండ్రితో కుటుంబం సభ్యులు..
తప్పిపోయిన తండ్రితో కుటుంబం సభ్యులు..

Missing Father: సీరియల్స్ సినిమాలో చూసినట్లుగానే కొన్ని సంఘటనలు రియల్ లైఫ్ లో కూడా జరుగుతాయి, అచ్చం అలాంటి సంఘటన అదిలాబాద్ జిల్లా బోథ్ మండలం సోనాలలో జరిగింది. 12 ఏళ్ల క్రితం తప్పిపోయిన తన తండ్రి కనిపించడంతో నమ్మలేకపోతున్నారు.

వివరాల్లోకి వెళ్తే అదిలాబాద్ జిల్లా బోథ్ మండలం గుట్ట పక్క తండ గ్రామానికి చెందిన గ్రామస్తులు 2012లో తీర్థయాత్రలకు వెళ్లారు, తిరుపతి చేరుకుని దర్శనాలు చేస్తున్న సమయంలో సిసోడియ తుకారం తప్పిపోయాడు. రెండు రోజులు అక్కడే ఉండి గాలించినప్పటికీ ఆచూకీ లభించలేదు, చేసేదేం లేక దుఃఖ సాగరంలో మునిగి కుటుంబ సభ్యులు ఇంటి ముఖం కట్టారు.

సుమారు మూడు ఏళ్ల పాటు తుకారం కోసం గాలించామని కుమారుడు కుందాల్సింగ్ చెప్పారు. తప్పిపోయిన తుకారాంకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరందరికీ వివాహాలు సైతం అయ్యాయి. అయితే 12 ఏళ్ల క్రితం తప్పిపోయిన తన తండ్రి బ్రతికి మృతి చెంది ఉంటారని భావించారు. ఏళ్ళు గడుస్తున్న ఆచూకి లభించక పోవడంతో చేసేదేం లేక మిన్నకుండి పోయారు.

ఎలా దొరికాడు..

తుకారం పెద్ద కుమార్తె ఇటీవల హైదరాబాద్ లో ఒక షాపింగ్ మాల్ లో పని చేస్తూ అక్కడే స్థిరపడ్డారు. 5రోజుల క్రితం మాల్ సమీపంలో ఒక వ్యక్తి బిక్షాటన చేస్తుండగా అచ్చం తన తండ్రి పోలికకు సరిపోయే వ్యక్తి లాగే ఉన్నాడని గమనించి, అతన్ని ఫొటోలు చిత్రికరించి కుటుంబ సభ్యులకు పంపింది.

వారంతా వెంటనే హైదరాబాద్ కు వెళ్లి అతన్ని చూసి, వాళ్ళు తప్పిపోయిన తన తండ్రియే అని నిర్దారించుకొని ఇంటికి తీసుకోచ్చి ఆధార్ కేంద్రం వెళ్లి వేలి ముద్రలు సరిపోల్చుకుని తన తండ్రిగా నిర్దారించుకున్నారు. చనిపోయారు అనుకున్న తండ్రి వారి చెంతకు చేరడంతో కుటుంబం సభ్యులకు ఆనందం అవధులు దాటాయి.

అయితే తిరుపతిలో తప్పిపోయిన తుకారం గ్రామస్తులను ఎవరిని గుర్తు పట్టలేకపోతున్నారని కుటుంబీకులు చెబుతున్నారు. పుష్కర కాలం తరువాత తండ్రి ఆచూకి లభించడం తో కుంటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

(రిపోర్టింగ్: వేణుగోపాల్ కామోజీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)