Minister Koppula Eshwar : కిషన్ రెడ్డివి తప్పుడు ప్రచారాలు - మంత్రి కొప్పుల-minister koppula eshwar fires on kishan reddy ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Minister Koppula Eshwar : కిషన్ రెడ్డివి తప్పుడు ప్రచారాలు - మంత్రి కొప్పుల

Minister Koppula Eshwar : కిషన్ రెడ్డివి తప్పుడు ప్రచారాలు - మంత్రి కొప్పుల

HT Telugu Desk HT Telugu

Minister Koppula Eshwar Latest News: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై మంత్రి కొప్పుల మండిపడ్డారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లేని పథకాలను తెలంగాణాలో ఎలా హమీ ఇస్తున్నారని ప్రశ్నించారు.

మంత్రి కొప్పుల ఈశ్వర్

Minister Koppula Eshwar:  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై మంత్రి కొప్పుల ఈశ్వర్ ఫైర్ అయ్యారు. నిరుద్యోగుల పట్ల ఆయన చేసిన దీక్ష, మోసలి కన్నీరు కార్చినట్టుగా ఉందన్నారు.  పేద ప్రజలకు కాకుండా, కార్పొరేట్ సంస్థలకు లబ్ది చేసేందుకే కేంద్రంలో బీజేపీ పాలన సాగిస్తుందని మండిపడ్డారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలో గురువారం పర్యటించిన ఆయన… ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని.. కిషన్ రెడ్డిని డిమాండ్ చేశారు.

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పర్యటించారు. ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా, మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించిన ఆయనకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి కొప్పుల మాట్లాడుతూ... నిండు పార్లమెంట్ సభలో, బీజేపీ అగ్రనాయకులు రుణమాఫీకి వ్యతిరేకం అని ప్రకటన చేస్తే, ఇక్కడ ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో నిరుద్యోగ భృతి ఎక్కడ ఇస్తున్నారో చెప్పకుండా, ఇక్కడ దీక్షల పేరుతో మోసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. 

10 సంవత్సరాల బీజేపీ పాలనలో దోచుకోవడం తప్పా, పేద ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు మంత్రి కొప్పుల ఈశ్వర్. ఎన్నికల కోసమే కిషన్ రెడ్డి, ఆపద మొక్కులు మొక్కినట్టు దీక్షలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎలాంటి అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేయకుండా, తెలంగాణలో చేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పక్కనున్న కర్ణాటక రాష్ట్రంలో కౌలు రైతులకు 15 వేల ఆర్థిక సాయం చేసి, ఇక్కడ మాట్లాడాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు.

రిపోర్టర్: గోపికృష్ణ, కరీంనగర్