Ramagundam Accident: రామగుండం సింగరేణి RG-1లో గని ప్రమాదం, గాయాలతో మృతి చెందిన కార్మికుడు-mine accident in ramagundam singareni rg 1 laborer dies of injuries ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ramagundam Accident: రామగుండం సింగరేణి Rg-1లో గని ప్రమాదం, గాయాలతో మృతి చెందిన కార్మికుడు

Ramagundam Accident: రామగుండం సింగరేణి RG-1లో గని ప్రమాదం, గాయాలతో మృతి చెందిన కార్మికుడు

HT Telugu Desk HT Telugu
May 30, 2024 11:00 AM IST

Ramagundam Accident:రామగుండం సింగరేణి ఆర్జీ వన్‌లో గని ప్రమాదం జరిగింది. జిడికె 11 ఇంక్లయిన్‌లో కార్మికుని పై నుంచి బొగ్గు వెలికి తీసే మిషన్ వెళ్ళడంతో LHD అపరేటర్ ఇజ్జగిరి ప్రతాప్ ప్రాణాలు కోల్పోయారు

ఆర్జీ1 గనిలో జరిగిన ప్రమాదంలో కార్మికుడు మృతి
ఆర్జీ1 గనిలో జరిగిన ప్రమాదంలో కార్మికుడు మృతి

Ramagundam Accident: రామగుండం సింగరేణి ఆర్జీ వన్‌లో గని ప్రమాదం జరిగింది. జిడికె 11 ఇంక్లయిన్‌లో కార్మికుని పై నుంచి బొగ్గు వెలికి తీసే మిషన్ వెళ్ళడంతో LHD అపరేటర్ ఇజ్జగిరి ప్రతాప్ ప్రాణాలు కోల్పోయారు.

రాత్రి షిఫ్టుల్లో ఈ ప్రమాదం జరిగింది. మృతదేహాన్ని సింగరేణి ఏరియా హస్పటల్ మార్చురీకి తరలించారు. పనికి వెళ్ళిన ప్రతాప్ ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రమాదం పట్ల సింగరేణి కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

‌ప్రమాదానికి యాజమాన్యానిదే బాధ్యత

సింగరేణిలో గని ప్రమాదానికి సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. అవగాహన లేని సూపర్వైజర్లు, సరైన రక్షణ చర్యలు లేక పోవడంతోనే ప్రమాదం జరిగిందని కార్మిక సంఘాలు ప్రతినిధులు మండిపడుతున్నారు.

ఫస్ట్ షిప్ట్ లో చేయాల్సిన టన్నెల్ పనిని మూడు షిప్ట్ లలో నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఎల్.హెచ్.డి బండి ఎల్ఓపి లేదు... బ్రేక్ లు కూడా సరిగా పనిచేయడం లేదన్నారు. ప్రమాదానికి బాధ్యులుగా 11 ఇంక్లైన్ లోని ఆఫీసర్ లందరిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

ప్రమాదంపై విచారణ జరిపి ప్రాణాలు కోల్పోయిన కార్మికుడి కుటుంబానికి రావాల్సిన బెనిఫిట్స్ తక్షణమే అందజేయాలని డిమాండ్ చేశారు. ఇక ముందు ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తగు చర్యలు చేపట్టాలని కోరారు.

గని ప్రమాదాలపై మారని యాజమాన్య తీరు

ప్రమాదాలు జరిగినప్పుడే హడావిడి చేసే అధికారులు ఆతర్వాత పట్టించుకోవడం లేదని కార్మిక సంఘాలతోపాటు కార్మికుల కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. జిడికే 11 ఇంక్లైన్ లో ఇదివరకు ఇలాంటి ప్రమాదం జరిగితే ఏలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే తాజాగా మరో ప్రమాదం చోటుచేసుకుందని ఆందోళన వ్యక్తం చేశారు.

నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సింగరేణి యాజమాన్యం మాత్రం ప్రమాదవశాత్తు జరిగిన ఘటనే తప్ప నిర్లక్ష్యం కాదని ప్రకటించింది. ప్రమాధాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి కార్మికుల రక్షణే ప్రథమ కర్తవ్యంగా యాజమాన్యం పనిచేస్తుందన్నారు. ప్రస్తుతం జరిగిన ప్రమాదంపై విచారణ జరిపి విధినిర్వహణలో నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.

(రిపోర్టింగ్ కేవీ.రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా)

Whats_app_banner