Medak Passenger Train: ఈనెల 23న మెదక్‌ ప్యాసింజర్‌ రైలు ప్రారంభం-medak passenger train will start on 23 september 2022 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Medak Passenger Train: ఈనెల 23న మెదక్‌ ప్యాసింజర్‌ రైలు ప్రారంభం

Medak Passenger Train: ఈనెల 23న మెదక్‌ ప్యాసింజర్‌ రైలు ప్రారంభం

HT Telugu Desk HT Telugu
Sep 14, 2022 08:34 AM IST

Medak Passenger Train:మెదక్‌ జిల్లా వాసుల చిరకాల కోరిక నెరవేరబోతోంది. ఈనెల 23న నుంచి కొత్త రైలు ప్రారంభం కానుంది.

<p>మెదక్ రైలు ప్రారంభం</p>
మెదక్ రైలు ప్రారంభం (facebook)

Kacheguda to Medak Train: త్వరలోనే మెదక్ ప్యాసింజర్ రైలు పట్టాలు ఎక్కనుంది. హైదరాబాద్‌లోని కాచిగూడ స్టేషన్‌ నుంచి అక్కన్నపేట మీదుగా మెదక్‌ వరకు ప్యాసింజర్‌ రైలును నడిపించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. కొత్త రైలును ఈ నెల 23న రైల్వేశాఖ సహాయ మంత్రి రావుసాహెబ్‌ పాటిల్‌ దాన్వే ప్రారంభించనున్నారు.

అక్కన్నపేట-మెదక్‌ మధ్య 17 కి.మీ. మేర కొత్త రైలుమార్గం నిర్మించే ప్రాజెక్టు పదేళ్ల క్రితం మంజూరైంది. భూసేకరణ, ఇతర కారణాలతో ఈ ప్రాజెక్ట్ చాలా ఆలస్యమైంది. 2012-13లో మంజూరు చేసినప్పుడు అంచనా వ్యయం రూ.117.72 కోట్లుగా ఉన్న ఈ ప్రాజెక్టు ఖర్చు ఆలస్యం కారణంగా దాదాపు రెండున్నర రెట్లకు పెరిగింది. కొద్దికాలం క్రితం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయింది. మెదక్‌- అక్కన్నపేట రైల్వే లైన్‌, రైల్వే స్టేషన్ల పనుల నిర్మాణానికి మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవ తీసుకుని గడిచిన ఆరు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద రూ.50 కోట్లు మంజూరు చేయించారు. తద్వారా ఈ పనులు మరింత వేగంగా జరిగాయి. ఈనెవ 23 నుంచి సేవలు ప్రారంభం కావటంతో… ప్రయాణికులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

రైల్వే రేక్‌ పాయింట్‌..

Rake point at Medak: మెదక్‌లో రైల్వే రేక్‌ పాయింట్‌ ఏర్పాటు ప్రారంభమైన సంగతి తెలిసిందే. దీని ద్వారా మెదక్‌ జిల్లా నుంచి ప్రతి యేటా 5 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో ఉన్న ఎఫ్‌సీఐ గోదాములకు లారీలతో తరలించేందుకు మార్గం సులభమైంది. రేక్‌ పాయింట్‌ అందుబాటులోకి రానుండడంతో రైళ్లతో సులభంగా బియ్యం రవాణా చేసే అవకాశం లభించింది. ఆంధ్రప్రదేశ్‌లోని కంపెనీల నుంచి ఎరువులను గూడ్స్‌ రైళ్లతో మెదక్‌కు దిగుమతి చేసుకుంటున్నారు. సిమెంట్‌, స్టీల్‌, ట్రాన్స్‌పోర్టేషన్‌, ఈ ప్రాంతంలో రైతులు పండించే పత్తి తదితర పంటలను ఎగుమతి చేసేందుకు సులభతరమైంది.

రైల్వే రేక్‌ పాయింట్ల ఏర్పాటుతో రైస్‌ మిల్లర్లు, వ్యాపారులు, రైతులకు లాభం చేకూరనంది. ఎగుమతి, దిగుమతితో వేలాది మంది కూలీలకు ఉపాధి లభిస్తోంది. మెదక్‌లో రేక్‌ పాయింట్‌కు దూర ప్రాంతాల నుంచి గూడ్స్‌ రైళ్లతో వచ్చే సరుకులను అన్‌లోడ్‌ చేసేందుకు, ఎగుమతి చేసే సమయంలో గూడ్స్‌ బోగీల్లో నింపేందుకు స్థానిక కూలీలకు పని దొరుకుతుంది.

Whats_app_banner