Medak Crime : భర్తను వదిలి ప్రియుడితో సహజీవనం- పిల్లలు గుర్తొచ్చి మహిళ ఆత్మహత్య
Medak Crime : భర్త, పిల్లల్ని వదలి మరో వ్యక్తితో సహజీవం చేస్తు్న్న మహిళ ఆత్మహత్యకు పాల్పండి. పిల్లలు పదే పదే గుర్తుకురావడంతో మనస్థాపంతో మహిళ ఆత్మహత్య పాల్పడిందని ప్రియుడు తెలిపాడు.
Medak Crime : తాత్కాలిక వ్యామోహంతో ఓ మహిళ భర్త, పిల్లలను వదిలి ప్రియుడితో సహజీవనం చేస్తుంది. ఈ క్రమంలో పిల్లలు పదే పదే గుర్తుకురావడంతో మనస్థాపానికి గురై ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్ గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఊర్మిళ (30) కు భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కాగా అదే రాష్ట్రానికీ చెందిన జైన్ లాల్ వర్కడే పదేళ్ల కిందట సిమ్లా అనే యువతిని ప్రేమవివాహం చేసుకున్నాడు. కాగా వారికీ ఒక కుమారుడు, ముగ్గురు కూతుర్లు ఉన్నారు.
ఇద్దరు కుటుంబాలను వదిలేసి ప్రేమవివాహం
ఈ క్రమంలో జైన్ లాల్ భార్య పిల్లలను, ఊర్మిళ భర్త, పిల్లలను వదిలేసి ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు. దీంతో మధ్యప్రదేశ్ నుంచి సిద్దిపేట జిల్లాకు 18 నెలల క్రితం వలస వచ్చి కాళ్లకల్ గ్రామంలో ఓ గదిని అద్దెకు తీసుకొని నివాసం ఉంటున్నారు. కాగా ఊర్మిళ విత్తన పరిశ్రమలో పని చేస్తుండగా, జైన్ లాల్ స్థానికంగా ఉన్నమరో పరిశ్రమలో డ్రైవర్ గా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. దీంతో ఊర్మిళ కొన్నిరోజులుగా పిల్లలను తలచుకొని బాధపడుతుండేది. కాగా తరచూ పిల్లలు గుర్తుకు రావడంతో మనస్థాపం చెంది ఆదివారం సాయంత్రం భర్త జైన్ లాల్ ఇంట్లో లేని సమయంలో ఫ్యాన్ కు చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. జైన్ లాల్ ఇంటికి వచ్చి చూసేసరికి ఊర్మిళ ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సమాచారం తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జైన్ లాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఆర్థిక ఇబ్బందులతో వృద్ధుడు ఆత్మహత్య
ఆర్థిక ఇబ్బందులతో వృద్ధుడు హల్దీ వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ జిల్లాలో జరిగింది. వివరాల ప్రకారం మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్ గ్రామానికి చెందిన చీర్ల ఆగమయ్య (62) భార్య కొంతకాలం క్రితం అనారోగ్యంతో మృతిచెందింది. అతనికి పెళ్లీడుకు వచ్చిన ఒక కూతురు ఉంది. కూతురుకు పెళ్లి చేసే స్థోమత లేకపోవడం, దానితో పాటు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతుండేవాడు. దీంతో మనస్థాపం చెంది ఆదివారం ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. అదేరోజు తూప్రాన్ పట్టణ సమీపంలోని నాగులపల్లి వద్ద హల్దీ వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం హల్దీ వాగులో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీసి దర్యాప్తు చేపట్టారు. దీంతో అతడు కాళ్లకల్ గ్రామానికి చెందిన ఆగమయ్యగా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
సంబంధిత కథనం