Murder in Palnadu: ముక్కలుగా నరికి పెట్రోల్ తో కాల్చి.. వివాహేతర సంబంధమే అసలు విషయం!
Palnadu district Crime News: గురజాల పరిధిలోని దాచేపల్లిలో దారుణ హత్య జరిగింది. ఓ వ్యక్తిని ముక్కలు ముక్కలుగా చేసి కాల్చేసి చంపేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వివాహేత సంబంధమే హత్యకు కారణమని తెలుస్తోంది.
Mans body being cut into pieces in Palnadu: అతను పొరుగుసేవల సిబ్బందిగా పని చేస్తున్నాడు..! విధుల్లో భాగంగా రాత్రి బయటికి వెళ్లాడు. అంతలోనే అతనికోసం మాటువేసి ఉన్న ఇద్దరు ... కర్రతో దాడి చేశారు. తలపై గట్టిగా కొట్టడంతో చనిపోగా... డెడ్ బాడీని వేరే ప్రాంతానికి బైక్ పై తరలించారు. ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా నరికేసి... కాల్చేశారు. అక్కడ్నుంచి ఇంటికి వచ్చి బట్టలు మార్చుకున్నారు. అయితే బయటికి వెళ్లిన వ్యక్తి ఇంటికి రాకపోవటంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చెందారు. చుట్టుపక్క వెతకగా... కాలుతున్న పాదం కనిపించగా... పోలీసులు ఫిర్యాదు చేశారు. ఈ కేసు విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటన పల్నాడు జిల్లా గురజాల పరిధిలో జరిగింది.
దాచేపల్లికి చెందిన సైదులు, గరికపాటి కోటేశ్వరరావు (38) నగర పంచాయతీలో పొరుగు సేవల కింద ప్లంబర్లుగా పనిచేస్తున్నారు. విధుల్లో భాగంగా శుక్రవారం రాత్రి 8 గంటలకు విద్యుత్తు మోటారును ఆపడానికి బైపాస్ ప్రాంతంలోని వాటర్‌ట్యాంకు వద్దకు కోటేశ్వరరావు వెళ్లారు. అప్పటికే అక్కడ కాపుకాచిన సైదులు, అతడి కొడుకు కలిసి కోటేశ్వరరావుపై దాడి చేశారు. తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మరణించారు. అనంతరం మృతదేహాన్ని గొనే సంచిలో వేసి బైక్ పై నిర్మానుష ప్రాంతానికి. డెడ్ బాడీని ముక్కలు ముక్కలు చేశారు. వాటిని పెట్రోల్ పోసి కాల్చేశారు. నెమ్మదిగా అక్కడ్నుంచి జారుకున్న తండ్రికొడుకులు... ఇంటికి చేరారు. రక్తంతో ఉన్న బట్టలను భార్య, కొడుకు కాల్చేశారు. మృతుడి కుటుంబం చూడగా కాలుతున్న డెడ్ బాడీ కనిపించటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ కేసుకు సంబంధించిన ప్రాథమిక వివరాలను గురజాల డీఎస్పీ జయరామ్ ప్రసాద్ వెల్లడించారు. నిందితులపై ఐపీసీ 302, 201 కింద కేసులు నమోదు చేశామని చెప్పారు. మృతుడి కుటుంబం ఫిర్యాదు ఆధారంగా... ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. అయితే హత్యకు ప్రధాన కారణం... వివాహేతర సంబంధం అని చెప్పారు. పదేళ్ల క్రితం సైదులు వద్ద కోటేశ్వరరావు పని చేసేవాడు. ఈక్రమంలో సైదులు భార్య, కోటేశ్వరరావు తీరులో మార్పులు కనిపించటం, వివాహేతర సంబంధం నడుస్తుందని భావించాడు సైదులు. ఆ తర్వాత కోటేశ్వరరావు ప్లంబర్ గా పని చేస్తున్నాడు. ప్రస్తుతం ఇద్దరు ఒకే దగ్గర పని చేస్తున్నారు. అయితే కోటేశ్వరరావుపై కోపంతో రగిలిపోతున్న సైదులు... హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో హత్య జరిగినట్లు అర్థమవుతోందని పోలీసులు చెప్పారు.
ప్రస్తుతం నిందితులను కస్టడీలోకి తీసుకున్నామని.. విచారణ తర్వాత పూర్తి వివరాలు వెలుగులోకి వస్తాయని వెల్లడించారు.మరోవైపు మృతుడి కుటుంబీకులు, బంధువులు రోడ్డెక్కి ఆందోళన చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండు చేశారు.