Tragedy in Holi Festival: హోలీ వేళ విషాదం.. రంగు పూశాడని పెట్రోల్ పోసి నిప్పటించాడు
Medak District Crime News: హోలీ పండగ వేళ మెదక్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. రంగు పూసేందుకు యత్నించిన వ్యక్తిపై పెట్రోల్ పై నిప్పుటించాడు మరో వ్యక్తి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Holi Festival In Telangana: హోలీ... దేశవ్యాప్తంగా అత్యంత ఘనంగా జరుపుకునే పండగ. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా... ప్రతిచోట కూడా హోలీ సంబరాలను జరుపుకుంటారు. అందరూ రోడ్లమీదకొచ్చి.. రంగులు పూసుకుంటూ ఆనందంగా గడుపుతుంటారు. ఇక పలుచోట్ల డీజేలు పెట్టుకొని మరీ... తెగ ఎంజాయ్ చేసేస్తారు. అయితే పండగలో విషాదం జరిగింది. రంగు పోశాడన్న కారణంతో ఏకంగా పెట్రోల్ పోసి మరీ నిప్పుటించాడు. ఈ ఘటన మెదక్ జిల్లాలో కలకలం రేపింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు వివరాల ప్రకారం... హోలీ పండగ వేళ ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరిగింది. మెదక్ జిల్లాలోని రేగోడ్ మండలం మర్పల్లిలో హోలీ వేడుకల్లో అంజయ్య అనే వ్యక్తి షబ్బీర్ అనే వ్యక్తిపై రంగు పోసేందుకు యత్నించాడు.అయితే తనపై రంగు పూయొద్దని చెప్పినా.. అంజయ్య వినకుండా రంగు పూశాడు. దీంతో షబ్బీర్ ఒక్కసారిగా కోపాద్రిక్తుడయ్యాడు. ఆ వ్యక్తితో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య మాటామాట పెరిగి, వివాదం ముదిరింది. ఇంతలోనే షబ్బీర్ పెట్రోల్ తీసుకొచ్చి... అంజయ్యపై పోసి నిప్పంటించాడు. ఈ మంటల్లో అంజయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. శరీరం కూడా చాలా వరకు కాలింది. స్థానికులు వెంటనే స్పందించి.. మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. అనంతరం అతడ్ని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించి చికిత్స అందిస్తున్నారని పోలీసులు వెల్లడించారు.
అయితే ఈ ఘటనపై అన్ని కోణాల్లో కూడా విచారిస్తున్నట్లు తెలుస్తోంది. అంజయ్య, షబ్బీర్ మధ్య ఏమైనా పాత తగాదాలా ఉన్నాయా..? లేక క్షణికావేశంలోనే ఇలా చేశాడా..? లేక మరేమైనా కారణాలు ఉన్నాయా..? అన్నదానిపై అన్వేషిస్తున్నారు. పూర్తి స్థాయి విచారణ తర్వాత... అన్ని విషయాలను వెల్లడిస్తామని పోలీసులు పేర్కొన్నారు.
సంబంధిత కథనం