మాఘ పూర్ణిమ: గంగాస్నానం ఆచరించిన లక్షలాది భక్తులు-lakhs of devotees take holy dip in ganga in prayagraj ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  మాఘ పూర్ణిమ: గంగాస్నానం ఆచరించిన లక్షలాది భక్తులు

మాఘ పూర్ణిమ: గంగాస్నానం ఆచరించిన లక్షలాది భక్తులు

HT Telugu Desk HT Telugu
Feb 16, 2022 02:54 PM IST

మాఘ పూర్ణిమను పురస్కరించుకుని లక్షలాది మంది భక్తులు ప్రయాగ్‌రాజ్‌ వద్ద గంగా నదిలో స్నానమాచరించారు.

మహా మండలేశ్వర్ స్వామి కుషల్ గిరి ప్రయాగరాజ్‌లో స్నానమాచరించేందుకు వచ్చిన దృశ్యం
మహా మండలేశ్వర్ స్వామి కుషల్ గిరి ప్రయాగరాజ్‌లో స్నానమాచరించేందుకు వచ్చిన దృశ్యం (PTI)

ప్రయాగ్‌రాజ్: మాఘ పూర్ణిమ సందర్భంగా ఇక్కడి గంగా నదిలో లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారు. కోవిడ్ భయాందోళనలు ఉన్నప్పటికీ భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

మాఘ పూర్ణిమ సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని, 150కి పైగా సీసీటీవీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశామని జిల్లా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అజయ్ కుమార్ తెలిపారు.

ఉదయం నుంచి పిల్లలు, వృద్ధులు, మహిళలు సహా దాదాపు 4.50 లక్షల మంది గంగా సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించినట్లు ప్రయాగ్‌రాజ్ మేళా అథారిటీ అధికారి ఒకరు తెలిపారు.

అగ్నిమాపక సిబ్బంది, 108 మంది గజ ఈతగాళ్లను మోహరించినట్లు అజయ్ కుమార్ తెలిపారు. సంగం ప్రాంతంలో మంగళవారం అర్ధరాత్రి నుంచి గురువారం రాత్రి 10 గంటల వరకు అడ్మినిస్ట్రేటివ్ వాహనాలు, అంబులెన్స్‌లు మినహా అన్ని వాహనాల రాకపోకలను నిషేధించామని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (మాగ్ మేళా) రాజీవ్ నారాయణ్ మిశ్రా తెలిపారు.

IPL_Entry_Point