Kamareddy Crime : ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి మహిళ మృతి-kamareddy crime news in telugu woman dies after accidentally fell water pond ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Kamareddy Crime : ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి మహిళ మృతి

Kamareddy Crime : ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి మహిళ మృతి

HT Telugu Desk HT Telugu
Feb 22, 2024 10:07 PM IST

Kamareddy Crime : కామారెడ్డి పట్టణంలో ప్రమాదవశాత్తు నీటికుంటలో పడి ఓ మహిళ మృతి చెందింది. చేతలు కడుక్కునేందుకు నీటిలో దిగిన మహిళ కుంటలో జారిపడిపోయింది.

ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి మహిళ మృతి
ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి మహిళ మృతి

Kamareddy Crime : ప్రమాదవశాత్తు కుంటలో పడి ఓ మ‌హిళ మృతి చెందిన ఘ‌ట‌న కామారెడ్డి ప‌ట్టణంలో గురువారం చోటుచేసుకుంది. కామారెడ్డి రూరల్ ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం... కామారెడ్డి పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీకి చెందిన సుంకం విజయ( 48 ) కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని రామేశ్వరం పల్లి నీటి కుంటలో పడి మృతి చెందిందని తెలిపారు. కల్లాపి చల్లి చేతులు శుభ్రచేసుకునేందుకు పల్లె వానికుంట వద్దకు వెళ్లింది మహిళ. శుభ్రం చేసుకోవడానికి కుంటలోనికి దిగగా.. ప్రమాద‌వ‌శాత్తు కుంటలో జారిప‌డి మృతి చెందిన‌ట్లు పోలీసులు తెలిపారు. జేసీబీతో తీసిన గుంతలో ప్రమాదవశాత్తు జారిపడిన‌ట్లు చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు

గోదావరిలో దూకి యువకుడి ఆత్మహత్య

నిజామాబాద్ జిల్లాలోని న‌వీపేట పోలీసు స్టేషన్ పరిధిలోని యంచ గోదావరిలో దూకి యువకుడు నవీన్ రెడ్డి (34) ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై యాదగిరి గౌడ్ గురువారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోటగల్లికి చెందిన నవీన్ రెడ్డి 19వ తేదీన ఇంటి నుంచి వెళ్లిపోగా కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేశారు. కాగా సమాచారం మేరకు గోదావరిలో లభ్యమైన మృతదేహాన్ని పరిశీలించగా నవీన్ రెడ్డిగా గుర్తించారు. మృతుడు లివర్ వ్యాధితో బాధపడుతున్నట్లు మృతుడి భార్య వసుంధర తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Whats_app_banner

సంబంధిత కథనం