Hyderabad Jio 5G Network : హైదరాబాద్‌లో జియో 5G.. వెల్కమ్ ఆఫర్ ఇదే
Jio 5G Network in Hyderabad : వినియోగదారులకు జియో గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ లో 5జీ నెట్ వర్క్ ను ప్రారంభించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
రిలయన్స్ జియో(Reliance Jio) వినియోగదారులకు శుభవార్త చెప్పింది. హైదరాబాద్(Hyderabad), బెంగళూరు(Bengaluru)లోని ఎంపిక చేసిన వినియోగదారుల కోసం 5Gని అందుబాటులోకి తెచ్చింది. అదనపు ఖర్చు లేకుండా అపరిమిత డేటాను అందిస్తోంది. రిలయన్స్ జియో తన 5G నెట్‌వర్క్(5G Network)ను విస్తరిస్తున్నట్లు బెంగళూరు, హైదరాబాద్‌లలో దశలవారీగా సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది.
రిలయన్స్ జియో.. ప్రారంభంలో దిల్లీ(Delhi), వారణాసి, కోల్‌కతా, చెన్నై, నాథ్‌ద్వారా, ముంబై లాంటి ఆరు నగరాల్లో బీటా ట్రయల్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత బెంగళూరు, హైదరాబాద్ కు తన సేవలను విస్తరించింది. కస్టమర్లకు మంచి ఎక్సిపిరేయేన్స్ అందించనున్నట్టుగా తెలిపారు.
ఈ సంవత్సరం ఆగస్టులో Jio రూ. 88,000 కోట్లకు పైగా ఖర్చు చేసినట్టుగా తెలిపింది. 700 MHz, 800 MHz, 3300 MHz, 26GHz బ్యాండ్‌లలో స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేసింది. అంతేకాకుండా ఇండిపెండెంట్ గా 5Gని ఉపయోగించే ఏకైక టెలికాం ఆపరేటర్(Telecom Operator) రిలయన్స్ జియో మాత్రమేనని తెలిపింది. ఇది ఎక్కువ వేగంతోపాటు ఎలాంటి సమస్యలు లేకుండా అందిస్తుందని ప్రకటించింది. 5G క్యారియర్ అగ్రిగేషన్‌కు మద్దతు ఇస్తుందని కంపెనీ తెలిపింది.
ఇతర నగరాల్లో Jio 5G సేవలను ఎలా అందుబాటులోకి తెచ్చిందో అలాగే, బెంగళూరు, హైదరాబాద్‌లోని ఎంపిక చేసిన వినియోగదారులు Jio వెల్‌కమ్ ఆఫర్‌కు అర్హులు అని రిలయన్స్ జియో ప్రకటించింది. వారికి ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా గరిష్టంగా 1 Gbps వరకు అపరిమిత డేటాకు యాక్సెస్ లభిస్తుంది.