Jagtial Crime : జగిత్యాలలో దారుణం, కోడలి మెడ నరికి హత్య చేసిన మామ-jagtial crime news father in law killed daughter in law with knife extra marital relationship suspicion ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Jagtial Crime : జగిత్యాలలో దారుణం, కోడలి మెడ నరికి హత్య చేసిన మామ

Jagtial Crime : జగిత్యాలలో దారుణం, కోడలి మెడ నరికి హత్య చేసిన మామ

HT Telugu Desk HT Telugu
May 01, 2024 05:46 PM IST

Jagtial Crime : జగిత్యాల జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అనుమానంలో మామ కోడలిపై కత్తితో దాడి చేసి హత్య చేశాడు. కొడుకు ఉపాధి కోసం దుబాయ్ కు వెళ్లగా, కోడలు ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్తుంది.

కోడలిపై కత్తితో దాడి చేసిన మామ, వివాహేతర సంబంధమే కారణమా?
కోడలిపై కత్తితో దాడి చేసిన మామ, వివాహేతర సంబంధమే కారణమా?

Jagtial Crime : జగిత్యాల జిల్లాలో దారుణం(Jagtial Murder) జరిగింది. సారంగాపూర్‌ మండలం రేచపల్లిలో కోడలిపై మామ కత్తితో (Father in Law killed Daughter in Law)దాడి చేసి హత్య చేశాడు. మటన్ కొట్టే కత్తితో మెడనరికి చంపాడు. స్థానికులు తెలిపి వివరాల ప్రకారం ఆకుల మౌనిక భర్త బతుకుదెవురు కోసం దుబాయ్ కి వెళ్లాడు. ఏడేళ్ల లోపు ఇద్దరు ఆడపిల్లలతో భార్య మౌనిక ఇంటివద్ద ఉంటుంది. ఓ పాపకు ఆరోగ్యం బాగాలేకుంటే ఆసుపత్రికి తీసుకెళ్లి వచ్చిన మౌనిక ఇంట్లో ఉండగా మామ రాజిరెడ్డి కత్తితో దాడి చేశాడు. మెడవెనుక భాగంలో నరకడంతో అక్కడికక్కడే మౌనిక ప్రాణాలు కోల్పోయింది. కోడలిని కత్తి(Knife Attack)తో నరికి చంపిన తర్వాత రాజిరెడ్డి పోలీసులకు లొంగిపోయాడు.

కోడలిపై కత్తితో దాడి

వివాహేతర సంబంధమే (Extra Marital Relation)హత్యకు కారణమని స్థానికులు భావిస్తున్నారు. మౌనిక భర్త దుబాయ్ లో ఉండగా మౌనిక మరొకరితో సంబంధాలు కొనసాగిస్తుందనే కోపంతో మామ కత్తితో దాడి చేసినట్లు తెలుస్తోంది. భర్తకు దూరంగా ఇద్దరు కూతుళ్లతో ఉంటున్న మౌనికపై అనుమానంతోనే మామ దాడి చేసినట్లు చెబుతున్నారు. మౌనిక బంధులు మాత్రం మామే కోడలి(Daughter in Law Murder)పై కన్నేసి అఘాయిత్యానికి యత్నించగా మౌనిక ప్రతిఘటించడంతో కత్తితో నరికి చంపాడని ఆరోపిస్తున్నారు. పోలీసులు స్థానికులతోపాటు మౌనిక పుట్టింటివారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. త్వరలో మౌనిక సైతం దుబాయ్ కి వెళ్లేందుకు పాస్ పోర్ట్ వీసా సిద్ధం చేసుకుంటున్న తరుణంలో ఈ దారుణం జరగడంతో స్థానికంగా కలకలం సృష్టిస్తుంది.

అనుమానం పెనుభూతం

అనుమానం(Suspicion) పెనుభూతంగా మారి మౌనికను మామ నరికి చంపడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. రాజిరెడ్డికి అనుకూలంగా స్థానికులు చెబుతుండగా, మౌనిక పుట్టింటివారు మాత్రం మామే అఘాయిత్యానికి యత్నించాడని ఆరోపిస్తున్నారు. హత్యకు గల కారణాలను అన్వేషించే పనిలో పోలీసులు నిమగ్నం కాగా, తల్లి మృతి, తండ్రి దుబాయి(Dubai)లో ఉండడంతో వారి పిల్లలు ఇద్దరు అమ్మాయిలు అన్యాయం అయ్యారు. విగతజీవిగా మారిన తల్లికి ఏమయ్యిందో తెలియని పిల్లలు బిక్కుబిక్కుమంటూ వచ్చిపోయేవారిని చూస్తూ అమ్మకు ఏమయ్యిందని అడుగుతుండడం స్థానికులను కలిచివేసింది. క్షణికావేశం పిల్లలకు తల్లి లేని పరిస్థితి తీసుకొచ్చిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. భార్య హత్యకు గురికావడంతో దుబాయ్ లో ఉన్న భర్త స్వస్థలానికి బయలుదేరారు.

HT TELUGU CORRESPONDENT K.V.REDDY, KARIMNAGAR

Whats_app_banner

సంబంధిత కథనం