Jagityal MLA Sanjay Kumar : ​బీఆర్ఎస్ లో మరో వికెట్ డౌన్ - కాంగ్రెస్‌లో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్-jagityal brs mla sanjay kumar joins congress ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Jagityal Mla Sanjay Kumar : ​బీఆర్ఎస్ లో మరో వికెట్ డౌన్ - కాంగ్రెస్‌లో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్

Jagityal MLA Sanjay Kumar : ​బీఆర్ఎస్ లో మరో వికెట్ డౌన్ - కాంగ్రెస్‌లో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్

Maheshwaram Mahendra Chary HT Telugu
Jun 24, 2024 12:54 AM IST

MLA Sanjay Kumar joins Congress : బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్‌ కుమార్‌ కాంగ్రెస్ లో చేరారు.

సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్
సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్

MLA Sanjay Kumar joins Congress : తెలంగాణ కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగుతున్నాయి. ఇటీవలే బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి హస్తం కండువా కప్పుకోగా… తాజాగా మరో ఎమ్మెల్యే కూడా అదే జాబితాలో చేరారు.

జగిత్యాల నుంచి బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన డా.సంజయ్‌ కుమార్‌ ఆదివారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆయనకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జగిత్యాల నియోజకవర్గం నుంచి డాక్టర్ సంజయ్ కుమార్ 2018, 2024 ఎన్నికల్లో గెలిచారు.

2023 డిసెంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున మొత్తం 39 మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు. వీరిలో దానం నాగేందర్, కడియం శ్రీహరి. తెల్లా వెంకట్రావ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి హస్తం గూటికి చేరారు. తాజాగా డాక్టర్ సంజయ్ చేరితో బీఆర్ఎస్ నుంచి చేరిన ఎమ్మెల్యేల సంఖ్య ఐదుకు చేరింది. మరికొంత మంది కూడా బీఆర్ఎస్ పార్టీని వీడి…. కాంగ్రెస్ గూటికి చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.

Whats_app_banner