Irrigation engineer suicide: గోదావరిలోకి దూకి ఇరిగేషన్ ఇంజినీర్ సూసైడ్
irrigation engineer suicide in navipet: నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగి సూసైడ్ చేసుకున్నాడు. ఆర్మూర్ నీటి పారుదల శాఖ డీఈఈగా ఉన్న వెంకటరమణారావు గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Irrigation Engineer Suicide in Nizamabad: నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆర్మూర్ లో ఇరిగేషన్ శాఖ డీఈఈగా పని చేస్తున్న వెంకటరమణారావు గోదావరిలోకి దూకి సూసైడ్ చేసుకున్నాడు. శుక్రవారం ఉదయం గోదావరి నదిలో ఆయన మృతదేహం కనిపిచింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వటంతో విషయం వెలుగులోకి వచ్చింది.
వెంకటరమణారావు కనిపించకపోవటంతో ఆయన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటి నుంచి బైక్‌పై వెళ్లినట్టుగా పేర్కొన్నారు. అయితే అతని బైక్ గోదావరి వద్ద బైక్ వద్ద కనిపించటంతో గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. శుక్రవారం నదిలో ఆయన మృతదేహం లభించడంతో.. వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఆయన మృతిగల కారణాలపై అన్ని కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు.
మెట్రో కిందపడి…
హైదరాబాద్ నగరంలోని మూసాపేట్ మెట్రో స్టేషన్‌లో ఓ వ్యక్తి మెట్రో ట్రైన్ కింద పడి సూసైడ్ చేసుకున్నాడు. గురువారం రాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. టికెట్ తీసుకోకుండానే ఆ వ్యక్తి స్టేషన్‌లోకి ప్రవేశించినట్లు మెట్రో సిబ్బంది గుర్తించింది. సరిగ్గా రైలు వచ్చేది గమనించి దానికి ఎదురుగా దూకేసినట్లు సీసీ పుటేజీల్లో నమోదైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.