Hyd Airport: అలర్ట్... ఈ నెల 28 నుంచే కొత్త అంతర్జాతీయ టెర్మినల్ స్టార్ట్..
RGIA Hyderabad: ఈ నెల 28 నుంచి శంషాబాద్ అంతర్జాతీయ ఎయిర్ పోర్టులో ప్రధాన టెర్మినల్ ద్వారానే విమాన సర్వీసులు ఉండనున్నాయి. ఈ మేరకు అధికారులు ప్రకటన చేశారు.
New Terminal at Rajiv Gandhi International Airport Hyd: హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు కీలక ప్రకటన చేశారు. ఈ నెల 28 నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రధాన టెర్మినల్ ద్వారానే విమాన సర్వీసులు ఉంటాయని స్పష్టం చేశారు. మధ్యాహ్నం 1 గంట నుంచే ప్రయాణికులు కొత్త టెరి్మనల్‌లోని డిపార్చర్ కేంద్రాన్ని వినియోగించుకోవాలని ఎయిర్ పోర్టు అధికారులు ట్వీట్ చేశారు. సాయంత్రం 5.30 గంటలకు సౌదీ ఎయిర్‌లైన్స్ విమానంతో కార్యకలాపాలు ప్రారంభమవుతాయని చెప్పారు. ప్రయాణికులు ఈ మార్పును గమనించాలని అధికారులు సూచించారు.
మొదటి అంతర్జాతీయ విమానం SV-753 కొత్త డిపార్చర్ హాల్ నుంచి సాయంత్రం 5.30 గంటలకు టేకాఫ్ అవుతుంది, ఈ కొత్త అంతర్జాతీయ డిపార్చర్ హాల్ ప్రారంభంతో, ప్రస్తుత ఇంటర్నేషనల్ డిపార్చర్ టెర్మినల్ (ఐఐడీటీ) రద్దు చేయబడుతుంది.
తదుపరి సమాచారం కోసం విమానాశ్రయ వెబ్‌సైట్ www.hyderabad.aeroని సందర్శించాలని లేదా విమానాశ్రయ సమాచార డెస్క్‌ని +91-40-66546370లో సంప్రదించాలని అధికారులు సూచించారు.
దేశంలో మొట్టమొదటిసారి పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యం నమూనాలో జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం 2008లో మొదలైంది. అప్పట్లో కోటి 20లక్షల మంది విమాన ప్రయాణీకులు రాకపోకలకు సరిపడా సౌకర్యాలు మాత్రమే ఉన్నాయి. 2014-15 నుంచి 2018-19 ఆర్థిక సంవత్సరాలల్లో ప్రయాణించిన విమాన ప్రయాణీకులు సగటును 20శాతం వృద్ధి నమోదు చేసింది. అయితే రద్దీ విపరీతంగా పెరిగిన నేపథ్యంలో...విస్తరణ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే కొత్త అంతర్జాతీయ టెర్మినల్ ను నిర్మించింది.
దేశంలోని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో పేపర్‌లెస్ ఈ బోర్డింగ్ సౌకర్యం కలిగిన ఏకైక విమానాశ్రయం కూడా హైదరాబాద్ విమానాశ్రయమదే. పర్యావరణ అనుకూల కార్యకలాపాలను నిర్వహించేందుకు పది మెగావాట్ల సోలార్ విద్యుత్తు ప్లాంట్, గ్రీన్ ప్యాసెంజర్ టెర్మినల్ భవనాలు, కార్బన్ ఉద్గారాలను తగ్గించేందుకు వీలుగా చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే.
టాపిక్