Formula E 10th Season: హైదరబాద్‌లో ఫార్ములా-ఈ పదో సీజన్ నిర్వహణ
Formula E 10th Season: ప్రతిష్టాత్మక ఫార్ములా-ఈ,10వ సీజన్ హైదరాబాద్ లో నిర్వహించాలని వరల్డ్ మోటార్ స్పోర్ట్ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయించారు. దేశంలో తొలిసారి ఫార్ములా - ఈ సీజన్ 9కు వేదికైన హైదరాబాద్‌లో వచ్చే ఏడాది కూడా హైదరాబాద్‌లో ఫార్ములా - ఈ కార్లు అభిమానులను అలరించనున్నాయి.
Formula E 10th Season: ఫార్ములా ఈ సిరీస్ పోటీలకు 2024లో కూడా హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 10న హైదరాబాద్ వేదికగా ఫార్ములా - ఈ 10వ సీజన్ పోటీలు నిర్వహించనున్నారు. ఫార్ములా - ఈ సిఈఓ జెఫ్ దోడ్స్ మాట్లాడుతూ సీజన్ 10 ఫార్ములా - ఈ పోటీలకు హైదరాబాద్, షాంఘై నగరాలు ఆతిథ్యం ఇస్తాయని జెఫ్ దోడ్స్ ప్రకటించారు.
మొదటి సారి నిర్వహించిన ఫార్ములా E రేసు సెప్టెంబరు 13, 2014న బీజింగ్‌లో ప్రారంభమయ్యిందని తెలిపారు.ఇప్పటి వరకు ఫార్ములా - ఈ పోటీలు చైనా,ఇండియా,అమెరికా లాంటి అనేక అగ్ర దేశాల్లో నిర్వహించామని అయన పేర్కొన్నారు.
సాన్యా, హాంకాంగ్ సహా చైనా లో మొత్తం ఇప్పటివరకు ఏడు రేసులను నిర్వహించామని వెల్లడించారు.ఫార్ములా - 9 సీజన్లు వివిధ దేశాల్లో విజయవంతంగా పూర్తి చేసుకొని ఇప్పుడు 10వ సీజన్ హైదరాబాద్ లో తెలంగాణ ప్రభుత్వం మరియు ఐటి శాఖ మంత్రి కేటీఆర్ మద్దతుతో నిర్వహించేందుకు నిర్ణయించుకున్నట్లు చెప్పారు.
కేటీఆర్ మద్దతుతో ఫార్ములా - ఈ పోటీలు
"ఫార్ములా - ఈ" పోటీల సహ-వ్యవస్థాపకుడు, చీఫ్ ఛాంపియన్‌షిప్ ఆఫీసర్ అల్బెర్టో లాంగో మాట్లాడుతూ....ఫార్ములా - ఈ సీజన్ 10 క్యాలెండర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డ్రైవర్‌లు, జట్లు, అభిమానులు మరియు వీక్షకులను మరింత ఆకర్షిస్తుందన్నారు.
మొదటిసారిగా ఫార్ములా - ఈ ఈవెంట్ షాంఘై నగరంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం మరియు మంత్రి కేటీఆర్ మద్దతుతో ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఫార్ములా - ఈ నిర్వహించారని అదే విశ్వాసంతో ఇప్పుడు 2024 లో భారత దేశానికి తిరిగి రావడం చాలా గర్వంగా ఉందన్నారు.
వాతావరణ కాలుష్యాన్ని నియంత్రిస్తూ ఎలక్ట్రిక్ కార్లతో అభివృధ్ది చేసిన ఫార్ములా - ఈ రేస్‌కు ప్రపంచ వ్యాప్తంగా గొప్ప ఆదరణ లభిస్తుందని అల్బెర్టో లాంగో అన్నారు.
షెడ్యూల్ ఇదే :
• 13-01-2024 - మెక్సికో నగరం ( మెక్సికో )
• 26-01-2024 - డిరియా ( సౌదీ అరేబియా)
• 27-01-2024 - డిరియా ( సౌదీ అరేబియా)
• 10-02-2024 - హైదరాబాద్ ( ఇండియా )
• 16-03-2024 - సాయో పౌలో ( బ్రెజిల్ )
• 30-03-2024 - టోక్యో ( జపాన్ )
• 13-04-2024 - తిబిడ్ ( ఇటలీ )
కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్