Street Dog Attack : హైదరాబాద్ లో మళ్లీ రెచ్చిపోయిన వీధికుక్కలు, బాలుడిపై విచక్షణారహితంగా దాడి!-hyderabad street dog attacks toddler severely injured ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Street Dog Attack : హైదరాబాద్ లో మళ్లీ రెచ్చిపోయిన వీధికుక్కలు, బాలుడిపై విచక్షణారహితంగా దాడి!

Street Dog Attack : హైదరాబాద్ లో మళ్లీ రెచ్చిపోయిన వీధికుక్కలు, బాలుడిపై విచక్షణారహితంగా దాడి!

Bandaru Satyaprasad HT Telugu
May 30, 2023 08:53 PM IST

Street Dog Attack : హైదరాబాద్ లో వీధికుక్కలు రెచ్చిపోతున్నాయి. పాతబస్తీలో బాలుడిపై వీధి కుక్క దాడికి పాల్పడింది. దాడి దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డైంది.

బాలుడిపై వీధికుక్క దాడి
బాలుడిపై వీధికుక్క దాడి (Image Credit : Pixabay )

Street Dog Attack : హైదరాబాద్‌ మరోసారి వీధికుక్కలు రెచ్చిపోయాయి. పాతబస్తీ సంతోష్ నగర్‌లో బాలుడిపై వీధి కుక్క దాడి చేసింది. స్థానికులు వెంటనే స్పందించి వీధి కుక్కను తరమడంతో బాలుడికి పెద్ద ప్రమాదం తప్పింది. అనంతరం గాయపడిన బాలుడిని నారాయణగూడ ఆసుపత్రికి తరలించారు. సోమవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పటాన్ చెరులో మరో ఘటన

తెలంగాణలో వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. నిత్యం ఎక్కడో ఓ చోట దాడికి పాల్పడుతున్నాయి. చిన్న పిల్లలు కనిపిస్తే విచక్షణారహితంగా కరుస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్ లో మరో చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేశాయి. పటాన్ చెరులోని మార్కెట్ లో మాహీర అనే ఆరేళ్ల బాలికపై వీధి కుక్కల దాడిచేశాయి. చిన్నారి గట్టిగా అరవడంతో స్థానికులు స్పందించి వీధి కుక్కలను తరిమివేశారు. ఈ ఘటనలో చిన్నారికి తీవ్రంగా గాయపడింది. కుక్కల దాడిలో బాలిక తల, వీపుపై తీవ్ర గాయాలయ్యాయి. బాలికను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే స్థానిక ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అందించి అనంతరం మెరుగైన వైద్యం కోసం మరో ఆసుపత్రి తరలించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో వీధి కుక్కల స్వైర విహారం పెరిగిపోయిందని స్థానికులు అంటున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి వీధికుక్కల తరలింపునకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

తెలంగాణలో వరుసదాడులు

తెలంగాణలో వీధి కుక్కలు దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే వీధి కుక్కల దాడిలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు విడిచారు. కొద్ది నెలల క్రితం అంబర్ పేటలో ప్రదీప్ అనే బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో బాలుడు చనిపోయాడు. తండ్రి పని చేస్తున్న కారు సర్వీస్ సెంటర్ కు కొడుకును తీసుకురాగా బాలుడి కుక్కలు దాడికి పాల్పడ్డాయి. ఈ వీడియో సోషల్ మీడియాల వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇటీవల కాజీపేటలో ఓ బాలుడిని వీధి కుక్కలు దాడి చేసి చంపాయి. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సునీత, మల్కాన్‌ దంపతులు అజ్మీర్‌ వెళ్లేందుకు తమ కుమారుడితో కాజీపేట రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. చోటూ బహిర్భూమి కోసం పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి వెళ్లగా.... వీధి కుక్కలు బాలుడిపై దాడి చేశాయి. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

హైదరాబాద్ లోని కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డీఆర్డీఓ టౌన్‌షిప్‌లో ఐదు వీధి కుక్కలు మూడేళ్ల బాలుడిపై దాడి చేశాయి. దీంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే గమనించిన స్థానికులు బాలుడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బాలుడు ట్యూషన్ నుంచి ఇంటికి వస్తుండగా ఈ ఘటన జరిగింది.

Whats_app_banner