TSRTC : దిగాల్సిన చోట బస్సు ఆపనందుకు, ఆర్టీసీ కండక్టర్ పై మహిళ చెప్పుతో దాడి!-hyderabad news in telugu woman attacked tsrtc bus conductor with footwear not stopped ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tsrtc : దిగాల్సిన చోట బస్సు ఆపనందుకు, ఆర్టీసీ కండక్టర్ పై మహిళ చెప్పుతో దాడి!

TSRTC : దిగాల్సిన చోట బస్సు ఆపనందుకు, ఆర్టీసీ కండక్టర్ పై మహిళ చెప్పుతో దాడి!

HT Telugu Desk HT Telugu
Feb 10, 2024 09:00 PM IST

TSRTC : టీఎస్ఆర్టీసీ సిబ్బందిపై మరోదాడి జరిగింది. రాజేంద్రనగర్ లో ఓ మహిళ ప్రయాణిరాలు రెచ్చిపోయింది. కండక్టర్ ను నానా బూతులు తిడుతూ చెప్పుతో దాడి చేసింది. బస్సు ఆపమన్న ప్రదేశంలో ఆపలేదని కండక్టర్ దుర్భాషలాడుతూ హంగామా చేసింది.

ఆర్టీసీ కండక్టర్ పై మహిళ చెప్పుతో దాడి
ఆర్టీసీ కండక్టర్ పై మహిళ చెప్పుతో దాడి

TSRTC : టీఎస్ఆర్టీసీ బస్సులో సిబ్బందిపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవలే హయాత్ నగర్ డిపో పరిధిలో ఓ యువతి రెచ్చిపోయి బస్సు కండక్టర్ ను కాలితో తన్ని, బూతులు తిడుతూ హంగామా చేసింది. అందుకు సంబంధించిన దృశ్యాలు ఆ మధ్య సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వగా... ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే ఇటీవలే మరో ఘటనలో బస్సు డ్రైవర్ పై ఇద్దరు యువకులు క్రికెట్ బ్యాట్ తో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా ఈ ఘటనలు మరవకముందే హైదరాబాద్ శివారు రాజేంద్ర నగర్ లో ఓ మహిళ ప్రయాణికురాలు రెచ్చిపోయి... ఆర్టీసీ బస్సు కండక్టర్ పై చెప్పుతో దాడి చేసింది. మహిళలకు ఉచితంగా బస్సులు ఎందుకు నడుపుతున్నారంటూ....కండక్టర్ ను నానా బూతులు తిడుతూ హంగామా చేసి చెప్పుతో కొట్టింది. మెహదీపట్నం నుంచి ఉప్పల్ వెళ్లే రూట్ నెంబర్ 300 బస్సులో ఈ ఘటన చోటుచేసుకుంది. శివరాంపల్లి వీకర్ సెక్షన్ కాలనీకి చెందిన ప్రసన్న బస్సులో శివరాంపల్లి వద్ద ఎక్కింది. ఆమె హైదర్ గుడా కల్లు కాంపౌండ్ ప్రాంతంలో దిగాల్సి ఉండగా... బస్సు అత్తాపూర్ లో ఆగింది. దీంతో అత్తాపూర్లో దిగిన ప్రసన్న మళ్లీ వెనక్కి వెళ్లేందుకు రోడ్డు దాటి మెహదీపట్నం నుంచి ఉప్పల్ వెళుతున్న 300 నెంబర్ బస్సు ఎక్కింది. కండక్టర్ ముత్యాల నరసింహ ఆ మహిళను ఎక్కడ దిగాలమ్మ అని అడగడంతో ఒక్కసారే సహనం కోల్పోయిన సదరు మహిళా కండక్టర్ ను బూతుల తిడుతూ... ఆపమన్న చోట బస్సు ఎందుకు ఆపరని....బూతులు తిడుతూ ఆ కండక్టర్ ను చెప్పుతో కొట్టింది. దీంతో తోటి ప్రయాణికులు ఆమెను అడ్డుకొని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. కాగా పోలీస్ స్టేషన్ ముందు దిగిన మహిళా ప్రసన్న... వెంటనే అక్కడి నుంచి పరారయ్యింది.దీంతో బస్సు కండక్టర్ ముత్యాల నరసింహ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

yearly horoscope entry point

మేడారం జాతరకు 6 వేల ప్రత్యేక బస్సులు

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరైన మేడారానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం పకడ్బందీ ఏర్పాట్లను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) చేస్తుంది. భక్తులను తరలించేందుకు 6 వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. మేడారం జాతర ఈ నెల 21 నుంచి 24 వరకు జరుగుతుండగా... భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులను నడపుతున్నట్లు తెలిపింది. ములుగు జిల్లా తాడ్వాయిలోని టికెట్ ఇష్యుయింగ్ కౌంటర్లు, కామారంలో మూడు బస్సుల పార్కింగ్ పాయింట్లు, మేడారంలో 55 ఎకరాల్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక బస్టాండ్, బేస్ క్యాంప్, 48 క్యూ రెయిలింగ్స్ ను వారు ఇటీవలే పరిశీలించారు. జాతరకు మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందుబాటులో ఉన్నందున ఆ మేరకు చర్యలు తీసుకోవాలని వారు నిర్దేశించారు.

మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పటి వరకు 15.50 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకున్నారని, వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చుతున్న టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ బృందాన్ని ఈ సందర్బంగా అభినందించారు. ఈ నెల 16న మేడారం లో టీఎస్ఆర్టీసీ బేస్ క్యాప్ ను ప్రారంభిస్తామని తెలిపారు. మేడారం జాతరలో దాదాపు 14 వేల మంది ఆర్టీసీ సిబ్బంది విధులు నిర్వర్తిస్తారని, వారికి వసతి, భోజనం విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ మాట్లాడుతూ.....మేడారం జాతరను టీఎస్ఆర్టీసీ ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఈ జాతరకు 30 లక్షల మంది భక్తులు వస్తారని టీఎస్ఆర్టీసీ అంచనా వేస్తోందని, రద్దీకి అనుగుణంగా బస్సులను అందుబాటులో ఉంచేలా ప్లాన్ చేసినట్లు పేర్కొన్నారు.

సాధారణంగా ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల నుంచి మేడారానికి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల్లో 51 ట్రాఫిక్ జనరేటింగ్ పాయింట్లను గుర్తించామని చెప్పారు. ట్రాఫిక్ జనరేటింగ్ పాయింట్లలో ప్రయాణికుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా

Whats_app_banner

సంబంధిత కథనం