TS Pending Challan : వాహనదారులకు అలర్ట్, రాయితీతో చలాన్లు చెల్లింపు గడువు పెంపు-hyderabad news in telugu ts govt extended pending challans discounts upto january 31 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Pending Challan : వాహనదారులకు అలర్ట్, రాయితీతో చలాన్లు చెల్లింపు గడువు పెంపు

TS Pending Challan : వాహనదారులకు అలర్ట్, రాయితీతో చలాన్లు చెల్లింపు గడువు పెంపు

Bandaru Satyaprasad HT Telugu
Jan 10, 2024 06:48 PM IST

TS Pending Challan : తెలంగాణ ప్రభుత్వం వాహనదారులకు మరో అవకాశం ఇచ్చింది. రాయితీతో చలాన్లు చెల్లింపు గడువును జనవరి 31 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.

పెండింగ్ చలాన్లు గడువు పెంపు
పెండింగ్ చలాన్లు గడువు పెంపు

TS Pending Challan : పెండింగ్ చలాన్లపై తెలంగాణ ప్రభుత్వం వాహనదారులకు మరో ఛాన్స్ ఇచ్చింది. రాయితీపై చలాన్లు చెల్లింపు గడువు జనవరి 31 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. రాయితీతో చలాన్ల చెల్లింపు గడువు నేటితో ముగియనుంది. చలాన్ల చెల్లింపుల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని వాహనదారుల నుంచి ఫిర్యాదు వస్తున్న క్రమంలో... గడువు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో డిసెంబర్ నాటికి 3.59 కోట్ల పెండింగ్ చలాన్లు ఉన్నాయి. అయితే ఇవాళ్టి వరకూ వాహనదారులు 1.05 కోట్ల చలానాలు చెల్లించగా, వాటి నుంచి రూ.107 కోట్ల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ద్విచక్ర వాహనాలు, ఆటోలకు 80 శాతం రాయితీ, ఆర్టీసీ బస్సులకు 90 శాతం, ఇతర వాహనాలకు 60 శాతం రాయితీ ప్రకటించిన విషయం తెలిసిందే.

yearly horoscope entry point

వాహనదారుల నుంచి భారీ స్పందన

చలాన్ల రాయితీకి వాహనదారుల నుంచి మంచి స్పందన వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా మూడు కోట్ల 59 లక్షల పెండింగ్‌ చలాన్లు ఉండగా…. ఇప్పటి వరకు 1.05 కోట్లకు పైగా చలాన్లు క్లియర్ చేసుకున్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. నేటి వరకు రూ.107 ​కోట్లు వసూలైనట్లు పోలీసులు వెల్లడించారు. హైదరాబాద్‌ కమిషరేట్‌లో రూ. 18 కోట్లు, సైబరాబాద్‌ కమిషనరేట్‌లో రూ. 14 కోట్లు, రాచకొండ కమిషనరేట్‌లో రూ. 7.15 కోట్ల చెల్లింపులు జరిగినట్లు ఓ ప్రకటనలో వెల్లడించారు.

హైదరాబాద్ నగరంలోని రాచకొండ,హైదరాబాద్,సైబరాబాద్.... మూడు కమిషనరేట్లతో పాటు రాష్ట్రంలోని ఇతర కమిషనరేట్ లు, జిల్లా ప్రధాన కార్యాలయాలు మొదలు అన్నీ పట్టణంలో పోలీసులు ట్రాఫిక్ నిబంధనలను పాటించని వాహనదారులకు చలాన్లను విధిస్తారు. సీసీ కెమెరాల ఆధారంగా రూల్స్ అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటారు. తప్పనిసరిగా కొందరి నుంచి చలాన్లను వసూలు చేస్తున్న చాలా మంది మాత్రం చలాన్లను తిరిగి చెల్లించడం లేదు. ఇటీవల కాలంలో పెండింగ్ చలాన్లు పెద్ద సంఖ్యలో చెల్లించకుండా ఉండటంతో పెండింగ్ చలాన్ల సంఖ్య ఎక్కువగా ఉంది. కొవిడ్ కారణంగా వెహికల్స్ ఓనర్స్ పెండింగ్ చలాన్లు చెల్లించలేకపోయారు. కొన్ని వెహికల్స్ పై వాటి వ్యాల్యూ కంటే ఎక్కువ మొత్తంలో చలాన్లు ఉన్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ పరిధిలోని మూడు కమిషనరేట్లతోపాటు తెలంగాణ వ్యాప్తంగా వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లపై కొద్దిరోజుల కిందట తెలంగాణ సర్కార్ రాయితీని ప్రకటించింది.

గతంలో రూ.300 కోట్ల ఆదాయం

ఇక గత సంవత్సరం కూడా ఈ అవకాశాన్ని కల్పించింది సర్కార్. చాలా మంది వాహనదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. కేవలం 40 రోజుల వ్యవధిలోనే ప్రభుత్వానికి చలాన్ల ద్వారా రూ.300 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. తాజాగా మరోసారి అవకాశం ఇవ్వటంతో… పెండింగ్ చలాన్లు భారీ సంఖ్యలో క్లియర్ అవుతున్నాయి. ప్రభుత్వానికి రాబడి రానుంది. తాజాగా తెలంగాణ సర్కార్ పేర్కొన్న రాయితీల ప్రకారం… https://echallan.tspolice.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి చలాన్లను క్లియర్ చేసుకోవచ్చు. Vehicle Number ను ఎంట్రీ చేసి వివరాలను తెలుసుకోవచ్చు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు సూచిస్తున్నారు.

Whats_app_banner