Minister KTR : కాంగ్రెస్ కు ఓటేస్తే ఆరు కష్టాలు గ్యారెంటీ, ఐదేళ్లలో 5గురు సీఎంలు - మంత్రి కేటీఆర్-hyderabad minister ktr criticizes congress six guarantees five cms in five years ,తెలంగాణ న్యూస్
Telugu News  /  Telangana  /  Hyderabad Minister Ktr Criticizes Congress Six Guarantees Five Cms In Five Years

Minister KTR : కాంగ్రెస్ కు ఓటేస్తే ఆరు కష్టాలు గ్యారెంటీ, ఐదేళ్లలో 5గురు సీఎంలు - మంత్రి కేటీఆర్

మంత్రి కేటీఆర్
మంత్రి కేటీఆర్

Minister KTR : కాంగ్రెస్ కు పొరపాటున ఓటేస్తే ఆరు కష్టాలు గ్యారెంటీ అని మంత్రి కేటీఆర్ అన్నారు. ఐదేళ్లకు ఐదుగురు ముఖ్యమంత్రులు మారతారన్నారు.

Minister KTR : ప్రజలు పొరపాటునో గ్రహపాటునో కాంగ్రెస్ ఓటేస్తే ఆరు కష్టాలు గ్యారెంటీలు అని మంత్రి కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కరెంటు కష్టాలు పక్కా గ్యారెంటీ, తాగునీటి కష్టాలు పక్కా గ్యారెంటీ, రైతులు ఎరువుల కోసం, విత్తనాల కోసం లైన్‌లో నిలబడటం పక్కా గ్యారెంటీ, రైతు బంధు, దళిత బంధు పథకాలను ఎగ్గొట్టడం పక్కా గ్యారెంటీ, సంవత్సరానికి ఒక సీఎం మారడం పక్కా గ్యారెంటీ, రాజకీయ అస్థిరతతో రాష్ట్రాన్ని కుదేలు చేయడం పక్కా గ్యారెంటీ అని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. దేశంలో కుంభకోణాలకు పాల్పడిన కాంగ్రెస్‌ నేతలు డబ్బులు బాగా సంపాదించారని, వాటితో ఓట్లు కొనాలని ప్రయత్నిస్తున్నారని కేటీఆర్‌ ఆరోపించారు. కాంగ్రెస్ వాళ్లు డబ్బులిస్తే తీసుకోవాలని ఓటు మాత్రం కారు గుర్తుకే వేయాలని ఓటర్లకు సూచించారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా బీజేపీ అధ్యక్షుడు కోనేరు చిన్న సత్యనారాయణ మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. అనంతరం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ గ్యారెంటీలపై విమర్శలు చేశారు.

ట్రెండింగ్ వార్తలు

కాంగ్రెస్ కు ఓటేస్తే కరెంట్ కష్టాలు

"కాంగ్రెస్ ఎవరు ముఖ్యమంత్రి అవుతారో? ఎవరికీ తెలియదు. వాళ్లలో వాళ్లే కొట్టుకుంటారు. కాంగ్రెస్ ఓటేస్తే కటికి చీకట్లు పక్కా గ్యారెంటీ, మళ్లీ కరెంట్ కష్టాలు పక్కా గ్యారెంటీ, ఆడబిడ్డలకు తాగునీటి కష్టాలు గ్యారెంటీ, ఎరువులు, విత్తనాల కోసం రైతులు తన్నుకోవడం పక్కా గ్యారెంటీ, రైతు బంధు, దళిత బంధు కు రామ్ రామ్, ఐదేళ్లకు ఐదుగురు ముఖ్యమంత్రులు పక్కా గ్యారెంటీ, కాంగ్రెస్ ఓటేస్తే రాష్ట్రం కుదేలవ్వడం పక్కా గ్యారెంటీ. కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది"- మంత్రి కేటీఆర్

కాంగ్రెస్ ఏ టు జెడ్ స్కామ్ లు

ఏ నుంచి జెడ్ వరకు అన్ని స్కామ్ లు చేసి కాంగ్రెస్ నేతలు డబ్బులు బాగా సంపాదించారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో ఓటర్లను డబ్బుతో కొనేందుకు కాంగ్రెస్‌ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్‌ నేతలు డబ్బులు ఇస్తే తీసుకొని, ఓటు మాత్రం కేసీఆర్‌కు వెయ్యాసని సూచించారు. దశాబ్దాల పాటు కాంగ్రెస్ వాళ్లు పీడించారని మండిపడ్డారు. ఇప్పుడు మళ్లీ కొత్త వేషాలతో ముందు వస్తున్నారన్నారు. అలాంటి వాళ్ల మాటలు అస్సలు నమ్మొద్దని ప్రజలను కోరారు.

"కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం తెలంగాణకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటుంది. బీజేపీ ప్రభుత్వం ఈ తొమ్మిదేళ్లలో తెలంగాణకు ఎన్ని అన్యాయాలు చేసిందో గుర్తుచేసుకోండి. రాష్ట్రం ఏర్పడగానే తెలంగాణకు చెందిన 7 మండలాలను ఏపీలో కలిపింది. కరెంట్ కష్టాల్లో ఉన్నప్పుడు లోయర్ సీలేరు ప్రాజెక్టును పక్క రాష్ట్రంలో కలిపింది. బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెడతామనే చెప్పి తుంగలో తొక్కింది కేంద్రం. ప్రజలు కూడా మోదీ మాయ నుంచి బయటపడుతున్నారు. జన్ ధన్ ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామన్నారు. ఒక్క పైసా వేయలేదు"- మంత్రి కేటీఆర్