Telugu News  /  Telangana  /  Hyderabad Metro Introduce Super Saver Card To Travel In Holiday Any Where With Rs 59
హైదరాబాద్ మెట్రో ఆఫర్
హైదరాబాద్ మెట్రో ఆఫర్

Hyderabad Metro Offer | హైదరాబాద్ మెట్రో సూపర్ ఆఫర్.. రూ.59కే జాలీగా డే అంతా జర్నీ చేయోచ్చు

31 March 2022, 19:34 ISTHT Telugu Desk
31 March 2022, 19:34 IST

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. కేవలం 59 రూపాయలు ఉంటే సరిపోతుంది. అయితే.. దీనికి ఒక కండిషన్ పెట్టారు. దానికి సంబంధించిన ఆఫర్ వివరాలు ఏంటంటే..

హైదరాబాద్ లో ఉండేవారికి, నగరాన్ని సందర్శించే వారికి.. హైదరాబాద్ మెట్రో బంపర్ ఆఫర్ ప్రకటించింది. సూపర్ సేవర్ కార్డును తీసుకొచ్చంది. దీంతో రూ.59 ఉండే చాలు.. మెట్రోలో భాగ్యనగరాన్ని చూట్టేయోచ్చు. అయితే దీనికి ప్రత్యేకంగా కొన్ని రోజులను కేటాయించింది. ప్రతి రోజూ వెళ్లి.. 59కే తిరగాలంటే.. కుదరదు.. ప్రత్యేకంగా చెప్పిన రోజుల్లోనే తిరగాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఎల్&టీ మెట్రో ఎండీ కేవీబీ రెడ్డి వెల్లడించారు. సూపర్ సేవర్ కార్డుతో ఈ ఆఫర్ ను ఉపయోగించుకోవచ్చని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు

'సూపర్ సేవర్ కార్డుతో కేవలం రూ.59తో రోజంతా ప్రయాణించవచ్చు. నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఈ కార్డును వినియోగించుకోవచ్చు. అయితే ఇందులో ఒక కండీషన్ ఉంది. ప్రతీ ఆదివారం, ప్రతీ రెండో, నాలుగో శనివారం, ఉగాది, రంజాన్, మొహర్రం, బోనాలు, ఆగస్టు 15, వినాయక చవితి, కృష్ణాష్టమి, దుర్గాష్టమి, దసరా, దీపావళి, బాక్సింగ్ డే, బోగి, శివరాత్రి.. ఇలా మెుత్తం 100 సెలవు రోజుల్లో ఈ ఆఫర్ వర్తిస్తుంది.' అని కేవీబీ రెడ్డి తెలిపారు.

కరోనా పరిస్థితులు, లాక్ డౌన్ తర్వాత మళ్లీ హైదరాబాద్ మెట్రో గాడిలో పడుతోంది. అప్పుడు కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నాం. లాక్ డౌన్ సమయంలో ఎక్కువ రోజులు రైళ్లు నిలిపివేయాల్సి వచ్చింది. కరోనా కారణంగా.. నడిచిన రోజుల్లోనూ.. కొన్ని రోజులు ప్రయాణికులు మెట్రో రైళ్లు ఎక్కడంపై ఆసక్తి చూపించలేదు. ఈ కారణంగా నష్టాలు వచ్చాయి. అయితే కరోనా తగ్గుముఖం పట్టడంతో.. మళ్లీ ప్రయాణికుల సంఖ్య పెరిగింది. 60 శాతం వరకు రద్దీ ఉంది. ప్రయాణికుల కోసమే.. మెట్రో సూపర్ సేవర్ కార్డును తీసుకొస్తున్నాం. ఉపయోగించుకోవాని కోరుతున్నాం.

                                                  - మెట్రో ఎండీ కేవీబీ రెడ్డి

ఉగాది రోజు నుంచి హైదరాబాద్ మెట్రో సూపర్‌ సేవర్‌ కార్డులు అందుబాటులోకి రానున్నాయని.. ఎండీ కేవీబీ రెడ్డి తెలిపారు. సూపర్‌ సేవర్‌ కార్డుతో న‌గ‌రంలో ఎక్కడినుంచైనా.. ఎక్కడికైనా వెళ్లొచ్చని తెలిపారు. రోజంతా దీన్ని ఉపయోగించుకోవచ్చన్నారు. ఈ నిర్ణయంతో ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కరోనా తర్వాత మళ్లీ మెట్రో సేవలు పుంజుకున్నాయి. అయితే ప్రయాణికులను మరింతగా ఆకర్శించేందుకు మెట్రో కొత్త ఆఫర్లతో ముందుకెళ్తోంది.