Hyderabad Crime : మ్యాట్రిమోనీ సైట్ లో మహిళలకు ఎర, వైద్యుడిగా చలామణీ అవుతూ లక్షల్లో టోకరా-hyderabad crime news in telugu cyber crime police arrested two member on matrimony site cheating case ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Crime : మ్యాట్రిమోనీ సైట్ లో మహిళలకు ఎర, వైద్యుడిగా చలామణీ అవుతూ లక్షల్లో టోకరా

Hyderabad Crime : మ్యాట్రిమోనీ సైట్ లో మహిళలకు ఎర, వైద్యుడిగా చలామణీ అవుతూ లక్షల్లో టోకరా

HT Telugu Desk HT Telugu
Jan 28, 2024 02:33 PM IST

Hyderabad Crime : మ్యాట్రిమోనీ సైట్ లో ఫేక్ ప్రొఫైల్ తో మోసాలకు పాల్పడుతున్న ఇద్దరిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. డాక్టర్ అని చెప్పుకుంటూ మహిళలను మోసం చేస్తున్నాడు నిందితుడు. ఓ మహిళ అతడికి సాయం చేస్తుంది.

హైదరాబాద్ సైబర్ క్రైమ్
హైదరాబాద్ సైబర్ క్రైమ్ (Pixabay)

Hyderabad Crime : హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మ్యాట్రిమోనీ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఇద్దరి నిందితులను శనివారం అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు విజయవాడలోనే తాడేపల్లి అపర్ణ టవర్స్ లో నివాసం ఉంటున్న వ్యక్తి మద్దుగారి చంద్రకాంత్ , ఏ2 గా నట్ట భవాని అలియాస్ ముద్దుగారి భవానిగా గుర్తించిన పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. మ్యాట్రిమోనీ ఫ్రాడ్ కేసును దర్యాప్తులో వారు చేసిన మోసాలను పోలీసులు గుర్తించారు. ఓ మహిళా ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిందితుల బండారం బయటపెట్టారు.

yearly horoscope entry point

ఆదాయపు పన్ను సమస్యలంటూ....లక్షలు టోకరా

సదరు మహిళా తెలుగు షాదీ డాట్కామ్ యాప్ లో నిందితుడు చంద్రకాంత్ ను కలిసింది. డిసెంబర్ 2023 తర్వాత వాట్సాప్ లో వీరు కమ్యూనికేషన్ కొనసాగించారు. చంద్రకాంత్ డాక్టర్ గా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో పనిచేస్తున్నానని......బ్యాంకు ఖాతాలో ఆదాయపు పన్ను సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ఆమెకు వివరించాడు. నకిలీ ఎస్బీఐ ఏటీఎం స్లిప్పులను చూపిస్తూ చంద్రకాంత్ మాయమాటలు చెప్పడమే కాకుండా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో నిర్మాణంలో ఉన్న ఓ ఆసుపత్రి చిత్రాలు చూపించి మహిళను నమ్మించాడు. ఆ తరువాత ఆదాయ పన్ను సమస్యలు పరిష్కారానికి అప్పుగా రూ.6 లక్షలు కావాలని.....కొద్ది రోజుల్లోనే తిరిగి ఇస్తానని ఆమెకు మాయమాటలు చెప్పాడు. దీంతో ఆ మహిళా తన స్నేహితుల వద్ద అప్పు చేసి చంద్రకాంత్ కు రూ.6 లక్షలు అందించింది. కొద్ది రోజులు ఆమెతో ఫోన్ లో కమ్యూనికేషన్ కొనసాగించిన చంద్రకాంత్ ఆ తర్వాత ఆమెతో మాట్లాడడం పూర్తిగా మానేశాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన మహిళ... చంద్రకాంత్ పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మరో యువతితో కలిసి మోసాలకు తెర

ఇదిలా ఉంటే....2021 లో ఓ మహిళతో చంద్రకాంత్ కు పరిచయం ఏర్పడింది. ఆమెకు ఆన్లైన్ లో నట్టా భవాని అనే పేరు పెట్టారు. ఆ తర్వాత ఇద్దరు కలిసి నేరాలకు పాల్పడడం ప్రారంభించారు. భవాని పేరిట చంద్రకాంత్ అనేక బ్యాంక్ ఖాతాలు తెరిచాడు. 2023 నవంబర్ లో చంద్రకాంత్ షాది డాట్ కాం యాప్ లో నకిలీ ప్రొఫైల్ నమోదు చేసుకున్నాడు. వైద్య వృత్తిలో ఉంటూ తాను ఉన్నత స్థాయిలో ఆర్థికంగా ఎంతో ఎదిగానని....వ్యాపారవేత్తగా కూడా చెప్పుకుని అనేకమంది మహిళలను సంప్రదించాడు. ఇందు, దివ్య ,మౌనిక అనే ముగ్గురికి కూడా ఆదాయపు పన్ను సమస్యలు అని చెప్పి వారిని కూడా చంద్రకాంత్ మోసం చేసి ఆ డబ్బును భవాని ఖాతాకు బదిలీ చేశాడు.ఈ క్రమంలోనే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మొబైల్ షాప్ యజమానిని కూడా మోసం చేశారు. తెలంగాణ,ఆంధ్రప్రదేశ్,కర్ణాటక రాష్ట్రాల్లో వీరిపై అనేక కేసులు నమోదు అయ్యాయి.

రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా

Whats_app_banner