Ex MP Vs MP : మాజీ ఎంపీ వర్సెస్ ఎంపీ, పోలీస్ స్టేషన్ కు పంచాయితీ-hyderabad crime bjp ex mp konda vishweshwara rao complaint on brs mp ranjith reddy ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ex Mp Vs Mp : మాజీ ఎంపీ వర్సెస్ ఎంపీ, పోలీస్ స్టేషన్ కు పంచాయితీ

Ex MP Vs MP : మాజీ ఎంపీ వర్సెస్ ఎంపీ, పోలీస్ స్టేషన్ కు పంచాయితీ

Bandaru Satyaprasad HT Telugu
Jan 20, 2024 10:49 PM IST

Ex MP Vs MP : మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి మధ్య తీవ్ర మాటల యుద్ధం జరిగింది. ఒకరిపై ఒకరు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే తనను దుర్భాషలాడరని ఎంపీ రంజిత్ రెడ్డిపై కొండా విశ్వేశ్వర్ రెడ్డి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కొండా విశ్వశ్వర్ రెడ్డి, రంజిత్ రెడ్డి
కొండా విశ్వశ్వర్ రెడ్డి, రంజిత్ రెడ్డి

Ex MP Vs MP : బీజేపీ నేత, మాజీ ఎంపీ, బీఆర్ఎస్ ఎంపీ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ పంచాయితీ ఇప్పుడు పోలీస్ స్టేషన్ కు చేరింది. బీజేపీ నేతల, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి ఫోన్ లో దుర్భాషలాడుకున్నారు. ఒకరి ఒకరు సవాళ్లు విసురుకున్నారు. ఇద్దరి మధ్య మాట మాట పెరిగి ఫిర్యాదుల వరకూ వెళ్లింది. తన మనుషులను ఎందుకు కలుస్తావంటూ ఎంపీ రంజిత్ రెడ్డి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. నీకు దమ్ముంటే నా వాళ్లను తీసుకెళ్లూ అంటూ కొండా సవాల్ విసిరారు.

పోలీసులకు ఫిర్యాదు

ఈ ఘటనపై మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి శనివారం బంజారాహిల్స్ పోలీసులకు ఎంపీ రంజిత్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. రంజిత్‌రెడ్డి తనకు ఫోన్‌ చేసి దుర్భాషలాడారని, బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు అనంతరం కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎంపీ రంజిత్ రెడ్డి తనకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. ఫోన్ లో తనను దూషిస్తూ, బెదిరింపు ధోరణితో మాట్లాడారని తెలిపారు. తమ మధ్య రాజకీయ కారణాలు తప్ప ఇంకేం లేదన్నారు. ఎంపీ రంజిత్ రెడ్డిపై ఫోన్ నెంబర్, ఇతర ఆధారాలతో ఫిర్యాదు చేశానన్నారు.

రంజిత్ రెడ్డిపై బీజేపీ నేతలు ఫైర్

రంజిత్​ రెడ్డి ఎంపీగా కంటే కేటీఆర్​బినామిగానే చలామణీ అయ్యారని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కెఎస్ రత్నం ఆరోపించారు. ఎంపీగా చేవెళ్ల పార్లమెంట్​నియోజకవర్గానికి చేసిందేంలేదన్నారు. హైదరాబాద్ లోని ఓ హోటల్​ల్లో మాజీ ఎమ్మెల్యే రత్నంతో పాటు బీజేపీ నాయకులు భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాతుతూ... ఫిలింనగర్​లోని రామానాయుడు స్టూడియో పక్కన ఐదు ఎకరాల దేవాలయ భూమిని ఎంపీ రంజిత్​ రెడ్డి కబ్జా చేశారని విమర్శలు చేశారు.

దీంతో పాటు షాబాద్ లో అసైన్డ్​ భూములు, శేరిలింగంపల్లి పరిధిలోని గోపన్​పల్లి, నానక్​రామ్ గూడలో విలువైన స్థలాలను రంజిత్ రెడ్డి కబ్జాలు చేశారని బీజేపీ నేతలు ఆరోపించారు. రంజిత్ రెడ్డి కేటీఆర్​కు బినామీగా రంజిత్​ రెడ్డి వ్యవహరించినట్లు తెలిపారు. రంజిత్ రెడ్డి ఎంపీగా చేవెళ్ల ప్రజా సమస్యలపై కంటే తన వ్యాపారంపైనే ఎక్కువ దృష్టి పెట్టారన్నారు. రంజిత్ రెడ్డి కోళ్ల దాణ, కోడిగుడ్ల స్కామ్​లో ప్రధాన పాత్రదారుడిగా ఉన్నారని విమర్శించారు. నా 30 ఏళ్ల రాజకీయంలో చేవెళ్ల పార్లమెంట్​ పరిధిలోని రోడ్లన్ని అధ్వాన్నంగా తయారన్నారని ధ్వజమెతమత్తారు. రంజిత రెడ్డి ఎంపీగా పార్లమెంట్​లో ఏ ఒక్క రోజు ప్లాడాడిన దాఖలాలు లేవన్నారు. మంజూరైన పనులు తమ వల్లే వచ్చిందని డబ్బు కొట్టుకుంటున్నారని బీజేపీ నేతలు తెలిపారు.