Mynampally On Harish Rao : సిద్ధిపేటలో హరీశ్ రావు అడ్రస్ గల్లంతు చేస్తా, ఎమ్మెల్యే మైనంపల్లి సంచలన వ్యాఖ్యలు-hyderabad brs mla mynampally hanumantha rao sensational comments on minister harish rao ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Mynampally On Harish Rao : సిద్ధిపేటలో హరీశ్ రావు అడ్రస్ గల్లంతు చేస్తా, ఎమ్మెల్యే మైనంపల్లి సంచలన వ్యాఖ్యలు

Mynampally On Harish Rao : సిద్ధిపేటలో హరీశ్ రావు అడ్రస్ గల్లంతు చేస్తా, ఎమ్మెల్యే మైనంపల్లి సంచలన వ్యాఖ్యలు

Bandaru Satyaprasad HT Telugu
Aug 21, 2023 01:55 PM IST

Mynampally On Harish Rao : కేసీఆర్ కుటుంబంలో చాలా మందికి టికెట్ ఇచ్చారని, తనకు, తన కొడుకు ఇద్దరికీ టికెట్లు ఇస్తేనే పోటీ చేస్తామని ఎమ్మెల్యే మైనంపల్లి తెలిపారు. మెదక్ లో హరీశ్ రావు కల్పించుకుంటే సిద్ధిపేటలో తన తడాఖా చూపిస్తానన్నారు.

  ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు
ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు

Mynampally On Harish Rao : బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తులు వాయిస్ పెంచుతున్నారు. బీఆర్ఎస్ తొలి జాబితా ప్రకటిస్తారన్న సమాచారంతో టికెట్లు దక్కే అవకాశం లేదని భావించిన నేతలు స్వరాలు పెంచుతున్నారు. తాజాగా మంత్రి హరీశ్ రావుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తీవ్ర విమర్శలు చేశారు. మల్కాజిగిరిలో తాను, మెదక్‌లో తన కుమారుడు ఇద్దరం పోటీ చేస్తామన్నారు. మెదక్‌లో హరీశ్ రావు పెత్తనం ఏందని మండిపడ్డారు. మెదక్ అభివృద్ధి కాకపోవడానికి మంత్రి హరీశ్ రావు కారణమని ఆరోపించారు. మెదక్‌లో హరీశ్ రావు కల్పించుకుంటే తాను సిద్దిపేటలో కల్పించుకోవాల్సి ఉంటుందని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు హెచ్చరించారు. అవసరమైతే సిద్దిపేటలో తన తడాఖా చూపిస్తానన్నారు. హరీశ్ రావు అడ్రస్ గల్లంతు చేస్తానని వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్ కుటుంబంలో చాలామందికి టికెట్ ఇచ్చారని, మా ఇద్దరికి టికెట్ ఇస్తేనే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. టికెట్లు రాకపోతే స్వతంత్రులుగా పోటీస్తామని ప్రకటించారు.

ఇద్దరికీ టికెట్ ఇస్తేనే బీఆర్ఎస్ నుంచి పోటీ

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే మైనంపల్లి.. మీడియాతో మాట్లాడారు. మెదక్‌లో ప్రచారం చేయడానికి హరీశ్ రావు ఎవరని ఆయన ప్రశ్నించారు. తన నియోజకవర్గంలో కాకుండా మా జిల్లాలో పెత్తనం చేయడం ఏంటని ప్రశ్నించారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా మల్కాజ్‌గిరి నుంచి తాను, మెదక్ నుంచి తన కుమారుడు రోహిత్ పోటీ చేస్తారని పేర్కొన్నారు. సిద్ధిపేటలో తన తడాఖా ఏంటో చూపిస్తానన్నారు. సిద్దిపేటలో హరీశ్ రావు అడ్రస్ గల్లంతు చేస్తానన్నారు. తాను పంతం పట్టానంటే హరీశ్ రావు బట్టలు ఊడతీసే వరకు నిద్రపోనన్నారు. రబ్బరు చెప్పులతో వచ్చిన హరీశ్ రావు అక్రమంగా రూ. లక్ష కోట్లు సంపాదించారని మైనంపల్లి ఆరోపించారు. రాజకీయంగా ఎంతో మందిని అణచివేశారని మండిపడ్డారు. తాను ప్రస్తుతం బీఆర్ఎస్‌లోనే ఉన్నానని, తన టికెట్ ఇప్పటికే ఖరారైందన్నారు. మెదక్‌లో తన కుమారుడ్ని కచ్చితంగా గెలిపించుకుంటానన్నారు. తన కుటుంబంలో ఇద్దరికీ టికెట్ ఇస్తేనే బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తానని మైనంపల్లి హన్మంతరావు స్పష్టం చేశారు.

హరీశ్ రావుకు బుద్ధిచెబుతాం

తన కుమారుడిని ఎమ్మెల్యే చేయడమే లక్ష్యమని ఎమ్మెల్యే మైనంపల్లి తెలిపారు. మెదక్‌, మల్కాజ్‌గిరి టికెట్లు ఇస్తేనే బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తామన్నారు. ఇద్దరికీ టికెట్‌ ఇవ్వకుంటే స్వతంత్రులుగా పోటీ చేస్తామని స్పష్టం చేశారు. కొవిడ్‌ సమయంలో తన కుమారుడు దాదాపు రూ.8 కోట్లు సొంత డబ్బుతో సేవ చేశాడని మైనంపల్లి తెలిపారు. మెదక్ లో వేలు పెడితే హరీశ్ రావుకు పెద్ద ఎత్తున బుద్ధి చెబుతామన్నారు. హరీశ్ రావు రబ్బరు చెప్పులతో ఎలా వెలమ హాస్టల్‌కు వచ్చాడో అందరికీ తెలుసన్నారు. ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాడో అందరూ గమనించాలన్నారు. నూటికి నూరుపాళ్లు మంత్రి హరీశ్‌ రావుకు బుద్ధి చెబుతానన్నారు. దేవుని మీద ప్రమాణం చేసి చెబుతున్నా సిద్దిపేటలో హరీశ్ రావు అడ్రస్ గల్లంతు చేస్తానని మైనంపల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీశ్ రావు దుకాణం బంద్ చేయించే వరకు తాను నిద్రపోనని మైనంపల్లి అన్నారు.

Whats_app_banner