Hyderabad CDFD Jobs : హైదరాబాద్ డీఎన్ఏ టెస్టింగ్ కేంద్రంలో అసిస్టెంట్ ఉద్యోగాలు, దరఖాస్తుకు డిసెంబర్ 31 లాస్ట్ డేట్
Hyderabad CDFD Jobs : హైదరాబాద్ లోని డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ కేంద్రంలో 8 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 31వ తేదీ లోపు ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవాలి.
Hyderabad CDFD Jobs : హైదరాబాద్ లోని డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ డయాగ్నస్టిక్స్ కేంద్రంలో 8 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ మేనేజరీయల్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్ , టెక్నికల్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 31వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సున్న వారు దరఖాస్తుకు అర్హులు. దరఖాస్తులను ఆన్లైన్ లో సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ను పోస్టు ద్వారా హైదరాబాద్ లోని డీఎన్ఏ సెంటర్ కు పోస్టు చేయాలి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్ లో పనిచేయాల్సి ఉంటుంది.
విద్యార్హతలు
- జూనియర్ మేనేజరీయల్ అసిస్టెంట్ పోస్టులు- ఏదైనా డిగ్రీతో పాటు మూడేళ్ల పని అనుభవం
- జూనియర్ అసిస్టెంట్ పోస్టులు - ఇంటర్ విద్యార్హతతో పాటు ఇంగ్లీష్ టైపింగ్ 35 WPM టైపింగ్ చేయాలి.
- స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్ పోస్టులు - పదో తరగతి విద్యార్హత
- టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు - బీఎస్సీ విద్యార్హత, 5 ఏళ్ల పని అనుభవం, ఎమ్మెస్సీ విద్యార్హతతో పాటు రెండేళ్ల అనుభవం
- టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు - బీఎస్సీ/ బీటెక్ తో పాటు కనీసం మూడేళ్ల పని అనుభవం లేదా సైన్స్ / టెక్నాలజీలో పీజీ పూర్తి చేసి ఉండాలి.
అప్లికేషన్ ఫీజు
- జనరల్, ఓబీసీ అభ్యర్థులకు ఫీజు - 200
- ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ, మహిళలకు ఫీజు లేదు.
జీతాలు
జూనియర్ మేనేజరీయల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు రూ.29,200 నుంచి రూ.92,300 వరకు జీతం ఇస్తారు. టెక్నికల్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు రూ.35,400 నుంచి రూ.1,12,400, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు రూ.19,900 నుంచి రూ.63,200, స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్ ఉద్యోగాలకు రూ.18,000 నుంచి రూ.56,100 వరకు జీతాలు ఇస్తారు. డిసెంబర్ 2 నుంచి దరఖాస్తులు ప్రారంభం అయ్యాయి. డిసెంబర్ 31 వరకు అప్లై చేసుకోవచ్చు.
అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లై చేసిన తర్వాత దరఖాస్తులను ఈ కింది అడ్రస్ కు పంపాల్సి ఉంటుంది.
The Head Administration, Centre for DNA Fingerprinting And Diagnostics, Inner Ring Road, Uppal, Hyderabad -500039, Telangana.
దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి
http://14.139.82.220/apps/2024/Advt_04Nov_2024/
అధికారిక వెబ్ సైట్
http://www.cdfd.org.in
సంబంధిత కథనం