Santosh Kumar On Land Issue : రాజకీయ దురుద్దేశంతోనే భూకబ్జా కేసు, ఎలాంటి విచారణకైనా సిద్ధం- మాజీ ఎంపీ సంతోష్ కుమార్
Santosh Kumar On Land Issue : భూకబ్జా ఆరోపణలపై బీఆర్ఎస్ నేత సంతోష్ కుమార్ స్పందించారు. తాను షేక్ పేటలో 904 గజాల ఇంటి స్థలం కొనుగోలు చేశానని, గత 32 ఏళ్లుగా ఎలాంటి న్యాయవివాదం లేదన్నారు. రాజకీయ కక్షతో బురద జల్లాలని ఉద్దేశంతో ఈ కేసు పెట్టారని ఆరోపించారు.
Santosh Kumar On Land Issue : నవయుగ కంపెనీ స్థలాన్ని కబ్జా చేశారన్న ఆరోపణలపై బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ (Ex MP Santosh Kumar)పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్(Police Case) లో కేసు నమోదు అయ్యింది. ఈ కేసుపై సంతోష్ కుమార్ స్పందించారు. షేక్ పేటలోని సర్వే నంబర్ 129/54 లో ఉన్న 904 చదరపు గజాల ఇంటి స్థలం తాను శ్యాంసుందర్ ఫుల్జాల్ అనే వ్యక్తి నుంచి 2016లో పూర్తి చట్టబద్ధంగా కొనుగోలు చేశానని తెలిపారు. ఈ స్థలాన్ని రూ. 3 కోట్ల 81 లక్షల 50 వేలు చెల్లించి, సేల్ డీడ్ ద్వారా రిజిస్ట్రేషన్ శాఖ ఆధ్వర్యంలో కొనుగోలు చేశానన్నారు. కాబట్టి ఫోర్జరీ(Forgery) అనే మాటకు తావులేదని చెప్పారు. డాక్యుమెంట్స్ ఫోర్జరీ చేశానన్నది వాస్తవం కాదన్నారు. 8 ఏళ్లుగా తనను ఎవరూ సంప్రదించలేదని, ఎలాంటి న్యాయవివాదం తలెత్తలేదన్నారు. తనకు ఇంటి స్థలాన్ని అమ్మిన శ్యాంసుందర్ ఆ భూమిని 1992లో సేల్ డీడ్ నంబర్ 1888/1992 ద్వారా కొనుగోలు చేశారని తెలిపారు. అప్పటి నుంచి ఎలాంటి న్యాయవివాదాలు లేవని ఆయన తనకు స్పష్టంగా తెలియజేశారన్నారు. దాదాపు 32 ఏళ్లుగా ఆ భూమిపై ఎలాంటి న్యాయవివాదాలు లేవని సంతోష్ కుమార్ తెలిపారు.
లీగల్ నోటీసు ఇవ్వకుండా నేరుగా ఫిర్యాదు
ఈ స్థలంలో తాను ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదని సంతోష్ కుమార్ తెలిపారు. శ్యాంసుందర్, అంతకన్నా ముందు వాళ్లు చేపట్టిన నిర్మాణాలే ఇంకా ఉన్నాయన్నారు. ఆ స్థలం గడిచిన 32 సంవత్సరాలుగా తనకు అమ్మిన వ్యక్తి, ఇప్పుడు తన ఆధీనంలోనే ఉందన్నారు. ఒకవేళ ఏమైనా న్యాయపరమైన అంశాలు ఉంటే ముందుగా తనకు లీగల్ నోటీసు(Legal Notice) ఇచ్చి, వివరణ అడగాలన్నారు. కానీ అలాంటివేమీ చేయకుండా నేరుగా పోలీస్ స్టేషన్ లో ఫోర్జరీ(Forgery) చేశామని ఎలా ఫిర్యాదు చేస్తారచేశారు. వివాదాస్పద ఇంటి స్థలం 1350 గజాలు అని పోలీసులు, మీడియా పేర్కొంటున్నారని, కానీ నేను కొన్నది 904 గజాల ఇంటి స్థలం అని గమనించాలన్నారు. దీనిని బట్టి ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతో నమోదు చేసిన కేసు అని స్పష్టంగా అర్థమవుతుందని సంతోష్ కుమార్ (Santosh Kumar)ఆరోపించారు.
చట్టపరంగా ఎదుర్కొంటా
తాను డబ్బులు పెట్టి కొన్న ఆస్తిపై అనవసర నిందలు వేస్తూ.. ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారన్నారు. తాను ఎలాంటి కబ్జాలకు పాల్పడలేదని స్పష్టం చేశారు. తాను కొనుగోలు చేసిన భూమిపై ఎవరైనా విచారణ చేసుకోవచ్చారని ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ఈ కేసును న్యాయపరంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. 32 సంవత్సరాలుగా లేని వివాదం కొత్తగా ఇప్పుడు ఎందుకు తెర మీదికి వచ్చిందో సులభంగా అర్థం చేసుకోవచ్చన్నారు. బీఆర్ఎస్ (BRS)పై, తనపై రాజకీయ కక్షతో బురద జల్లాలని చూస్తే సహించేది లేదన్నారు. తప్పుడు ఆరోపణలు చేసి వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించాలని చూస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానని సంతోష్ కుమార్ పేర్కొన్నారు.
అసలేంటీ వివాదం?
బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ (J Santosh Kumar)పై ఫోర్జరీ కేసు(Forgery Case on Santosh Kumar ) నమోదు అయ్యింది. బంజారాహిల్స్(Banjara Hills) రోడ్ నంబర్ 14లో ఫోర్జరీ డాక్యుమెంట్లతో భూమిని కబ్జా చేసినట్లు నవయుగ కంపెనీ(Navayuga Group) ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. ఫేక్ డాక్యుమెంట్స్, ఫ్యాబ్రికేటెడ్ డోర్ నెంబర్ల సృష్టించి తమ భూమి కబ్జా చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. నవయుగ కంపెనీ ప్రతినిధి చింతా మాధవ్ ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 14లో ఎన్ఈసీఎల్సంస్థకు(NECL) భూమి ఉంది. అయితే ఈ భూమిలో అక్రమంగా చొరబడిన కొందరు రూములు నిర్మించారు. వీటికి ఫోర్జరీ డాక్యుమెంట్లు (Documents Forgery)సృష్టించి సర్వే నంబర్ 129/54లో 1350 చదరపు గజాల స్థలాన్ని కబ్జాకు చేసేందుకు ప్రయత్నించారని చింతా మాధవ్ పోలీసులు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ రూములకు సంబంధించి మాజీ ఎంపీ సంతోష్ కుమార్(Santosh Kumar) తో పాటు లింగారెడ్డి శ్రీధర్ ట్యాక్స్ కట్టినట్లు గుర్తించామన్నారు. దీంతో వీరిద్దరిపై బంజరాహిల్స్ పోలీసులను కేసు నమోదు చేశారు. సంతోష్ కుమార్ పై 420,468,471,447,120, ఆర్/డబ్ల్యూ 34 ఐపీసీ సెక్షన్లు నమోదు చేశారు.
సంబంధిత కథనం