Hyderabad MP Seat : ఖరారు కానీ కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు - హైదరాబాద్ సీటుపై 'తర్జనభర్జన'!
Loksabha Election in Telangana 2024: హైదరాబాద్ లోక్ సభ స్థానానికి సంబంధించి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఇంకా అభ్యర్థులను ఖరారు చేయలేదు. ఇప్పటికే బీజేపీ అభ్యర్థి ప్రజల్లోకి వెళ్తుండగా… ఎంఐఎం మాత్రం మరోసారి ఇక్కడ తమదే విజయమని చెబుతోంది.
Loksabha Election in Telangana 2024: హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిపై(Hyderabad Lok Sabha constituency) ఇటు అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రధాన ప్రతిపక్షమైన బిఆర్ఎస్ పార్టీ తర్జనభర్జన పడుతున్నాయి. ఇప్పటికే గ్రేటర్ పరిధిలోని 3 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా......హైదరాబాద్ స్థానంపై ఆ రెండు పార్టీలకు అభ్యర్థులు దొరకని పరిస్థితి ఏర్పడింది. ఎన్నో ఏళ్లుగా మజ్లిస్ కు కంచుకోట గా ఉన్న పాతబస్తీపై ఈసారి ఎలాగైనా కాషాయ జెండా ఎగరు వేయాలని భావించిన బీజేపీ అందరి కంటే ముందే మాధవిలతను అభ్యర్థిగా ప్రకటించి ముందంజలో ఉంది.ఇటు ఎంఐఎం నుంచి హైదరాబాద్ సిట్టింగ్ ఎంపిగా ఉన్న అసదుద్దీన్ ఒవైసీ మరోసారి బరిలో ఉండనున్నారు.
నిజానికి పాతబస్తీ పై బిఆర్ఎస్,కాంగ్రెస్ పార్టీలు పెద్దగా ఆశలు పెట్టుకోలేదనే చెప్పాలి.అయితే ఇటు కారు పార్టీ నుంచి అటు హస్తం పార్టీ నుంచి కూడా నేతలు పెద్దగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదని తెలుస్తుంది.గత ఎన్నికలను పరిశీలిస్తే....బిఆర్ఎస్,కాంగ్రెస్ అభ్యర్థులు మజ్లిస్ కు గట్టి పోటీ ఇవ్వడం పక్కన పెడితే కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయారు.అదే పరిస్థితి ఇప్పుడు కూడా పునరావృతం అయ్యే అవకాశాలు లేకపోలేదు.
హస్తం పార్టీలో అభ్యర్థులు కరువు.....?
కాంగ్రెస్ నుంచి హైదరాబాద్ లోక్ సభ స్థానం(Hyderabad Lok Sabha constituency) నుంచి పోటీ చేసే అభ్యర్థులు కరువయ్యారు.మొన్నటి వరకు అలీ మస్కతి పేరు వినిపించినా.....అయన సైతం ఇప్పుడు వెనెక్కి తగ్గినట్టు సమాచారం.తాజాగా సుప్రీం కోర్టు న్యాయవాది శానాజ్ పేరు తెర పైకి వచ్చింది.అల్ ఇండియా అజాద్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకురాలు,ఆ పార్టీకి జాతీయ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు.ఇటీవలే ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీలో సందర్బంగా షానాజ్ప్ర స్తావన తెరమీదకు వచ్చింది.విద్యధుకురాలైన మహిళా కావడంతో పాటు ముస్లిం ఓట్లకు,కాంగ్రెస్ ఓటు బ్యాంక్ కూడా జత కావచ్చని కాంగ్రెస్ భావిస్తోంది.గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన ఫిరోజ్ ఖాన్ మరోసారి ఆసక్తి చూపుతూ ఉన్నప్పటికీ అధిష్ఠానం మాత్రం అయన అభ్యర్థిత్వాన్ని పరిగణలోకి తీసుకొనట్లు తెలుస్తుంది.పాతబస్తీలో మజ్లిస్ టార్గెట్ గా రాజకీయాలు చేస్తున్న ఎంబిటి తో కలిసి పోటీలో దిగితే మజ్లిస్ కు(AIMIM) గట్టి పోటీ ఇవడం ఖాయం.కానీ సీఎం రేవంత్ రెడ్డి అసదుద్దీన్ తో సానుకూలంగా ఉంటూ వస్తుండడంతో అది ఎంబీటి పార్టీకి మింగుడు పడటం లేదు.దీంతో కాంగ్రెస్ తో కలిసే ఆలోచనను ఎంబీటీ విరమించుకున్నట్టు తెలుస్తుంది.
బిఆర్ఎస్ లోనూ అదే పరిస్థితి......
రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్(BRS Party) పార్టీ సైతం హైదరాబాద్ ఎంపి అభ్యర్థి కోసం అన్వేషించే పనిలో పడింది.మొదట్లో పలువురు నేతలు పోటీకి ఆసక్తి చూపినా తరువాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో....నేతలెవరూ పోటీకి ముందుకు రావడం లేదు.మజ్లిస్ తో స్నేహం కారణంగా అక్కడ మొక్కుబడిగా అభ్యర్థిని నిలబెడతారు కేసిఆర్. అయితే ఈసారి ఆ పార్టీ అధికారం కోల్పోవడంతో నామ మాత్రం పోటీకి నేతలు ఎవ్వరూ కూడా ఆసక్తి చూపడం లేదట.కాగా మైనారిటీ ఓట్లు అధికంగా ఉన్న ఈ స్థానం నుంచి మాజీ హోం మంత్రి కుటుంబం నుంచి ఒకరిని బరిలో దింపితే బాగుంటుందని గులాబీ బాస్ ఆలోచిస్తున్నాడట.