Gold Price: బంగారం, వెండి.. మీ నగరాల్లోని తాజా ధరలివే..
కొన్ని రోజులుగా బంగారం ధరలు ఎగబాకుతున్నాయి. అయితే రెండు రోజులుగా గోల్డ్ ధర తగ్గుముఖం పట్టింది. ఇవాళ హైదరాబాద్ మార్కెట్ లో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 53,450ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,000 వద్ద కొనసాగుతోంది.
కొద్దిరోజుల కిందట స్థిరంగా ఉన్న పసిడి ధరలు.. మధ్యలో భారీగా పెరిగాయి. గత నాలుగైదు రోజులుగా పరిస్థితి మారింది. ధరలకు బ్రేక్ లు పడినట్లు కనిపిస్తోంది. తాజాగా హైదరాబాద్ మార్కెట్ లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,450కు దిగొచ్చింది. 22 క్యారెట్ల పసిడి ధర రూ.49,000 వద్ద కొనసాగుతోంది. ఇంక వెండి ధర వారం రోజుల్లో రూ.4000 మేర తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 1 కేజీ వెండి ధర రూ.71,600గా ఉంది.
ఇక ఏపీ మార్కెట్లోనూ ధరలు స్థిరంగానే ఉన్నాయి. విశాఖలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,450 కాగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.49,000 కు పతనమైంది. ఇక విజయవాడలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.53,450గా ఉంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.49,000 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో స్వచ్ఛమైన వెండి 1 కేజీ ధర రూ.71,600 కు దిగొచ్చింది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,000 కాగా, 24 క్యారెట్ల బంగారం రూ.53,450 కి పతనమైంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,000 కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.53,450గా ఉంది. చెన్నైలో గరిష్ట ధరలు నమోదు చేసింది బంగారం. రూ.210 మేర ధర తగ్గినా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.49,450 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,950గా నమోదైంది.
ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉన్నాయి. తాజాగా రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రభావం అనేక రంగాలపై పడింది. ఆ ప్రభావమే ఈ బంగారం విపరీతంగా పెరగడానికి కారణమైంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల వంటి అంశాలు కూడా ప్రభావితం చేస్తున్నాయి.
సంబంధిత కథనం
టాపిక్