Telangana Police : గంజాయి నియంత్రణపై నిఘా - అన్ని పోలీస్ స్టేషన్లలో ‘డ్రగ్ డిటెక్టింగ్ కిట్స్’…ఇట్టే పట్టేస్తారు..!-ganja detecting kits for control of ganja in nalgonda district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Police : గంజాయి నియంత్రణపై నిఘా - అన్ని పోలీస్ స్టేషన్లలో ‘డ్రగ్ డిటెక్టింగ్ కిట్స్’…ఇట్టే పట్టేస్తారు..!

Telangana Police : గంజాయి నియంత్రణపై నిఘా - అన్ని పోలీస్ స్టేషన్లలో ‘డ్రగ్ డిటెక్టింగ్ కిట్స్’…ఇట్టే పట్టేస్తారు..!

HT Telugu Desk HT Telugu
Aug 03, 2024 11:01 AM IST

Drug detecting kits in Nalgonda : గంజాయి నియంత్రణకు ఉమ్మడి నల్గొండ జిల్లా పోలీసులు నడుంబిగించారు. ఎబాన్ డ్రగ్ యూరిన్ టెస్టులను చేసేందుకు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో డ్రగ్ డిటెక్టింగ్ కిట్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు.

గంజాయి నియంత్రణకు ... ఎబాన్ డ్రగ్ యూరిన్ టెస్ట్
గంజాయి నియంత్రణకు ... ఎబాన్ డ్రగ్ యూరిన్ టెస్ట్

హైదరాబాద్ నగరంలో ఒకనాడు గుడుంబా ప్రధాన కేంద్రంగా ఉండిన దూల్ పేట ఇపుడు గంజాయికి కేంద్రం అయ్యింది. తెలంగాణలోకి గంజాయి ఎక్కువగా ఒడిశా, ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ ఏజెన్సీ నుంచి దిగుమతి అవుతోందని గుర్తించారు. ఏపీకి సరిహద్దుగా ఉన్న నల్గొండ జిల్లా గంజాయి రవాణకు గుమ్మంగా మారిందన్న అభిప్రాయం ఉంది.

ప్రధానంగా ఉమ్మడి నల్గొండ జిల్లా గుండా విజయవాడ – హైదరాబాద్ జాయతీ రహదారి సుమారు 70 కిలోమీటర్ల నిడివిలో ఉంది. ఈ రహదారి గుండానే హైదరాబాద్ కు అక్కడి నుంచి దేశంలోని వివిధ నగరాలకు గంజాయి రవాణా అవుతోంది. గంజాయి రవాణ, వినియోగంపై ఉక్కు పాదం మోపేందుకు రాష్ట్రం ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. గంజాయి, మత్తు పదార్దాల రవాణాను అడ్డుకునేందుకు ప్రత్యేకంగా ద్రుష్టి సారించాలని ప్రభుత్వం ఆదేశించడంతో గంజాయి లభ్యత, వినియోగం అత్యధికంగా ఉన్న నల్గొండ జిల్లాపై ఇక్కడి అధికార యంత్రాంగం ప్రత్యేక నజర్ పెట్టింది.

గంజాయి టెస్టింగ్ కిట్లు….

మందు బాబులను దొరకబట్టేందుకు డ్రంకెన్ డ్రైవ్ లో బ్రీత్ అనలైజర్ఉ పయోగపడుతోంది. కానీ, గంజాయి దమ్ము కొట్టి న్యూసెన్స్ చేస్తున్న వారిని పోలీసులు బుక్ చేయలేక పోతున్నారు. దీంతో ఇటీవలనే ఉమ్మడి నల్గొండ జిల్లాలో గంజాయి దమ్ముకొట్టిన వారిని తనిఖీ చేసేందుకు పోలీసు శాఖ ప్రత్యేక కిట్లను ఆయా పోలీస్ స్టేషన్లకు పంపిణీ చేసింది. ఇలా ఇప్పటి వరకు 180 కిట్లను అందజేశారు. ప్రతీ పోలీస్ స్టేషన్ లో కనీసం నాలుగు నుంచి అయిదు కిట్లు అందుబాటులో ఉంచారు.

డ్రంకెన్ డ్రైవ్ లో బ్రీత్ అనలైజర్స్ ఉపయోగిస్తుండగా, గంజాయి, ఇతర మత్తు పదార్దులు తీసుకున్న వారిని దొరకబట్టేందుకు మూత్ర పరీక్షలను ఆశ్రయిస్తున్నారు. దాదాపు 12 రకాల మత్తు పదర్దాల గుట్టును కనిపెట్టే.. ‘ఎబాన్ డ్రగ్ యూరిన్ టెస్ట్ కిట్ ’ లను ఉపయోగిస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 50 మంది గంజాయి బాబులకు ఈ టెస్టులు చేశారు. ఈ టెస్టుల్లో దొరికిన వీరందరినీ మొదటిసారి తప్పిదంగా భావించి కౌన్సిలింగ్ఇ చ్చి పంపించారు. రెండో సారి మళ్లీ దొరికితే కనీసం 6 నెలల శిక్ష పడేలా కేసులు పెడతామని హెచ్చరించి పంపిస్తున్నారు.

గంజాయి తాగిన వారి కంటే అమ్మిన వారి మీదనే కేసులు నమోదు చేస్తున్నారు. తాగిన వారికి కౌన్సిలింగ్ఇ స్తున్నారు. గంజాయి అమ్మిన వారి పైన ఎన్.డి.పి.ఎస్ యాక్ట్ , సెక్షన్ 21 ప్రకారం కేసు నమోదుతో 6 నెలల జైలు శిక్ష ఉంటుందని పోలీసు, ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. కాగా, ఒకసారి గంజాయి తాగితే 6 నెలల పాటు శరీరంలో ఆ అవశేషాలు ఉంటాయి కాబట్టి, తనిఖీల్లో తేలిగ్గా దొరికిపోతారు.

ఏపీలోని వైజాగ్ ఏజెన్సీ, ఒడిషా నుంచి వస్తున్న గంజాయిని అడ్డుకునేందుక జాతీయ రహదారిపై ప్రధానంగా సరిహద్దుల్లోని కోదాడ పరిధిలో గట్టి నిఘా పెంచారు.

జిల్లాల స్థాయిలో ఎన్ కార్డ్

రాష్ట్ర ప్రభుత్వం గంజాయి, ఇతర మత్తు పదార్దాల రవాణా, వినియోగంపై ఉక్కు పాదం మోపాలని నిర్ణయించిన నేపథ్యంలో జిల్లా స్తాయిలో నార్కో, కో ఆర్డినేషన్ సెంటర్ కమిటీ (ఎన్, కార్డ్) ఏర్పాటు చేశారు. ఇది మాదక ద్రవ్యాల నియంత్రణకు పనిచేస్తుంది. ఈ మేరకు నల్గొండ జిల్లా కలెక్టర్నా రాయణ రెడ్డి, ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఇతర అధికారులతో కలిసి ప్రత్యేక సమావేశం జరిపి కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. వచ్చే వారం జిల్లా వ్యాప్తంగా గంజాయి, మత్తు పదార్ధాల నివారణకు ప్రజల్లో అవగాహన కల్పించేలాగంజాయి వ్యతిరేక వారోత్సవాలు జరపాలని నిర్ణయించారు.

హోర్డింగులు, పత్రికల్లో ప్రకటలు, తదితర రూపాల్లో ప్రచారం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా కాలేజీలు, విద్యాసంస్థల్లో గంజాయి తాగడం వల్ల వచ్చే అనర్ధాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే అందిన ఎబాన్ డ్రగ్ యూరిన్ టెస్టింగ్ కిట్ల ద్వారా విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. పోలీసుల పరీక్షల్లో 50 మంది గంజాయి తాగినట్లు తేలింది. ఇలా పట్టుబడిన వారిలో విద్యార్థులు, మైనర్లు, ఉంటేమొదటి తప్పుగా కేసులు నమోదు చేయకుండా తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ కూడా ఇచ్చారు. పద్దెనిమిదేళ్ల వయస్సు దాటిని వారి యూరిన్శాం పిళ్ళను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపుతున్నారు.

అందులో కూడా గంజాయి తాగినట్లు పాజిటివ్ రిపోర్ట్ వస్తే కేసులు పెడుతున్నారు. ఇల్లా కేసుల్లో ఇరుక్కున్న వారికి కనీసం 6 నెలల జైలు శిక్ష పడే అవకాశం ఉందని పోలీసు అధికారులు చెబుతున్నారు. గంజాయి దమ్ము కొడుతున్న వారిని పట్టుకునేందుకు ఎబాన్ డ్రగ్ యూరిన్ టెస్ట్ కిట్ల సంఖ్యను మరింతగా పెంచనున్నట్లు అధికార యంత్రాంగం చెబుతోంది.

( రిపోర్టింగ్ : క్రాంతీపద్మ, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి నల్గొండ

ప్రతినిధి )

సంబంధిత కథనం