Hyderabadi food: ఓరి దేవుడా.. హైదరాబాద్ హోటళ్లలో ఇంత దారుణమా.. టాస్క్ ఫోర్స్ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు-food task force team has conducted inspections in food establishments at dlf food street gachibowli hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Hyderabadi Food: ఓరి దేవుడా.. హైదరాబాద్ హోటళ్లలో ఇంత దారుణమా.. టాస్క్ ఫోర్స్ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు

Hyderabadi food: ఓరి దేవుడా.. హైదరాబాద్ హోటళ్లలో ఇంత దారుణమా.. టాస్క్ ఫోర్స్ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు

Aug 16, 2024, 07:11 PM IST Basani Shiva Kumar
Aug 16, 2024, 07:11 PM , IST

  • Hyderabadi food: హైదరాబాద్.. ఈ పేరు వినగానే ఫస్ట్ గుర్తొచ్చేది మంచి ఫుడ్. అంతటి పేరున్న హైదరాబాద్‌లో.. కొందరు హోటల్ నిర్వాహకులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. తాజాగా గచ్చిబౌలిలోని డీఎల్ఎఫ్ ఫుడ్‌స్ట్రీట్‌లో టాస్క్‌ఫోర్స్ తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

హోటళ్ల పరిసరాల్లో అపరిశుభ్రత కొట్టొచ్చినట్టు కనిపించింది. ఎక్కడ చూసినా వ్యర్థ పధార్ధాలే కనిపించాయి. పాత్రలు కూడా అపరిశుభ్రంగా ఉండటంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

(1 / 7)

హోటళ్ల పరిసరాల్లో అపరిశుభ్రత కొట్టొచ్చినట్టు కనిపించింది. ఎక్కడ చూసినా వ్యర్థ పధార్ధాలే కనిపించాయి. పాత్రలు కూడా అపరిశుభ్రంగా ఉండటంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. (Image Source From @cfs_telangana X Account)

హోటల్ కిచెన్ గదుల్లో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు. ఫలితంగా నిల్వచేసిన ఆహారా పధార్థాల్లోకి మురుగు నీరు చేరుతోంది. దోమలు, ఈగలు ముసురుతున్నాయి.  

(2 / 7)

హోటల్ కిచెన్ గదుల్లో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు. ఫలితంగా నిల్వచేసిన ఆహారా పధార్థాల్లోకి మురుగు నీరు చేరుతోంది. దోమలు, ఈగలు ముసురుతున్నాయి.  (Image Source From @cfs_telangana X Account)

హోటల్‌లో మాంసం నిల్వ చేశారు. దాన్ని సరిగా ప్యాక్ చేయకపోవడంతో.. మాంసంపై ఈగలు దోమలు వాలుతున్నాయి. వాటినే వండి వినియోగదారులకు ఇస్తున్నారు. దీనిపై అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

(3 / 7)

హోటల్‌లో మాంసం నిల్వ చేశారు. దాన్ని సరిగా ప్యాక్ చేయకపోవడంతో.. మాంసంపై ఈగలు దోమలు వాలుతున్నాయి. వాటినే వండి వినియోగదారులకు ఇస్తున్నారు. దీనిపై అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.(Image Source From @cfs_telangana X Account)

వంట పాత్రలు శుభ్రం చేసే ప్రాంతం దుర్గంధంగా ఉంది. చెత్త చెదారం అంతా పాత్రల్లోనే పడేస్తున్నారు. వాటిని సరిగా శుభ్రం చేయకముందే మళ్లీ వంట చేస్తున్నారు. వంట పాత్రలన్నీ దుర్వాసన వస్తున్నాయి.

(4 / 7)

వంట పాత్రలు శుభ్రం చేసే ప్రాంతం దుర్గంధంగా ఉంది. చెత్త చెదారం అంతా పాత్రల్లోనే పడేస్తున్నారు. వాటిని సరిగా శుభ్రం చేయకముందే మళ్లీ వంట చేస్తున్నారు. వంట పాత్రలన్నీ దుర్వాసన వస్తున్నాయి.(Image Source From @cfs_telangana X Account)

హోటల్లో ఏర్పాటు చేసిన చెత్త డబ్బాలు నిండి ఉన్నాయి. వాటిని తొలగించలేదు. దీంతో దుర్వాసన వస్తోంది. ఆ వ్యర్థాలపై ఈగలు, దోమలు వాలుతున్నాయి. దీనిపై టాస్క్ ఫోర్స్ అధికారులు అసహనం వ్యక్తం చేశారు. 

(5 / 7)

హోటల్లో ఏర్పాటు చేసిన చెత్త డబ్బాలు నిండి ఉన్నాయి. వాటిని తొలగించలేదు. దీంతో దుర్వాసన వస్తోంది. ఆ వ్యర్థాలపై ఈగలు, దోమలు వాలుతున్నాయి. దీనిపై టాస్క్ ఫోర్స్ అధికారులు అసహనం వ్యక్తం చేశారు. (Image Source From @cfs_telangana X Account)

ఆహార పధార్థాలు నిల్వ చేసే రిఫ్రిజిరేటర్‌లు అపరిశుభ్రంగా ఉన్నాయి. మాంసం, ఆహార పధార్థాలు రోజుల తరబడి నిల్వ చేయడంతో.. రిఫ్రిజిరేటర్‌లు కూడా దుర్వాసన వస్తున్నాయి.

(6 / 7)

ఆహార పధార్థాలు నిల్వ చేసే రిఫ్రిజిరేటర్‌లు అపరిశుభ్రంగా ఉన్నాయి. మాంసం, ఆహార పధార్థాలు రోజుల తరబడి నిల్వ చేయడంతో.. రిఫ్రిజిరేటర్‌లు కూడా దుర్వాసన వస్తున్నాయి.(Image Source From @cfs_telangana X Account)

ఆరుబయట ఏర్పాటు చేసిన చెత్త డబ్బాలను కూడా తొలగించడం లేదు. దీంతో పరిసరాలు చెత్తాచెదారంతో ఉన్నాయి. దీనివల్ల వినియోగదారులు ఇబ్బందులకు గురయ్యారు. గడువు ముగిసిన లైసెన్స్‌తో ఎఫ్‌బీవో వ్యాపారం నడుపుతోందని అధికారులు వెల్లడించారు.  

(7 / 7)

ఆరుబయట ఏర్పాటు చేసిన చెత్త డబ్బాలను కూడా తొలగించడం లేదు. దీంతో పరిసరాలు చెత్తాచెదారంతో ఉన్నాయి. దీనివల్ల వినియోగదారులు ఇబ్బందులకు గురయ్యారు. గడువు ముగిసిన లైసెన్స్‌తో ఎఫ్‌బీవో వ్యాపారం నడుపుతోందని అధికారులు వెల్లడించారు.  (Image Source From @cfs_telangana X Account)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు