Formula E race 2023:హైదరాబాద్ వేదికగా ‘ఫార్ములా- ఈ’ రేస్ - దేశంలోనే ఫస్ట్ టైం-first formula e race in india to be held in hyderabad on feb 11th 2023 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Formula E Race 2023:హైదరాబాద్ వేదికగా ‘ఫార్ములా- ఈ’ రేస్ - దేశంలోనే ఫస్ట్ టైం

Formula E race 2023:హైదరాబాద్ వేదికగా ‘ఫార్ములా- ఈ’ రేస్ - దేశంలోనే ఫస్ట్ టైం

HT Telugu Desk HT Telugu
Jun 30, 2022 10:46 AM IST

first formula e race in hyderabad: మరో ప్రతిష్టాత్మక ఈవెంట్ కు వేదిక కానుంది హైదరాబాద్. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నగరం నడిబొడ్డును ‘ఫార్ములా ఈ-రేస్‌’ చాంపియన్‌షిప్‌ జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయనుంది.

<p>హైదరాబాద్ లో ఫార్ములా రేస్</p>
హైదరాబాద్ లో ఫార్ములా రేస్

Formula E - race 2023: హైదరాబాద్... జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేకమైన పేరు సంపాదించిన నగరం. ఎన్నో ఈవెంట్లకు అతిథ్యం ఇస్తూ ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకుంటూ వస్తోంది. తాజాగా మరో ప్రతిష్టాత్మక ఈవెంట్ కు అతిథ్యం ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రతిష్ఠాత్మక స్పోర్ట్స్‌ కార్ల ఈవెంట్‌ ‘ఫార్ములా -ఈ’ రేసు నగర నడిబొడ్డున జరుగనుంది. ‘ఫార్ములా ఈ-రేస్‌’ చాంపియన్‌షిప్‌ వచ్చే ఏడాది ఫిబ్రవరి 11వ తేదీన హైదరాబాద్‌లో జరుగుతుందని ప్రపంచ మోటార్‌ క్రీడల సమాఖ్య బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఇదే విషయాన్ని మున్సిపల్ శాఖ స్పెషల్ సెక్రటరీ అరవింద్ కుమార్ ట్విట్టర్ వేదికగా వెల్లడించగా.. మంత్రి కేటీఆర్ షేర్ చేశారు.

దేశంలో జరిగే మొదటి ‘ఈ-రేస్’ కు ఆతిథ్యం ఇస్తున్న నగరంగా హైదరాబాద్ రికార్డు సృష్టించనుంది. 2011 నుంచి 2013 వరకు గ్రేటర్ నోయిడాలోని బుద్ద్ అంతర్జాతీయ సర్క్యూట్లో ఫార్ములా వన్ రేసు జరిగిన తర్వాత దేశంలో జరగబోగే రెండో అతి పెద్ద రేసింగ్ ఈవెంట్ ఇదే కానుంది. ట్యాంక్ బండ్, నెక్లస్ రోడ్డు మీదుగా పోటీలు నిర్వహించేందుకు తెలంగాణ సర్కార్ ఏర్పాట్లు చేయనుంది.

జనవరిలో ఒప్పందం....

విద్యుత్ కార్లతో జరిగే ఈ పోటీలకు ఆతిథ్యం ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం జనవరిలో ‘ఫార్ములా ఈ’ సంస్థతో ఇప్పటికే అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఫార్ములా -1 మాదిరిగా ‘ఈ–రేస్‌’కు ప్రత్యేక ట్రాక్‌ అవసరం ఉండదు. సాధారణ రోడ్లపైనే బ్యాటరీ కార్లతో రేసింగ్‌ నిర్వహిస్తారు. 2014–15లో ఈ పోటీలు మొదలయ్యాయి. భారత్ నుంచి మహింద్రా కంపెనీకి చెందిన ‘మహింద్ర రేసింగ్‌’జట్టు పోటీ పడుతోంది.

Whats_app_banner