Fire Breaks Out in Hyd Hotel: మలక్‌పేటలోని హోటల్‌లో అగ్నిప్రమాదం.. ఒకరి మృతి
Fire Accident In Hyderabad: హైదరాబాద్‌లోని మలక్‌పేటలో అగ్నిప్రమాదం సంభవించింది. ఓ హోటల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగ అలమకుంది. శుక్రవారం జరిగిన ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.
Fire Accident at Malakpet: హైదరాబాద్ మలక్‌పేటలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నల్గొండ చౌరస్తాలోనని సొహైల్ హోటల్ లో శుక్రవారం గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. అయితే హోటల్ లోపలే చిక్కుకున్న షాబుద్దీన్ అనే కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు.
స్థానికంగా దట్టమైన పొగలు వ్యాపించడంతో సమీప మలక్‌పేట ప్రభుత్వ ఆస్పత్రి రోగులు ఇబ్బంది పడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న మలక్‌పేట ఎమ్మెల్యే.. ప్రమాదానికి గలకారణాలు అడిగి తెలుసుకున్నారు. అయితే ఈ ప్రమాదం విద్యుదాఘాతం కారణంగా జరిగిందా.. లేక గ్యాస్ లీకేజి కారణమా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
అగ్నిప్రమాద ఘటనపై చాందర్ ఘాట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏసీపీ పీ. దేవేందర్ మాట్లాడుతూ... అగ్నిప్రమాద ఘటనలో ఒక వ్యక్తి చనిపోయినట్లు చెప్పారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
రోడ్డు ప్రమాదం - ఇద్దరు మృతి
హయత్‌నగర్ మండల పరిధిలోని పసుమాముల వద్ద శనివారం రోడ్డుప్రమాదం జరిగింది. అతివేగంగా దూసుకొచ్చిన బైకు అదుపుతప్పి స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో మోటారు సైకిల్‌పై ఉన్న ఇద్దరు దుర్మరణం చెందారు. మృతులను అనూష, హరికృష్ణగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని నిర్ధారించారు. ఈ ఘటనపై హయత్ నగర్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.