Genco Fire Accident: రామగుండం జెన్‌కో లో అగ్ని ప్రమాదం,తృటిలో తప్పిన ప్రాణ నష్టం-fire accident at ramagundam genco narrowly missed loss of life ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Genco Fire Accident: రామగుండం జెన్‌కో లో అగ్ని ప్రమాదం,తృటిలో తప్పిన ప్రాణ నష్టం

Genco Fire Accident: రామగుండం జెన్‌కో లో అగ్ని ప్రమాదం,తృటిలో తప్పిన ప్రాణ నష్టం

HT Telugu Desk HT Telugu
May 21, 2024 05:42 AM IST

Genco Fire Accident: పెద్దపల్లి జిల్లా రామగుండం జెన్ కో విద్యుత్ కేంద్రంలో తృటి లో పెద్ద ప్రమాదం తప్పింది. బాయిలర్ చిమ్నీ పై భాగం పగలడంతో దట్టమై పొగతో బూడిద ఎగిసిపడింది. చుట్టుప్రక్కల ప్రాంతాన్ని బూడిద కమ్మేసింది. దీంతో రామగుండంతోపాటు చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

రామగుండం జెన్‌కో ప్లాంటులో ప్రమాదం
రామగుండం జెన్‌కో ప్లాంటులో ప్రమాదం

Genco Fire Accident: రామగుండంలోని 62.5 మెగావాట్ల విద్యుత్ తాప కేంద్రంలో ట్యూబ్ లీక్ అయింది. చిమిని పై బాగం నుంచి దట్టమైన పొగ ఉవ్వెత్తున ఎగిసిడింది. అప్రమత్తమైన అధికారులు మంటలు ఎగిసిపడి విస్తరించకుండా నివారణ చర్యలు చేపట్టారు.

పెద్దపల్లి జిల్లా రామగుండం జెన్ కో విద్యుత్ కేంద్రంలో తృటి లో పెద్ద ప్రమాదం తప్పింది. బాయిలర్ చిమ్నీ పై భాగం పగలడంతో దట్టమై పొగతో బూడిద ఎగిసిపడింది. చుట్టుప్రక్కల ప్రాంతాన్ని బూడిద కమ్మేసింది. దీంతో రామగుండంతోపాటు చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

అప్పటికే బూడిదతో పాటు పొగ ఆప్రాంతాన్ని కమ్మేయడంతో స్థానికులు భయాందోళనతో ఇళ్ళ నుంచి బయటకు వచ్చారు. ఏమో అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. జెన్ కో అధికారులు అప్రమత్తమై సహయక చర్యలు చేపట్టారు. బూడిదతో కూడిన పొగ ఆగిపోయింది. జెన్ కో లో 62.5 విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది.

బిక్కుబిక్కుమంటు కాలం గడపుతున్న స్థానికులు

రామగుండం జెన్ కో విద్యుత్ ఉత్పత్తి కేంద్రం చుట్టుప్రక్కల నివాస గృహాలు ఉన్నాయి. దట్టమైన పొగతో బూడిద ఎగిసి పడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మంటలు విస్తరించకుండా అధికారులు చర్యలు చేపట్టినప్పటికి జనవాసాల మద్య ఉన్న జెన్ కో బాయిలర్ పేలితే ఏలా ఉంటుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.

ట్యూబ్ లీక్ అయి బాయిలర్ పేలితో పరిస్థితి ఏంటని...జరగకూడని నష్టం జరిగితే ఎవరు బాద్యత వహిస్తారని జెన్ కో అధికారులను ప్రశ్నించారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిచో ఆందోళన చేపట్టక తప్పదని హెచ్చరించారు.

అనుకోని సంఘటన..పునఃరావృతం కాకుండా చర్యలు

అనూహ్యంగా జెన్ కో లో బాయిలర్ చిమిని లీక్ అయి బూడిదతో కూడిన పొగ వచ్చిందని తక్షణమే సహయక చర్యలు చేపట్టామని జేన్ కో అదికారులు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపడుతామని స్పష్టం చేశారు.

సాంకేతిక లోపంతోనే బాయిలర్ చిమ్ని పేయిల్ అయిందని మంటలు విస్తరించకుండా చర్యలు చేపట్టామని తెలిపారు. స్థానికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. యుద్దప్రాతిపథికన చర్యలు చేపట్టామని త్వరలోనే 62.5 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని పునఃరుద్దరిస్తామని ప్రకటించారు.

(రిపోర్టింగ్ కేవీ.రెడ్డి, కరీంనగర్)

Whats_app_banner