New Courts : తెలంగాణలో కొత్తగా మరో 57 కోర్టులు - ఎక్కడెక్కడంటే?-establishment of 57 new courts in telangana state ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  New Courts : తెలంగాణలో కొత్తగా మరో 57 కోర్టులు - ఎక్కడెక్కడంటే?

New Courts : తెలంగాణలో కొత్తగా మరో 57 కోర్టులు - ఎక్కడెక్కడంటే?

Maheshwaram Mahendra Chary HT Telugu
Oct 07, 2023 11:18 AM IST

New Courts in Telangana: తెలంగాణలో కొత్తగా మరో 57 కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులను జారీ చేసింది.

తెలంగాణలో కొత్త కోర్టులు
తెలంగాణలో కొత్త కోర్టులు

New Courts in Telangana: రాష్ట్రంలో కొత్తగా మరిన్ని కోర్టులు రానున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 57 కోర్టులను మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. అదనపు జిల్లా, సెషన్స్‌ జడ్జి, సీనియర్‌ సివిల్‌ జడ్జి, జూనియర్‌ సివిల్‌ జడ్జి కేడర్లలో ఈ కోర్టులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది.

రాష్ట్రంలో పెండింగ్ కేసులు ఎక్కువగా ఉండటంతో పాటు…. రోజురోజుకూ కొత్త కేసుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. దీనిపై ప్రస్తుతం ఉన్న కోర్టులపై పని భారం కూడా ఎక్కువైపోయింది. ఇదే విషయాన్ని హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌… రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం….. కొత్త కోర్టులను మంజూరు చేసింది. ఇందులో భాగంగా…. 57 కొత్త కోర్టులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది.

కింద ఇచ్చిన PDFలో కొత్త కోర్టులు ఏర్పాటై ప్రాంతాల వివరాలు ఉన్నాయి:

బాలలపై జరిగే నేరాల విచారణకు ప్రత్యేకంగా 10 కోర్టుల ఏర్పాటుకు ప్రాధాన్యమిచ్చింది సర్కార్. ఇందులో … ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, సంగారెడ్డి, నల్గొండ, ఎల్బీనగర్, వరంగల్ ప్రాంతాలు ఉన్నాయి.

Whats_app_banner