Govt Jobs 2024 : హైదరాబాద్ డిఫెన్స్ ల్యాబొరేటరీస్ స్కూల్‌లో టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాలు - ముఖ్య వివరాలివే
DLS RCI Hyderabad Recruitment 2024: హైదరాబాద్‌లోని డిఫెన్స్ ల్యాబొరేటరీస్ స్కూల్, ఆర్‌సీఐ నుంచి ఉద్యోగ ప్రకటన విడుదలైంది. ఇందులో భాగంగా…. 15 ఉద్యోగాలను అడ్‌హక్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు.
DLS RCI Hyderabad Recruitment 2024: హైదరాబాద్‌లోని డిఫెన్స్ ల్యాబొరేటరీస్ స్కూల్, ఆర్‌సీఐ ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా 15 ఉద్యోగాలను భర్తీ చేయనుంది.అడ్‌హక్ ప్రాతిపదికన భర్తీ ఈ ఉద్యోగాల్లో టీచింగ్, నాన్ - టీచింగ్ కొలవులు ఉన్నాయి. దరఖాస్తులకు జూన్ 10వ తేదీని తుది గడువుగా ప్రకటించారు. ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ముఖ్య వివరాలు..
- ఉద్యోగ నోటిఫికేషన్ - డిఫెన్స్ ల్యాబొరేటరీస్ స్కూల్, ఆర్‌సీఐ, హైదరాబాద్.
- మొత్తం ఖాళీలు - 15
- ఖాళీల వివరాలు - ప్రైమరీ టీచర్: 05 పోస్టులు
ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ): 05 పోస్టులు
ల్యాబ్ ఇన్‌ఛార్జ్ (ఏటీఎల్ ల్యాబ్ ఇన్‌చార్జ్): 01 పోస్టు
ఏఐ టీచర్ (టీజీటీ): 01 పోస్టు
ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్: 02 పోస్టులు
అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్: 01 పోస్టు
- వయోపరిమితి : పోస్టును అనుసరించి వయోపరిమితి వివరాలను పేర్కొన్నారు.
- అర్హతలు - పోస్టును అనుసరించి డిప్లొమా, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, డీఈడీ, బీఈడీ ఉండాలి. టీచింగ్ పోస్టులకు టెట్, సీటెట్ ఉత్తీర్ణత తప్పనిసరి. పని అనుభవం కూడా ఉండాలి.
- దరఖాస్తులు - ఆన్ లైన్ లో ఫామ్ ను డౌన్లోడ్ చేసుకోని ఆఫ్ లైన్ లో సమర్పించాలి.
- దరఖాస్తుకు చివరి తేదీ: 10.06.2024.
- దరఖాస్తు ఫారమ్ డౌన్లోడ్ లింక్ - https://www.dlsrci.in/media/docs/TeachersRecruitmentRegistrationForm.pd
- అప్లికేషన్లు పంపాల్సిన చిరునామా - DEFENCE LABORATORIES' SCHOOL, VIGNYANAKANCHA, RCI, HYDERABAD - 500069.
- ఈమెయిల్- DLSRCI.RECRUITMENT@GMAIL.COM
పోస్టుల భర్తీకి హైదరాబాద్ NIN ప్రకటన…..
ICMR NIN Vacancy 2024 Notification: హైదరాబాదులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్(ICMR) నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది.ఇందులో భాగంగా మొత్తం 44 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఇందులో టెక్నికల్ అసిస్టెంట్ టెక్నీషియన్- గ్రేడ్ 1తో పాటు ల్యాబొరేటరీ అటెండెంట్ పోస్టులు ఉన్నాయి.
ఈ పోస్టులకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.మే 23వ తేదీ నుంచే అప్లికేషన్ల ప్రాసెస్ ప్రారంభం కాగా… జూన్ 16వ తేదీని తుది గడువుగా ప్రకటించారు. రాత పరీక్ష జూలైలో ఉంటుంది. https://www.nin.res.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తు ప్రాసెస్ ను పూర్తి చేసుకోవచ్చు.
ముఖ్య వివరాలు:
ఉద్యోగ ప్రకటన - నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, హైదరాబాద్
మొత్తం ఖాళీలు - 44
ఖాళీల వివరాలు : టెక్నికల్ అసిస్టెంట్- 8, టెక్నీషియన్- గ్రేడ్ 1- 14 ల్యాబ్ అటెండెంట్ గ్రేడ్ 1 - 22 ఉద్యోగాలు.
అర్హత- పోస్టును అనుసరించి టెన్త్, ఇంటర్మీడియట్, డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. పని అనుభవం కూడా ఉండాలి. పూర్తి స్థాయి నోటిఫికేషన్ లో ఆ వివరాలను చూడొచ్చు.
ఎంపిక విధానం - రాత పరీక్ష ఆధారంగా
దరఖాస్తులు - ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
అప్లికేషన్ రుసుం - ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులు రూ. 1000 చెల్లించాలి. మిగతా అభ్యర్థులు రూ.1200 చెల్లించాలి.
దరఖాస్తులు ప్రారంభం -మే 23, 2024.
దరఖాస్తు చివరి తేదీ- 16-జూన్-2024.
రాత పరీక్ష- జులై 2024లో ఉంటుంది. తేదీలను ప్రకటిస్తారు.
అధికారిక వెబ్ సైట్ - https://www.nin.res.in/
అప్లికేషన్ డైరెక్ట్ లింక్ - https://icmrnin-recruitment.aptonline.in/
టాపిక్