ACB Trap in Medak : లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కానిస్టేబుల్
Constable Caught by ACB in Medak: మెదక్ జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న ఓ కానిస్టేబుల్…ఏసీబీకి చిక్కాడు. రూ. 4 వేలు లంచం తీసుకుంటుండగా… అధికారులకు రెడ్ హ్యాండెండ్ గా దొరికిపోయాడు.
Constable Caught by ACB in Medak : ఎంతమంది అధికారులు అవినీతి అధికారుల వలలో చిక్కుకొని తమ ఉద్యోగాలు పోగొట్టుకున్నా… కొందరు గవర్నమెంట్ అధికారులు తమ తీరు మార్చుకోవడం లేదు. ఇలాంటి సంఘటనే మరొకటి మెదక్ జిల్లాలో(Constable Caught by ACB in Medak) వెలుగుచూసింది. మెదక్ రురల్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ లంచం తీసుకుంటూ ఏసిబి అధికారులకు పట్టుబడ్డాడు.
అనిశా డీఎస్పీ ఆనంద్ తెలిపిన వివరాల ప్రకారం మెదక్ పట్టణ పరిధిలోని అవుసులపల్లికి చెందిన కందుల చంద్రం ఇటీవల తన ట్రాక్టర్ లో ఇసుక తరలిస్తుండగా స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆపినా,ట్రాక్టర్ ఆపకుండా వెళ్లిపోవడంతో వారు మెదక్ రురల్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు చంద్రానికి ఫోన్ చేసి ట్రాక్టర్ ని తీసుకొని రావాలని చెప్పగా,అతడు ట్రాక్టర్ తో పోలీస్ స్టేషన్ కు రాగానే కేసు నమోదు చేశారు. ట్రాక్టర్ బయటకు రావాలంటే రూ. 20 వేలు ఇవ్వాలని కానిస్టేబుల్ (రైటర్ ) సురేందర్ డిమాండ్ చేయగా చంద్రం రూ. 15 వేలు ఇచ్చాడు. అనంతరం పట్టుబడిన ట్రాక్టర్ విషయమై మైనింగ్ అధికారులకు లేఖ రాశారు. వారు రూ. 5 వేలు జరిమానా విధించి రిలీజ్ ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్ కాపీ తో చంద్రం ట్రాక్టర్ తెచ్చుకునేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్ళాడు. ఒప్పందంలో భాగంగా మిగిలిన రూ. 5 వేలు ఇవ్వాలని కానిస్టేబుల్ సురేందర్ డిమాండ్ చేయగా చంద్రం రూ. 4 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అనంతరం బాధితుడు అనిశాను ఆశ్రయించాడు. అందులో భాగంగా మంగళవారం సాయంత్రం కానిస్టేబుల్ కు రూ. 4 వేలు లంచం ఇస్తుండగా అనిశా అధికారులు రెడ్ హ్యాండెడ్ పట్టుకొని కానిస్టేబుల్ సురేందర్ ను అదుపులోకి తీసుకున్నారు. దీంతో కానిస్టేబుల్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ…. ఇసుక ట్రాక్టర్ విడుదల కోసం మొదట తీసుకున్న రూ. 15 వేలు ఓ సార్ కి ఇచ్చానని సురేందర్ తెలిపాడన్నారు. సార్ ఎవరనేది పూర్తి స్థాయి విచారణలో తేలుతుందని చెప్పారు. ఈ ఘటనలో ఇంకా ఎవరెవరు ఉన్నారనే విషయమై దర్యాప్తు చేస్తున్నట్లు డిఎస్పీ తెలిపారు. సురేందర్ ని అనిశా(ACB) కోర్ట్ లో హాజరు పరుస్తామని తెలిపారు.
యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య...
ఆన్లైన్ గేమ్ లకు అలవాటు పడి అప్పులు చేసి వాటిని తీర్చలేక మనస్తాపంతో ఫార్మసీ ఉద్యోగి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిద్ధిపేట జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే సిద్దిపేట పరిధిలోని ప్రశాంత్ నగర్ కు చెందిన మద్దెల పవన్ కళ్యాణ్ (25) జగదేవ్ పూర్ మండలంలోని ఎంఎస్ఎన్ ప్రైవేట్ ఫార్మసీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. డబ్బులు సులభంగా సంపాదించవచ్చని కొన్ని రోజులుగా ఆన్లైన్ గేమ్స్ ఆడేందుకు అప్పులు చేసాడు. అవి తీర్చే మార్గం కనపడగా మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో ఈ నెల 16 న ఇంటి నుండి డ్యూటీకి వెళ్తున్నానని చెప్పి వెళ్లి మరల తిరిగి రాలేదు. తల్లిదండ్రులు ఎక్కడ వెతికిన అతని ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో మంగళవారం కొండపాక మండలం వెలికట్ట శివారులోని రైల్వే ట్రాక్ పక్కన చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అటు వెళ్లిన వారు చూసి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.