CUET Results 2022: కామన్‌ యూనివర్శిటీస్‌ ఎంట్రన్స్ రిజల్ట్స్‌ విడుదల-common universities entrance test 2022 results by nta released ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cuet Results 2022: కామన్‌ యూనివర్శిటీస్‌ ఎంట్రన్స్ రిజల్ట్స్‌ విడుదల

CUET Results 2022: కామన్‌ యూనివర్శిటీస్‌ ఎంట్రన్స్ రిజల్ట్స్‌ విడుదల

B.S.Chandra HT Telugu
Sep 16, 2022 07:05 AM IST

CUET Results 2022: నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) ఆధ్వర్యంలో నిర్వహించిన కామన్‌ యూనివర్శిటీ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. CUET UG 2022 ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. అండర్‌ గ్రాడ్యుయేట్ కోర్సులకు సంబంధించిన కామన్‌ యూనివర్శిటీస్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.

ఎన్టీఏ నిర్వహించిన కామన్‌ యూనివర్శిటీ ఎంట్రన్స్‌ టెస్ట్ ఫలితాలు విడుదల
ఎన్టీఏ నిర్వహించిన కామన్‌ యూనివర్శిటీ ఎంట్రన్స్‌ టెస్ట్ ఫలితాలు విడుదల (HT_PRINT)

CUET Results 2022: దేశ వ్యాప్తంగా సెంట్రల్ యూనివర్శిటీల్లో ప్రవేశాలకు సంబంధించిన కామన్‌ యూనివర్శిటీ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్షకు హాజరైన అభ్యర్ధులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ cuet.samarath.ac.in లో పొందుపరిచారు. దీంతో పాటు విద్యార్ధులు తమ స్కోర్ కార్డులను ntaresults.nic.in తో పాటు nta.ac.in వెబ్‌సైట్‌ల నుంచి పొందవచ్చు.

కామన్ యూనివర్శిటీస్‌ ఎంట్రన్స్‌లో ప్రతి అభ్యర్ధి సామర్ధ్యాన్ని గుర్తించేలా మూల్యాంకనం నిర్వహించారు. ఒకే సబ్జెక్టుపై వేర్వేరు తేదీలలో దేశవ్యాప్తంగా పరీక్షలు నిర్వహించడంతో మూల్యాంకనంలో ఖచ్చితమైన ప్రమాణాలను పాటించినట్లు ఎన్టీఏ ప్రకటించింది.

కామన్‌ యూనివర్శిటీ ఎంట్రన్స్‌ టెస్ట్‌ మెరిట్‌ జాబితాను భాగస్వామ్య యూనివర్శిటీలు, విద్యా సంస్థలతో కలిసి రూపొందించారు. అయా యూనివర్శిటీలు ఎన్టీఏ జారీ చేసే స్కోర్‌ కార్డులు ఆధారంగా తమ యూనివర్శిటీలలో ప్రవేశాల కోసం కౌన్సిలింగ్ ప్రక్రియ నిర్వహిస్తాయి.

కామన్ యూనివర్శిటీ ఎంట్రన్స్‌ ఫలితాలు తెలుసుకోండిలా...

అభ్యర్ధులు కామన్‌ యూనివర్శిటీ ఎంట్రన్స్‌ ఫలితాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ cuet.samarath.ac.inకు వెళ్లాల్సి ఉంటుంది.

CUET 2022 Results స్కోర్ కార్డు చూడటానివకి వెబ్‌సైట్‌లోకి లాగిన్ కావాలి. ఎన్టీఏ కామన్‌ యూనివర్శిటీ ఎంట్రన్స్‌ టెస్ట్‌ అప్లికేషన్‌ నంబర్, పాస్ వర్డ్‌, సెక్యూరిటీ పిన్‌‌లను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

కామన్ యూనివర్శిటీ ఎంట్రన్స్‌ టెస్ట్‌ 2022 ఫలితాలు (CUET 2022 Results) స్క్రీన్‌పై కనిపిస్తాయి. వాటిని డౌన్‌ లోడ్‌ లేదా ప్రింట్ చేసుకోవచ్చు.గురువారం సాయంత్రమే కామన్ ఎంట్రన్స్ ఫలితాలు విడుదల కావాల్సి ఉన్నా శుక్రవారం ఉదయానికి సైట్‌లో అప్డేట్ చేశారు. కామన్ యూనివర్శిటీ ఎంట్రన్స్‌ టెస్ట్‌ పరీక్షల్లో పెద్ద సంఖ్యలో కాంబినేషన్లు, సబ్జెక్టు పేపర్లకు ప్రవేశ పరీక్ష నిర్వహించారు. విద్యార్ధులు దాదాపు 54,555 విభిన్న కాంబినేషన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని ఎన్టీఏ అధికారులు వివరించారు.

కామన్ యూనివర్శిటీ ఎంట్రన్స్‌ టెస్ట్ ప్రక్రియ జులై ప్రారంభమై ఆగష్టు చివరకు ముగిసింది. దరఖాస్తు చేసిన వారిలో 60శాతం మంది విద్యార్ధులు ఎంట్రన్స్‌ టెస్ట్‌కు హాజరయ్యారు. ఆగష్టు 20నాటికి అన్ని సెషన్లలో ఎంట్రన్స్‌ పరీక్ష పూర్తి చేయాలని ఎన్టీఏ భావించింది. విద్యార్ధుల సంఖ్య అధికంగా ఉండటంతో పరీక్షల్ని ఆరు దశలకు పొడిగించాల్సి వచ్చింది.

సెంట్రల్ యూనివర్శిటీలో అండర్‌ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం కామన్ యూనివర్శిటీ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (CUET) నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది పరీక్షల నిర్వహణల విద్యార్ధులకు చాలా సమస్యలు ఎదురయ్యాయి. సాంకేతిక సమస్యలతో పాటు చివరి నిమిషంలో మార్పులు చేయడం కూడా విద్యార్ధుల్ని ఇబ్బంది పెట్టింది. పరీక్షా తేదీల్లో మార్పులు, అడ్మిక్ కార్డుల్లో వివరాల్లో తేడాలు వంటి సమస్యలు విద్యార్ధుల్ని ఇబ్బంది పెట్టాయి.

మొత్తం 14.9లక్షల మంది కామన్‌ ఎంట్రన్స్‌ పరీక్షకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. నీట్‌ తర్వాత జాతీయ స్థాయిలో భారీ స్థాయిలో కామన్‌ యూనివర్శిటీ ఎంట్రన్స్‌ పరీక్షకే అత్యధికంగా విద్యార్ధులు దరఖాస్తు చేసుకున్నారు. నీట్‌ పరీక్షకు 18లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. జేఈఈ మెయిన్స్‌కు కేవలం 9లక్షల మంది మాత్రమే రిజిస్ట్రేషన్ చేయించుకోగా కామన్ యూనివర్శిటీ ఎంట్రన్స్‌ టెస్ట్‌కు భారీ సంఖ్యలో విద్యార్ధులు దరఖాస్తు చేసుకున్నారు.

ఆరు దశల్లో నిర్వహించిన పరీక్షలకు సంబంధించిన కీ సెప్టెంబర్ 8న విడుదల చేశారు. విద్యార్ధుల అభ్యంతరాలను సెప్టెంబర్ 10వరకు స్వీకరించారు. కొన్ని ప్రాంతాల్లో సెప్టెంబర్ 11న రి ఎగ్జామ్ కూడా నిర్వహించారు. విద్యార్ధుల ఆందోళనలు, అభ్యంతరాల నేపథ్యంలో ఎన్టీఏ అవసరమైన చోట రీ ఎగ్జామ్ నిర్వహించింది.

IPL_Entry_Point