Girlfriend Torture: ప్రియురాలి టార్చర్ తట్టుకోలేక ప్రియుడు ఆత్మహత్య ..
Girlfriend Torture: డబ్బుల కోసం ప్రియురాలు వేధిస్తుండంటతో తట్టుకోలేక పోయిన యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లాలో జరిగింది.
Girlfriend Torture: వారిద్దరు ప్రేమించుకున్నారు. ఇరు కుటుంబాల పెద్దలు ఒప్పుకోక పోవడంతో, అమ్మాయిని వేరే అతనికి ఇచ్చి వివాహం చేశారు. భర్తతో ఉండటం ఇష్టం లేక, అతనని వదిలి తల్లి వద్దే ఉంటానంటూ తిరిగి వచ్చింది. భర్తను వదిలి తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రియుని తో సంబంధం కొన సాగించింది.
ఇద్దరి బంధం కొన్నాళ్లు బాగానే కొనసాగింది. యువకుడిని తరచుగా డబ్బులు కావాలని వేధించేడంతో, వాటిని తట్టుకోలేక యువకుడు ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ విషాదకర సంఘటన మెదక్ జిల్లాలోని హవేళి ఘన్‌పూర్ మండలంలోని లింగసంపల్లి గ్రామంలో గురువారం జరిగింది. గ్రామానికి చెందిన రామన్న గారి ఆంజనేయులు, పద్మ ల కుమారుడైన అరుణ్ (20) కార్ డ్రైవర్ గా పనిచేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు.
ఇదే గ్రామానికి చెందిన అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. వారి ప్రేమకు పెద్దల సమ్మతి లేకపోవడంతో, ఆ అమ్మాయికి వేరే అబ్బాయితో వివాహం జరిపించారు. పెళ్లైన మూడు నెలలు కాకుండానే పుటింటికి వచ్చేసిన యువతి అరుణ్‌తో సంబంధం కొనసాగించింది.
భర్తతో పట్టుమని మూడు నెలలు కూడా కాపురం చేయకుండానే, తల్లి తండ్రుల దగ్గరికి తిరిగి వచ్చింది. అరుణ్‌తో అంతకుముందు ఉన్న అనుబంధం కొనసాగిస్తూ, తరచుగా అతని దగ్గర డబ్బులు తీసుకునేది. ఆ యువతి నుండి డబ్బుల కోసం వేధింపులు ఎక్కువ కావడంతో అవి తట్టుకోలేక అరుణ్ బుధవారం రాత్రి తన కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసిన తర్వాత అందరు నిద్రలోకి జారుకోగానే, ఇంట్లోనే దూలానికి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
పొద్దున్నే లేసి చూసేసరికి, దూలానికి నిర్జీవంగా వేలాడుతున్న కుమారున్ని చూసి తల్లి తండ్రులు లబోదిబోమన్నారు. అరుపులు విన్న గ్రామస్థులు అందరు అక్కడికి చేరుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులకు అరుణ్ జేబులో సూసైడ్ నోట్ రాసి పెట్టి చనిపోయాడని చెప్పారు. ఆ సూసైడ్ నోట్ లో అరుణ్ ఆ అమ్మాయికి , ఆమె తల్లికి ఇప్పటివరకు రూ 68 వేలు ఇచ్చానని, ఇంకా తనను డబ్బులకోసం వేధిస్తున్నారని రాశాడు.
వారి వేధింపులు తట్టుకోలేక తాను చనిపోవాలని అనుకుంటున్నాని అరుణ్ లేఖలో రాశాడు. మృతుడి కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.