BJP Etala Rajender : BRSతో తెలంగాణతో ఉన్న బంధం తెగిపోయిందన్న ఈటల రాజేందర్-bjp mla etala rajender slams brs party and cm kcr ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bjp Etala Rajender : Brsతో తెలంగాణతో ఉన్న బంధం తెగిపోయిందన్న ఈటల రాజేందర్

BJP Etala Rajender : BRSతో తెలంగాణతో ఉన్న బంధం తెగిపోయిందన్న ఈటల రాజేందర్

HT Telugu Desk HT Telugu
Oct 07, 2022 08:43 PM IST

BJP Etala Rajender మునుగోడు ఎన్నికల్లో కెసిఆర్ ఓడిపోవాలని ధర్మం, న్యాయం, ప్రజాస్వామ్యం, బీజేపీ, రాజగోపాల్ రెడ్డి గెలవాలని కోరుకుంటున్నారన్నారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. మనుషులు మాత్రం తెరాసాతో ఉన్నారని, మనసులు బీజేపీతో ఉన్నారని చెప్పారు. కెసిఆర్ డబ్బులు మోజులో బ్రతుకుతున్నారని ఈటల విమర్శించారు.

<p>మునుగోడులో గెలుపుపై ఈటల రాజేందర్ ధీమా</p>
మునుగోడులో గెలుపుపై ఈటల రాజేందర్ ధీమా

BJP Etala Rajender ఉమ్మడి మెదక్ జిల్లాలో కేవలం భయంతో మాత్రమే టిఆర్ఎస్‌లో కొనసాగుతున్నారు తప్ప ప్రేమతో కాదన్నారు ఈటల రాజేందర్‌. ముఖ్యమంత్రి కేసీఆర్, జిల్లా మంత్రి హరీష్ రావు ఇంటెలిజెన్స్ ద్వారా విషయాలు తెలుసుకొని ఎన్ని ప్రలోభాలు పెట్టినా కూడా ఇక్కడ ఉన్న కార్యకర్తలు భయపడటం లేదని, ప్రలోభాలకు లొంగడం లేదన్నారు.

ప్రస్తుత ప్రజాప్రతినిధులు పదుల సంఖ్యలో, మాజీ ప్రజాప్రతినిధులు వందల సంఖ్యలో బిజెపిలో చేరబోతున్నారని, ఇతర పార్టీల నాయకులకు కూడా కెసిఆర్ ను ఒడించాలి అంటే బీజేపీలో చేరాలని ఈటల పిలుపు నిచ్చారు.

వంటి మామిడి నుంచి మొదలుపెట్టి సిద్దిపేట వరకు వేలఎకరాల అసైన్మెంట్ భూములు భయపెట్టించి లాక్కుంటున్నారని, ఈ భూములను మీరు అమ్ముకోలేరు మాకు ఇచ్చేయండి అని కోటి నుంచి మూడు కోట్ల రూపాయల విలువైన భూములను దళితుల కళ్ళల్లో మట్టి కొట్టి ఐదు లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చి వందల ఎకరాలు కంపెనీల పేరిట తీసుకొని కెసిఆర్ బంధు వర్గానికి, దగ్గరి మనుషులకు కట్టబెడుతున్నారని ఈటల ఆరోపించారు.

ముఖ్యమంత్రిని చేసిన ఖర్మానికి మా భూముల్ని కొల్లగొట్టారని దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. మెదక్ జిల్లాలోనే కాకుండా రాష్ట్రమంతా ఇది పరిస్థితి ఉందని ఆరోపించారు. హైదరాబాదులో రింగ్ రోడ్డు చుట్టూ 5800 ఎకరాల దళితుల భూములను లాక్కుంటున్నారని, వేల కోట్ల రూపాయల విలువైన భూములను ఆక్రమించి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ప్రైవేట్ కంపెనీలకు ఇస్తున్నారని ఈటల ఆరోపించారు. ధరణి వచ్చిన తర్వాత మొదటగా దళితుల కళ్ళలో మట్టి కొట్టారని, ప్రభుత్వ భూములను సాగు చేసుకుంటున్నా వాటిని గుంజుకుంటున్నారని ఆరోపించారు. పోరాటాల ద్వారా వచ్చిన భూములను లాక్కుంటున్నారని విమర్శించారు.

తెలంగాణ వ్యాప్తంగా 60 వేల కోట్ల రూపాయల భూములను గద్దలెక్క తన్నుకు పోయినట్లుగా లెక్కలు చెబుతున్నాయి. రైతుల పేర్లు ఊర్లతో సహా త్వరలో బయట పెడతామని ఈటల చెప్పారు. ఈ దేశంలోనే ఏ పార్టీకి లేనన్ని డబ్బులు తెలంగాణ రాష్ట్ర సమితి సంపాదించుకుందని, 870 కోట్ల రూపాయల ఆస్తులు డబ్బులు మా పార్టీకి ఉన్నాయని గొప్పగా చెబుతున్నారని, విమానాలు, హెలికాప్టర్లు కొంటామని బహిరంగంగా ప్రకటిస్తున్నారన్నారు.

కాంగ్రెస్, బిజెపితో పాటు దేశంలో ఏ పార్టీకి కూడా సొంత విమానాలు, హెలికాప్టర్లు లేవు. టిఆర్‌ఎస్‌ఖు ఎక్కడి నుంచి వచ్చాయన్నారు. పేదలను కొట్టి పెద్దలకు వేసే పద్ధతిలో కేసీఆర్ నిష్ణాతుడన్నారు. మాట మాట్లాడితే సంక్షేమ పథకాలు అత్యధికంగా అమలు చేస్తున్న రాష్ట్రం అని కెసిఆర్ చెప్తున్నారని కల్యాణలక్ష్మికి 500 కోట్లు, పెన్షన్లకు 12 వేల కోట్లు, రైతుబంధు పేరుతో మరో 12 వేల కోట్లు ఇస్తున్నారు. మొత్తం కలిస్తే 25 నుంచి 26000 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాల కోసం కేసీఆర్ ఇస్తున్నారని కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మద్యం మీద ఆదాయాన్ని 11 వేల కోట్ల నుంచి 45 వేల కోట్లకు చేర్చారన్నారు. ప్రతి 100 మందికి ఒక బెల్ట్ షాపు పెట్టి తాగిపిస్తున్నారన్నారు. ఎనిమిది సంవత్సరాల చరిత్రలో లక్షలమంది ప్రజానీకాన్ని తాగడుగు బానిసలుగా చేసి, పేదల రక్తాన్ని పిండీ వసూలు చేస్తున్న డబ్బు నలభై ఐదు వేల కోట్లని ఆరోపించారు.

కళ్యాణ లక్ష్మి పేరుతో పుస్తెలు కట్టడానికి 2 వేల కోట్లు ఇచ్చిన కెసిఆర్..అదే పుస్తెల తెంపి మద్యం మీద 45 వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని విమర్శించారు. లిక్కర్‌ మీద ఇంత ఆదాయం వచ్చే రాష్ట్రం వేరే ఏదన్నా ఉంటే ముక్కు నేలకు రాస్తానన్నారు. BRS పెట్టీ దేశానికి తాగుడు అలవాటు చేస్తారా అని ప్రశ్నించారు. కెసిఆర్ దగ్గరికి వెళ్లిన ఏ ఒక్క ఎమ్మెల్యే ఉత్తగా పోలేదని కొనుగోళ్ల పర్వం కొనసాగిందని ప్రజలు మా పక్షాన కొట్లాడండి అని పంపిస్తే వారికి వెల కట్టి తీసుకున్నారని విమర్వించారు. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా వేయకుండానే తెరాసాలో చేరారు. రాజీనామా చేయకుండా ఎలా మంత్రులుగా వెలగబెడతారు. దమ్ముంటే రాజీనామా చెయాలన్నారు.

నేను గెలిస్తే ప్రగతి భవన్లో, ఫామ్ హౌస్ లో పడుకొనే సీఎం ప్రజల మధ్యకు వస్తాడని చెప్పాను. అదే జరుగుతుందన్నారు. బుద్ది జీవులు అంత కెసిఆర్ కి వ్యతిరేకంగా ఉన్నారు. చాలామంది ఫోన్ చేసి డబ్బులు సమాచారం చెప్తున్నారు. అయినా మేము ఆ డబ్బులు ఆపడం లేదు. మీ అక్రమ సంపాదన అంతా మునుగోడు ప్రజలకు చేరాలన్నారు. నర్సాపూర్ లో ఈ నెల 9 వ తేదీన బీజేపీలో చేరనున్న టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మురళి యాదవ్ ను అభినందించారు. బహిరంగసభకు ఏర్పాట్లను ఈటల రాజేందర్ పరిశీలించారు.

Whats_app_banner