Bhadrachalam : భద్రాద్రిలో ఈ నెల 16, 17న ట్రాఫిక్ ఆంక్షలు-పార్కింగ్ స్థలాలు, సమాచారం కోసం క్యూఆర్ కోడ్-bhadrachalam sri rama navami 2024 traffic diversion qr released for devotees know parking places ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bhadrachalam : భద్రాద్రిలో ఈ నెల 16, 17న ట్రాఫిక్ ఆంక్షలు-పార్కింగ్ స్థలాలు, సమాచారం కోసం క్యూఆర్ కోడ్

Bhadrachalam : భద్రాద్రిలో ఈ నెల 16, 17న ట్రాఫిక్ ఆంక్షలు-పార్కింగ్ స్థలాలు, సమాచారం కోసం క్యూఆర్ కోడ్

HT Telugu Desk HT Telugu
Apr 15, 2024 07:59 PM IST

Bhadrachalam : భద్రాచలంలో సీతారాముల కల్యాణం, పట్టాభిషేకం కోసం పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం భారీ వాహనాలు భద్రాచలంలోకి రాకుండా ఈ నెల 16, 17న ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పార్కింగ్ స్థలాలు, లడ్డూ కౌంటర్లు, ఇతర సమాచారం కోసం క్యూఆర్ కోడ్ స్కానర్లు ఏర్పాటు చేశారు.

భద్రాద్రిలో ట్రాఫిక్ ఆంక్షలు
భద్రాద్రిలో ట్రాఫిక్ ఆంక్షలు

Bhadrachalam : భద్రాచలంలో కన్నుల పండుగగా జరిగే సీతారాముల కల్యాణ మహోత్సవానికి (Bhadrachalam Srirama Navami) ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. సీతారాముల కల్యాణం(Seetharamula Kalyanam) తిలకించేందుకు వచ్చే భక్తుల సౌకర్యం కోసం భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు నేతృత్వంలో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీరామనవమి రోజున వివాహ మహోత్సవంతో పాటు మరుసటి రోజున జరిగే పట్టాభిషేక ఉత్సవాలకు సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు భద్రాచలంలోని ఏఎస్పీ కార్యాలయంలో పోలీసు అధికారులతో ఎస్పీ సమీక్ష ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా సంబంధిత అధికారులతో సమన్వయం పాటిస్తూ ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

yearly horoscope entry point

భక్తుల కోసం క్యూఆర్ కోడ్

పోలీస్ అధికారులు, సిబ్బంది అందరూ తమకు కేటాయించిన విధులను బాధ్యతగా నిర్వర్తించాలని ఎస్పీ సూచించారు. సెక్టార్ల వారీగా ఇన్ ఛార్జ్ అధికారులు తమ క్రింది స్థాయి సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. సుమారుగా 2000 మంది పోలీసులతో పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఎస్పీ తెలియజేశారు. భక్తుల కోసం పార్కింగ్ స్థలాలు(Parking Places), లడ్డూ కౌంటర్లు, సెక్టార్ల వివరాలను తెలియజేస్తూ జిల్లా పోలీసుల తరపున ప్రత్యేకంగా ఒక QR కోడ్ ను, అదే విధంగా ఆన్లైన్ లింకు (https://bhadrachalam.netlify.app) ను రూపొందించినట్లు తెలిపారు. భక్తులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ట్రాఫిక్ ఆంక్షలు షురూ

శ్రీరామనవమి(Srirama Navami) ఉత్సవాల సందర్భంగా ఈ నెల 16, 17 తేదీల్లో భద్రాచలం విచ్చేసే భక్తుల రద్దీ దృష్ట్యా భారీ వాహనాలు, గూడ్స్ వాహనాలు, ఇతర పెద్ద వాహనాలను పట్టణంలోకి రాకుండా ఆంక్షలు(Traffic Restrictions) విధించినట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలియజేశారు. భారీ గూడ్స్ వాహనాలు అత్యవసరమైతే తప్ప పట్టణంలోకి రాకుండా పోలీసు ట్రాఫిక్ ఆంక్షలు పెట్టాలని తెలిపారు. సీతారాముల కల్యాణం(Seetharamula Kalyanam), పట్టాభిషేకం(Pathabhishekam) కార్యక్రమాల సందర్భంగా మిథిలా స్టేడియం చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు విధించే అవకాశం ఉన్నందున్నారు. రెండు రోజుల పాటు భద్రాచలం(Bhadrachalam) పట్టణానికి విచ్చేసే భక్తులు, వాహనదారులు పోలీసులకు సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి

Whats_app_banner

సంబంధిత కథనం