Bandi Sanjay On KCR : కేసీఆర్ మీద హత్య కేసు నమోదు చేయాల్సిందే-bandi sanjay sensational comments on cm kcr ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bandi Sanjay On Kcr : కేసీఆర్ మీద హత్య కేసు నమోదు చేయాల్సిందే

Bandi Sanjay On KCR : కేసీఆర్ మీద హత్య కేసు నమోదు చేయాల్సిందే

HT Telugu Desk HT Telugu
Nov 24, 2022 05:39 PM IST

Bandis Sanjay Comments On KCR : ఎఫ్ఆర్ఓ హత్యకు బాధ్యుడు ముఖ్యమంత్రేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. పోడు భూములకు పట్టాలిస్తానంటూ.. దాడులు చేయించడంవల్లే ఈ దుస్థితి వచ్చిందని ఆరోపించారు. అసెంబ్లీ సాక్షిగా కుర్చీ వేసుకుని పోడు పట్టాలిస్తానన్న సీఎం హామీ ఏమైంది? అని ప్రశ్నించారు.

బండి సంజయ్
బండి సంజయ్

ఖమ్మం జిల్లా రఘనాథపాలెం మండలంలోని ఈర్లపూడికి చెందిన ఫారెస్ట్ అధికారి శ్రీనివాసరావు హత్యకు ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) బాధ్యుడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్(Bandi Sanjay) ఆరోపణలు చేశారు. తక్షణమే సీఎం కేసీఆర్ పై హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పోడు భూముల(Podu Lands) సమస్యను పరిష్కస్తానని, కుర్చీ వేసుకుని పోడు రైతులకు పట్టాలిస్తానని అసెంబ్లీ(Assembly) సాక్షిగా కేసీఆర్ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. వేములవాడలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ ఫారెస్ట్ అధికారి హత్య, మంత్రి మల్లారెడ్డి, టీఆర్ఎస్ నేతలపై ఐటీ, ఈడీ దాడులపై స్పందించారు.

yearly horoscope entry point

ఫారెస్ట్ అధికారి శ్రీనివాసరావు హత్యకు(FRO Killed) ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యుడని బండి సంజయ్ కుమార్ అన్నారు. తక్షణమే సీఎం కేసీఆర్ పై హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అధికారులను పంపి దాడులు చేయించేది కేసీఆరేనని ఆరోపించారు. పంట చేతికొచ్చే సమయానికి దాడులు చేసి పంటను నాశనం చేయించారన్నారు.

'సమస్యను పరిష్కరించకుండా కేంద్రాన్ని బదనాం చేయడమే పనిగా పెట్టుకున్నడు. సీఎం(CM) కుట్రలకు అధికారులను బలి చేస్తున్నారు. బీజేపీ(BJP) నేతలకు నోటీసులతో బెదిరింపులకు దిగుతూ రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారు. తన పదవిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ కుటుంబం(KCR Family)పై వస్తున్న అవినీతి ఆరోపణలపై ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఆడుతున్న డ్రామా ఇది. లిక్కర్ స్కాంపై(Liquor Scam)కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదు. సీఎం, ఆయన కుటుంబం, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజల సొమ్మును అడ్డంగా దోచుకుంటున్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు.' అని బండి సంజయ్ అన్నారు.

ఐటీ, సీబీఐ, ఈడీ(ED) దాడులపై రాజకీయ విమర్శలు చేయడం సిగ్గు చేటు అని బండి సంజయ్ అన్నారు. ప్రజలను రాచిరంపాన పెట్టి అడ్డగోలుగా, అక్రమంగా ఆస్తులు సంపాదించిన వాళ్లను కంట్రోల్ చేయాలా? వద్దా? అని అడిగారు. రాజకీయ విమర్శలు చేసే వాళ్లు సమాధానం చెప్పాలన్నారు. అక్రమార్కులను పార్టీలకు ఆపాదించడం కరెక్ట్ కాదని చెప్పారు. అక్రమార్కుల మీద దాడులు చేస్తే అడ్డుకోవడమేంది? అని ప్రశ్నించారు.

'అధికారులు తనిఖీలు చేస్తే నిజాయితీని నిరూపించుకునే అవకాశం ఉంది. అది చేతగానివాళ్లే బూతులు తిడుతూ దాడులు చేస్తూ రాజకీయ రంగు పులుమతారు. అవినీతి తిమింగలాలను వదిలిపెట్టాలా? అవినీతి పరులు తప్పించుకోవడానికి ఏదో ఒక విమర్శలు చేయడం సిగ్గు చేటు. సీబీఐ(CBI), ఈడీ, ఐటీ శాఖలు స్వయం ప్రతిపత్తి గల సంస్థలు. బీజేపీ ఎంపీపైనా కూడా దాడులు చేశారు కదా.. వాటికి పార్టీలతో పనిలేదు.' అని బండి సంజయ్ అన్నారు.

Whats_app_banner